PC: BCCI/X
ఆసియా క్రీడలు-2026 పురుషుల క్రికెట్ టోర్నమెంట్‌కు సమయం అసన్నమైంది. జపాన్‌లోని నిస్షిన్ నగరంలో ఉన్న కోరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా గురువారం (సెప్టెంబరు 24) నుంచి ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పోటీపడుతున్నాయి.
భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించగా.. మిగిలిన ఆరు జట్లను (అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్, హాంకాంగ్, మలేషియా, ఒమన్) రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ దశ మ్యాచ్‌లలో తలపడి టాప్ పొజిషన్‌లో నిలిచే జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత పురుషుల క్రికెట్ జట్టు మరోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
మ్యాచ్‌లను ఎక్కడ చూడాలంటే?
ఈ ఏషియన్ గేమ్స్ మ్యాచ్‌లను భారత్‌లో అభిమానులు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు. అదేవిధంగా ఈ క్రికెట్ పోటీలను సోనీ లివ్ వెబ్‌సైట్, యాప్‌లో కూడా చూడవచ్చు.
పురుషుల క్రికెట్ షెడ్యూల్
క్వాలిఫయర్స్
👉సెప్టెంబర్ 24- అఫ్గానిస్తాన్ వర్సెస్ జపాన్
హాంకాంగ్-చైనా వర్సెస్ మలేషియా
👉సెప్టెంబర్ 25- హాంకాంగ్-చైనా వర్సెస్ ఒమన్
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ నేపాల్
👉సెప్టెంబర్ 26- జపాన్ వర్సెస్ నేపాల్
మలేషియా వర్సెస్ ఒమన్
క్వార్టర్‌ఫైనల్స్
👉సెప్టెంబర్ 28 (తొలి క్వార్టర్ ఫైనల్)- పాకిస్తాన్ వర్సెస్ గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచే జట్టు
సెప్టెంబర్ 28 (రెండో క్వార్టర్ ఫైనల్)- భారత్ వర్సెస్ గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచే జట్టు
👉సెప్టెంబర్ 29 (మూడో క్వార్టర్ ఫైనల్)- శ్రీలంక వర్సెస్ గ్రూప్-ఏ విన్నర్
సెప్టెంబర్ 29 (నాలుగో క్వార్టర్ ఫైనల్)- బంగ్లాదేశ్ వర్సెస్ గ్రూప్-బి విన్నిర్
👉అక్టోబర్ 1- సెమీఫైనల్స్
👉అక్టోబర్ 3- కాంస్య పతక మ్యాచ్, ఫైనల్
ఏషియన్ గేమ్స్ క్రికెట్ స్క్వాడ్స్ ఇవే
అఫ్గానిస్తాన్: దర్విష్ రసూలీ (కెప్టెన్), అబ్దుల్లా అహ్మద్‌జాయ్, మహ్మద్ అక్రమ్, ఇస్మత్ ఆలం, ఫరీదూన్ దావూద్‌జాయ్, హసన్ ఈసాఖిల్, మహ్మద్ ఇషాక్, కరీం జనత్, ఫైసల్ ఖాన్, నంగ్యాల్ ఖరోటీ, ఇమ్రాన్ మీర్, అరబ్ గుల్ మొమంద్, ఫర్మానుల్లా సఫీ, ఖలీద్ తనివాల్, నజీబుల్లా జద్రాన్.
బంగ్లాదేశ్: లిట్టన్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, మహ్మద్ సైఫ్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముసద్దెక్ హుస్సేన్ సైకత్, యాసిర్ అలీ చౌదరి, రిషద్ హుస్సేన్, షాక్ మహేదీ హసన్, సహ్మద్ హసన్, నస్హమ్దిన్* ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్
హాంకాంగ్: యాసిమ్ ముర్తాజా (కెప్టెన్), బాబర్ హయత్, అనాస్ ఖాన్, అన్షుమన్ రాత్, ఆయుష్ శుక్లా, ఎహసాన్ ఖాన్, హఫీజ్ ఖాన్, హుస్సేన్ రజబ్, మహ్మద్ గజన్ఫర్, మహ్మద్ హసన్ ఖాన్, మహ్మద్ వహీద్, నిజాకత్ ఖాన్, రానా నస్రుల్లా, షాహిద్ వాసిఫ్
భారత్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్
జపాన్: కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ (కెప్టెన్), చార్లీ హరా-హింజ్, బెంజమిన్ ఇటో-డేవిస్, అలెస్టర్ కడోవాకి-ఫ్లెమింగ్, కోహెయ్ కుబోటా, జేక్ కుసుడా-నైర్న్, వటారు మియౌచి, రియో సకురానో-థామస్, అలెక్స్ షిరాయ్-పత్మోర్, సుగయ-స్సులాజ్, షోమాటర్ తకాడ, ఇబ్రహీం తకహషి, మకోటో తనియామా, లచ్లాన్ యమమోటో
మలేషియా: సయ్యద్ అజీజ్ ముబారక్, వీరన్‌దీప్ సింగ్, షర్విన్ మునియాండీ, విజయ్ ఉన్ని, అజ్రీ అజర్, పవన్‌దీప్ సింగ్, ముహమ్మద్ సియాహదత్, ముహమ్మద్ అక్రమ్, అస్లాం ఖాన్ మాలిక్, ముహమ్మద్ హజిక్ ఐమన్, రహీమ్ ఖాన్, నందన్ యాదవ్, షహబ్ ఆలం, ఆరిఫ్ షేక్
ఒమన్: సుఫ్యాన్ మెహమూద్ (కెప్టెన్), ముజఫర్ షిరాల్కర్, మహ్మద్ అలీ అల్ బలూషి, జుబైర్ అల్ బలూషి, షుయబ్ అల్ బలూషి, నవేద్ అల్ బలూషి, వసీమ్ అల్ బలూషి, అహ్మద్ అల్ జడ్జాలీ, సమీర్ ఒత్మాన్, వహీద్ అల్ బలూషి, ఫారిస్ అల్ బలూషి, మహ్మద్ ఉస్మాన్, ఇస్సా రహీమ్ అల్ బలూషి, అబ్దుల్ జలీల్, కైస్ అల్ బలూషి
పాకిస్తాన్: సాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), అబ్దుల్ సమద్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, అకీఫ్ జావేద్, అలీ రజా, అరాఫత్ మిన్హాస్, హైదర్ అలీ, హసన్ నవాజ్, మాజ్ సదాకత్, మహ్మద్ సల్మాన్ మీర్జా, సాద్ మసూద్, సైమ్ అయూబ్, సుఫ్యాన్ మొకీమ్, ఉస్మాన్ ఖాన్
శ్రీలంక: సహన్ అరాచ్చిగే (కెప్టెన్), అషెన్ బండార, లసిత్ క్రూస్‌పుల్లే, కేషన్ డి లివెరా, నిరోషన్ డిక్‌వెల్లా (వికె), బినుర ఫెర్నాండో, నువానీడు ఫెర్నాండో, తరిందు హంసక, దుషన్ హేమంత, సినీత్ జయవర్దన, చమిక కరుణరత్నే, ప్రమోద్ మదుషాన్, వనుజా సహన్, నువాన్ తుషార, విజయకాంత్ వియస్కాంత్
నేపాల్: దీపేంద్ర సింగ్ ఐరీ (కెప్టెన్), రోహిత్ కుమార్ పౌడెల్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, సందీప్ లామిచానే, ఆరిఫ్ షేక్, ఆసిఫ్ షేక్, కుశాల్ భుర్టెల్, లలిత్ రాజ్‌బన్షి, గుల్సన్ కుమార్ ఝా, నందన్ యాదవ్, లోకేష్ బామ్, సందీప్ జోరా, షేర్ మల్లా, కుషాల్ మల్లా


