టీటీలో పతకాలకు గెలుపు దూరంలో... | Disappointment for Indian teams in table tennis team events | Sakshi
Sakshi News home page

టీటీలో పతకాలకు గెలుపు దూరంలో...

Sep 24 2026 4:08 AM | Updated on Sep 24 2026 4:08 AM

Disappointment for Indian teams in table tennis team events

టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టీమ్‌ ఈవెంట్స్‌లో భారత జట్లకు నిరాశ ఎదురుకాగా... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రెండు భారత జోడీలు యశస్విని–హర్మీత్‌ దేశాయ్, దివ్య చిటాలె–మనుశ్‌ షా క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాయి. పతకాలకు విజయం దూరంలో నిలిచాయి. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో యశస్విని–హర్మీత్‌ జంట 11–6, 11–5, 10–12, 11–7తో వింగ్‌ లామ్‌ ఎన్జీ–క్వాన్‌ టో యుయి (హాంకాంగ్‌) జోడీపై... దివ్య–మనుశ్‌ ద్వయం 11–0, 11–7, 11–6తో మూసా అహ్మద్‌–ఐషాత్‌ నజీమ్‌ (మాల్దీవులు) జంటపై గెలుపొందాయి. శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో భారత జోడీలు నెగ్గి సెమీఫైనల్‌ చేరుకుంటే కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి.

కబడ్డీలో ‘హ్యాట్రిక్‌’
డిఫెండింగ్‌ చాంపియన్స్‌ భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్లు వరుస విజయాలతో సెమీఫైనల్‌కు చేరువయ్యాయి. భారత పురుషుల జట్టు 48–25తో బంగ్లాదేశ్‌పై... భారత మహిళల జట్టు 37–23తో మాజీ చాంపియన్‌ ఇరాన్‌పై గెలిచాయి. నేడు జరిగే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ల్లో చైనీస్‌ తైపీతో భారత పురుషుల జట్టు... జపాన్‌తో భారత మహిళల జట్టు తలపడతాయి.   

బాక్సింగ్‌ క్వార్టర్స్‌లో అంకుశ్‌ 
భారత యువ బాక్సర్‌ అంకుశ్‌ పంఘాల్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. బుధవారం పురుషుల 80 కేజీల ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అంకుశ్‌ 5–0తో బహ్రెయిన్‌ బాక్సర్‌ హమ్సా వోగెల్‌పై విజయం సాధించాడు. కామన్వెల్త్‌ గేమ్స్‌ పసిడి పతక విజేత అయిన 21 ఏళ్ల అంకుశ్‌ జోరు ముందు బహ్రెయిన్‌ బాక్సర్‌ నిలవలేకపోయాడు. క్వార్టర్స్‌లో సలిమోవ్‌ (తజకిస్తాన్‌)తో అంకుశ్‌ తలపడనున్నాడు.  

అభయ్‌ సింగ్‌ శుభారంభం 
ఆసియా క్రీడల స్క్వాష్ లో భారత ప్లేయర్లు అభయ్‌ సింగ్, వీర్‌ చోత్రాని, తన్వీ ఖన్నా ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో బుధవారం రెండో సీడ్‌ అభయ్‌ సింగ్‌ 11–1, 11–0, 11–2తో అర్కరాడెట్‌ అర్కరాహిరుణ్య (థాయ్‌లాండ్‌)పై ఏకపక్ష విజయం సాధించాడు. వీర్‌ 11–8, 11–3, 11–3తో షమిల్‌ వకీల్‌ (శ్రీలంక)పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో తన్వీ ఖన్నా 11–5, 11–7, 11–5తో దామి కిమ్‌ (దక్షిణ కొరియా)పై గెలిచింది. భారత నంబర్‌వన్‌ ర్యాంకర్‌ అనాహత్‌ సింగ్‌ నేడు నేరుగా ప్రిక్వార్టర్స్‌ బరిలో దిగనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement