IPL 2027: వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ | IPL 2027 Auction BCCI Secretary Saikia Reveals Venue In India | Sakshi
Sakshi News home page

IPL 2027 Auction: వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ

Sep 23 2026 7:15 PM | Updated on Sep 23 2026 7:47 PM

IPL 2027 Auction BCCI Secretary Saikia Reveals Venue In India

PC: BCCI X

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2027 వేలానికి సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది స్వదేశంలోనే వేలం పాట నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ఈ విషయాన్ని తాజాగా ధ్రువీకరించారు.

ఈ ఏడాది డిసెంబరులో గోవాలో ఐపీఎల్‌-2027 వేలం నిర్వహించనున్నట్లు సైకియా ప్రకటించారు. ఈ మేరకు ANIతో మాట్లాడుతూ.. ‘‘గత మూడేళ్లుగా విదేశాల్లోనే ఐపీఎల్‌ వేలం జరిగింది. సౌదీ అరేబియా, దుబాయ్‌, అబుదాబి వంటి అంతర్జాతీయ వేదికల మీద ఆక్షన్‌ నిర్వహించాము.  ఏడాది మాత్రం గోవాలో డిసెంబరు నెలలో వేలం జరుగుతుంది’’ అని దేవజిత్‌ సైకియా తెలిపారు.

అందుకే వేదికను మార్చాము
ఇదిలా ఉంటే.. భారత్‌- ‘ఎ’- ఆస్ట్రేలియా- ‘ఎ’ మహిళల జట్ల మధ్య సెప్టెంబరు 29- అక్టోబరు 2 మధ్య జరగాల్సిన మల్టీ డే మ్యాచ్‌ వేదికను ధర్మశాల నుంచి మొహాలికి మార్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి సైకియా స్పందిస్తూ..

‘‘వాతావరణ పరిస్థితుల కారణంగా ధర్మశాల నుంచి వేదికను మొహాలికి తరలించాము. ధర్మశాలలో వర్షపాతం ఎక్కువగా ఉంది. అక్కడ మ్యాచ్‌ ఆడే పరిస్థితి లేదు. అందుకే మొహాలీ వేదికగా మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయించాము’’ అని తెలిపారు. 

చదవండి: చెలరేగిన భారత బౌలర్లు.. ఆసీస్‌ 171 ఆలౌట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement