breaking news
Devajit Saikia
-
‘లార్డ్స్ వన్డే ఆఖరిది కాదు’
న్యూఢిల్లీ: ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్పై వాదోపవాదాలు నడుస్తున్న తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టతనిచ్చింది. ఇంగ్లండ్‌తో లండన్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా ఆదివారం జరగనున్న మూడో వన్డే రోహిత్ శర్మ కెరీర్‌కు చివరిదనే వాదనను బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తోసిపుచ్చాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండగా... అందులో ఆడాలని రోహిత్ భావిస్తుండగా... అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోహిత్ వన్డే కెరీర్‌పై శుక్రవారం సైకియా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘రోహిత్ కెరీర్‌కు సంబంధించి ఏవేవో వార్తలు వస్తున్నాయి. ఆదివారం లార్డ్స్‌లో రోహిత్ చివరి వన్డే మ్యాచ్ ఆడబోతున్నాడనే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదు. భారత వన్డే జట్టులో రోహిత్ కీలక సభ్యుడు. జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో అతడు భాగం. లార్డ్స్ వన్డే అతడికి చివరి మ్యాచ్ కాదు’ అని సైకియా వెల్లడించాడు. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీరుపై బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో రోహిత్ వన్డే కెరీర్‌కు రిటైర్మెంట్ వార్తలకు ఫుల్స్టాప్ పడ్డట్లు అయింది. కెప్టెన్ గా భారత జట్టుకు టి20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ అందించిన రోహిత్... వన్డే వరల్డ్ కప్ గెలవడమే తన లక్ష్యమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించాడు. 2023లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో ఆ్రస్టేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలవగా... ఈసారి చిరకాల కల నెరవేర్చుకునేందుకు రోహిత్ మరో ఏడాది పాటు కెరీర్ కొనసాగించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాడు. -
నేపాల్‌తో చారిత్రక క్రికెట్ సిరీస్.. వైభవ్‌కు ప్రమోషన్!
నేపాల్‌తో క్రికెట్ బంధాన్ని పెంచుకునే క్రమంలో బీసీసీఐ మరో కీలక అడుగు వేయనుంది. సమీప భవిష్యత్తులో భారత జట్టు క్రికెట్ సిరీస్ ఆడేందుకు నేపాల్‌కు పంపించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటన విడుదల చేశారు. భౌగోళిక రాజకీ యాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న బంధం చారిత్రక క్రికెట్ సిరీస్ నిర్వహణతో మరింత బలపడనుంది. అయితే నేపాల్ పర్యటనకు సీనియర్ జట్టును కాకుండా ఇండియా-ఏ జట్టును పంపించనున్నట్లు దేవజిత్ స్పష్టం చేశారు.అయితే నేపాల్‌తో ఆడబోయే సిరీస్ ఏ ఫార్మాట్లో నిర్వహించాలనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ఈ సిరీస్‌కు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని పంపే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇండియా-ఏ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను వైభవ్‌కు అప్పగించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.ఇప్పటికైతే తిలక్ వర్మ ఇండియా-ఏ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడికి విశ్రాంతినిచ్చి వైభవ్‌ను కెప్టెన్ హోదాలో నేపాల్‌కు పంపే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే టీమిండియాకు ఎంపికైన వైభవ్ ఆటలో ఇంకా ఎంతో మెరుగుపడాల్సిన అవసరం ఉందని బీసీసీఐ భావిస్తోంది.ఇటీవల సంవత్సరాల్లో ఆసియా దేశాల నుంచి క్రికెట్లో అడుగుపెట్టిన దేశాల్లో నేపాల్ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఆటలో పురోగతి సాధించడం ద్వారా నేపాల్ జట్టు వరుసగా 2024తో పాటు 2026 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. 2024 టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాప్రికాకు ఓడించినంత పని చేసిన నేపాల్.. 2026 టీ20 ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను కూడా ఓడించినంత పని చేసింది. చివరకు ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నాలుగు పరుగుల తేడాతో గట్టెక్కింది. ఇక ఇదే ప్రపంచకప్‌లో స్కాట్లాండ్పై విజయంతో నేపాల్ మెగా టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఐర్లాండ్ టూర్‌కు ఎంపికైనప్పటికీ వైభవ్ సూర్యవంశీకి ఆ సిరీస్‌లో ఆడే అవకాశం రాలేదు. అయితే ఇంగ్లండ్ టూర్లో మాత్రం తొలి టీ20 మినహా మిగతా అన్న్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం వచ్చినప్పటికీ వైభవ్ రాణించడంలో విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌లు కలిపి వైభవ్ 42 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌తో పాటు లంకలో జరిగిన ట్రై సిరీస్‌లో పరుగుల పండుగ చేసుకున్న వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు. India A are likely to tour Nepal.. @BCCI secretary Devajit Saikia had hinted about this to reporters in Mumbai recently!— Gaurav Gupta (@toi_gauravG) July 10, 2026చదవండి: ‘శ్రేయస్‌ను నిందించొద్దు.. అదే అసలు సమస్య’ -
రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ స్పందన!
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆ మెగాటోర్నీలో ఆడతారా లేదా అన్న దానిపై బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. 2027 వన్డే ప్రపంచకప్ చర్చకు వస్తే ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు ఆటకు పూర్తిగా వీడ్కోలు పలుకుతారనే వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా పీటీఐకి ఇంటర్వ్యూ ఇస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నామని, ఈ ప్రయాణంలో కొంతమంది ఆటగాళ్లకు అవకాశాలు లభించకపోవచ్చని పేర్కొన్నారు. సైకియా మాటలను బట్టి చూస్తే జట్టులో సీనియర్లుగా చెలామణి అవుతున్న రోహిత్, కోహ్లీలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే రోహిత్, కోహ్లీ వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగుతారా లేదా అన్నదానిపై సెలెక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నిజానికి కోహ్లి, రోహిత్‌లు మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ సైకియా వ్యాఖ్యలు సమాధానం కంటే ప్రశ్నలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.గంభీర్, అగార్కర్ల మాదిరిగానే, రోహిత్, కోహ్లీల 2027 ప్రపంచ కప్ అవకాశాలపై సైకియా కూడా స్పష్టమైన వైఖరిని వెల్లడించలేదు. ఈ విషయంపై బీసీసీఐ ఏమైనా అంతర్గత చర్చలు జరిపిందా అని అడగ్గా, ఇది ప్రాథమికంగా కొనసాగుతున్న ప్రక్రియ అని, ఇందులో భాగస్వాములందరూ తమ అభిప్రాయాలలో ఏకీభవిస్తున్నారని సైకియా అన్నారు. 'మాది చాలా సమన్వయంతో కూడిన బృందం, ఇందులో చాలా మంది నిపుణులు ఉన్నారు. సంబంధిత వర్గాలన్నింటినీ కలుపుకొని వెళ్తాము. ఏ నిర్ణయాలలోనైనా క్రికెట్ కమిటీ, సెలెక్టర్లు, సహాయక సిబ్బంది, ప్రధాన కోచ్, సంబంధిత ఆటగాళ్లతో సహా ఇతర భాగస్వాములందరూ పాలుపంచుకుంటారు.క్రమం తప్పకుండా సంభాషణలు జరుగుతున్నాయి. అందువల్ల, మనకు ప్రత్యేక సంప్రదింపుల సమావేశం అవసరం లేదు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ' అని సైకియా పేర్కొన్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో ఆడుతుండగా, కోహ్లీ గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. -
IPL 2027: బీసీసీఐ కీలక నిర్ణయం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2027 సీజన్‌కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక ప్రకటన చేసింది. క్యాష్ రిచ్ లీగ్ ఇరవయ్యవ ఎడిషన్.. గత సీజన్‌తో పోలిస్తే దాదాపు రెండు వారాల ముందే ఆరంభం అవుతుందని వెల్లడించింది.మరోసారి బెంగళూరుదే టైటిల్‌కాగా ఐపీఎల్-2026 మార్చి 28న మొదలై.. మై 31న ఫైనల్‌తో ముగిసిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో.. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. గుజరాత్‌ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది.ముందుగానే ఐపీఎల్ఇక వచ్చే సీజన్ విండో గురించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. PTIతో మాట్లాడుతూ.. మార్చి 10 నుంచి మే 15 మధ్య టోర్నీ నిర్వహణ కోసం ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపాడు. ‘‘ఈ ఏడాది ఐపీఎల్ 28 మార్చిలో మొదలై.. మే 31న ముగిసింది.కారణం ఇదేనిజానికి మే 15 తర్వాత చాలా చోట్ల వాతావరణం కారణంగా ఇబ్బందులు తలెత్తాయి. కొన్నిచోట్ల ముందుగానే రుతుపవనాల రాకతో వర్షం పడింది. అందుకే వచ్చే ఏడాది నుంచి షెడ్యూల్ మార్చాలని అనుకుంటున్నాం.ఇందుకు సంబంధించి మా జనరల్ మేనేజర్‌కు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాను. మార్చి 10- మే 15 మధ్య టోర్నీ జరిగేలా షెడ్యూల్ వీలు అవుతుందో చూడమన్నాను. ప్లే ఆఫ్స్, ఫైనల్‌కు వర్షం అడ్డంకిగా మారకుండా ముందుగానే చర్యలు తీసుకోవాల్సి ఉంది. వాతావరణ పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడడం కంటే షెడ్యూల్లో మార్పు చేస్తే బాగుంటుందనే యోచనలో ఉన్నాము’’ అని దేవజిత్ సైకియా తెలిపాడు. చదవండి: ముంబై ఇండియన్స్‌కి సూర్య గుడ్‌బై! -
వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ
గత కొన్నాళ్లుగా తన ఆట తీరుతో హాట్‌టాపిక్‌గా మారిన భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. భారత్- ‘ఎ’ జట్టు తరఫున శ్రీలంక పర్యటనలో ఉన్న ఈ పిల్లాడు.. ముక్కోణపు వన్డే సిరీస్ ఆడుతున్నాడు.సూపర్ ఓవర్లో లంక విజయంఇందులో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్‌లో శ్రీలంక భారత్- ‘ఎ’ జట్టుపై సూపర్ ఓవర్లో విజయం సాధించింది.నువ్వు ఇక ఇంటికి వెళ్లుఈ క్రమంలో లంక ప్లేయర్ విశేన్ హలంబగే.. భారత ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి.. ‘‘మ్యాచ్ అయిపోయింది. నువ్వు ఇక ఇంటికి వెళ్లు’’ అని రెచ్చగొట్టినట్లు తెలిసింది. దీంతో సహనం కోల్పోయిన వైభవ్.. అతడిపైకి దూసుకెళ్లాడు. విశేన్‌ను వెనక్కి నెట్టేయగా.. అతడూ వైభవ్‌ను తోసేశాడు.ఇంతలో లంక సీనియర్ ప్లేయర్ డిక్విల్లా ఇద్దరినీ విడదీసి.. వైభవ్‌ను అక్కడి నుంచి పంపించాడు. అయితే, వైభవ్ వెళ్తూ వెళ్తూ వేలు చూపించి బెదిరించినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో పదిహేనేళ్ల వైభవ్ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. అయితే, ఇది అనధికారిక మ్యాచ్ కాబట్టి ఐసీసీ పెద్దగా చర్యలు తీసుకునే అవకాశం లేనట్లు కనిపిస్తోంది.స్పందించిన బీసీసీఐఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా వైభవ్ సూర్యవంశీ వివాదం గురించి స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియా- ‘ఎ’ జట్టు కీలక టోర్నమెంట్ ఆడుతోంది. వర్దమాన క్రికెటర్లు టీమిండియాలోకి వచ్చేందుకు ఇదొక మంచి అవకాశం.ముక్కోణపు వన్డే సిరీస్ రూపంలో వారికి తమను తాము నిరూపించుకునే అవకాశం దొరికింది. కాబట్టి వాళ్లంతా కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఇతరత్రా విషయాలను పట్టించుకోకూడదు. అలా చేస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది.ఆటపైనే దృష్టి పెట్టండిఅక్కడికి ఎందుకు వెళ్లారో ఆ విషయంపై మాత్రమే దృష్టి పెట్టండి. ప్రతి ఒక్కరు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఈ ట్రై సిరీస్‌లో ఇండియా విజేతగా నిలవగలదు. మా దృష్టి మొత్తం విజయం మీదే కేంద్రీకృతమై ఉంది. ఆటగాళ్లు అందుకు అనుగుణంగా నడుచుకోవాలి’’ అని దేవజిత్ సైకియా పరోక్షంగా భారత క్రికెటర్లను హెచ్చరించాడు.కాగా ఈ మ్యాచ్ సందర్భంగా సూపర్ ఓవర్ విషయంలో కెప్టెన్ తిలక్ వర్మ సైతం అంపైర్లతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. లంక, భారత్‌తో పాటు అఫ్గనిస్తాన్ కూడా ఈ ట్రై సిరీస్‌లో భాగమైంది. భారత్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండు ఓడిపోయింది. తద్వారా ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. -
BCCI: అవును.. అతడు జట్టుకు దూరమయ్యాడు!
అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత జట్టు ముల్లన్పూర్ నుంచి ధర్మశాలకు పయనమైంది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ.. యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ విమానంలో బయల్దేరారు. జైస్వాల్‌కు చోటుఇక లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం వల్ల అఫ్గన్‌తో వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్‌కు జట్టులో చోటు దక్కింది. మరోవైపు.. రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని బీసీసీఐ వైద్య బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ తెచ్చుకున్నాడు.రోహిత్ పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం ఫిట్నెస్ సాధించి జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఆ తర్వాత దురదృష్టవశాత్తూ తొడకండరాలు పట్టేశాయి. దీంతో దాదాపు రెండు వారాల పాటు ఆటకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కానీ పాండ్యా గాయం గురించి అధికారిక ప్రకటన రాలేదు.అతడు జట్టుకు దూరమయ్యాడు!ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ విషయం గురించి తాజాగా స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ‘‘అవును.. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. గాయం వల్ల అతడు అందుబాటులో ఉండటం లేదు.అతడి స్థానంలో వేరే ఆటగాడిని తీసుకోవాలా? లేదంటే పద్నాలుగు మందితోనే జట్టును కొనసాగించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు.నితీశ్ రెడ్డి ఉన్నాడుగాకాగా ఇప్పటికే హార్దిక్‌కు బ్యాకప్‌గా మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని అఫ్గన్‌తో వన్డేలకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందుకే రీప్లేస్మెంట్ గురించి సెలక్టర్లు ఆలోచించడంలేదని తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. అఫ్గన్‌తో ముల్లన్పూర్ వేదికగా టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తదుపరి జూన్ 13, 17, 20 తేదీల్లో మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ధర్మశాల, లక్నో, చెన్నై ఇందుకు వేదికలు. చదవండి: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు -
దేవజిత్ సైకియా ఆకస్మిక రాజీనామా
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.అసోం ముఖ్యమంత్రి హేమంత బిస్వ శర్మ ప్రభుత్వంలో దాదాపు ఐదేళ్ల పాటు అడ్వకేట్ జనరల్‌గా సేవలందించిన దేవజిత్ సైకియా.. రాజ్యాంగ సంప్రదాయాలను గౌరవిస్తూ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.క్రికెట్‌తో పాటు న్యాయరంగంలోనూ సైకియా ప్రత్యేక గుర్తింపు పొందారు. అసోంకు చెందిన ఆయన గతంలో రాష్ట్ర రంజీ జట్టుకు వికెట్‌కీపర్, మిడిలార్డర్ బ్యాటర్‌గా సేవలందించారు. అనంతరం న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టి గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2021లో అసోం రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు.ఇక క్రికెట్ పరిపాలనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. అసోం క్రికెట్ అసోసియేషన్‌లో వివిధ హోదాల్లో పని చేసి.. 2022లో బీసీసీఐ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. అనంతరం జై షా ఐసీసీ చైర్మన్‌గా వెళ్లిన తర్వాత బీసీసీఐ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. -
ఐపీఎల్ షెడ్యూల్లో కీలక మార్పు!
ఐపీఎల్ 2026 సీజన్లో షెడ్యూల్‌కు సంబంధించి బీసీసీఐ కీలక మార్పు చేసింది. అహ్మదాబాద్‌లో మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లకు సంబంధించి మ్యాచ్ వేదికలను స్వాప్ చేస్తూ బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఒక ప్రకటన విడుదల చేశారు. విషయంలోకి వెళితే.. సీజన్ తొలి దశలో ఏప్రిల్ 26న అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈ మ్యాచ్ వేదికను చెన్నై చిదంబరం స్టేడియానికి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మ్యాచ్ సమయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇక మే 21 ఈ రెండు జట్లు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మరోసారి తలపడాల్సి ఉంది. తాజాగా ఈ వేదికను అహ్మదాబాద్‌కు మారుస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఐపీఎల్ 19వ సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ 4 మ్యాచ్‌ల్లో ఒక విజయంతో పట్టికలో 9వ స్థానంలో ఉండగా, గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతుంది.చదవండి: తిక్క కుదిరింది.. ఆర్సీబీ బ్యాటర్‌కు షాక్! -
అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్!
ఆకిబ్ నబీ.. భారత క్రికెట్లో ఈ పేరు చర్చనీయాంశంగా మారింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో అతడి అత్యద్భుత ప్రదర్శనలు ఇందుకు కారణం. జమ్మూ కశ్మీర్ తొలిసారి రంజీ టైటిల్ గెలవడంలో ఈ పేస్ బౌలర్‌ది కీలక పాత్ర.స్పందించిన బీసీసీఐసీజన్ ఆసాంతం అద్భుత ఆట తీరుతో జట్టును గెలిపించిన ఆకిబ్ నబీ (Auqib Nabi Dar)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడిని భారత టెస్టు జట్టుకు ఎంపిక చేయాలనే డిమాండ్లూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించాడు.అతడిదే కీలక పాత్రత్వరలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు. అయితే, ఆకిబ్ ఎంపిక విషయంలో తుది నిర్ణయం మాత్రం సెలక్టర్లదేనని స్పష్టం సైకియా చేశాడు. ‘‘అతడు అద్భుతంగా ఆడాడు. జట్టు విజయాల్లో అతడిదే కీలక పాత్ర.క్వార్టర్ ఫైనల్లో ఐదు వికెట్లు తీశాడు. సెమీ ఫైనల్లోనూ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక ఫైనల్లోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేశాడు. ఐదు వికెట్లతో సత్తా చాటి జట్టును గెలిపించాడు. అతడి బౌలింగ్ ఫైనల్ రాతను మార్చింది. కాబట్టి ప్రతి ఒక్కరి దృష్టిని అతడు ఆకర్షించగలిగాడు.రంజీ ట్రోఫీకి సంబంధించి ప్రతి మ్యాచ్‌కు మా సెలక్టర్లు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశాము. ఫైనల్ సహా కీలక మ్యాచ్‌లన్నీ మా సెలక్టర్లు వీక్షించారు. వాళ్లు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారనే అనుకుంటున్నా. ఇప్పటికే అతడు లైమ్‌లైట్‌లో ఉన్నాడు. సెలక్టర్లే అతడి విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు.అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?ప్రతిభ ఉన్న వాళ్లకు అన్యాయం జరగకుండా బీసీసీఐ సరైన చర్యలు తీసుకుంటుంది. మా సెలక్టర్లు అతడితో పాటు మ్యాచ్‌లో మెరుగ్గా రాణించిన అందరి ఆటను గమనించారు. నబీని వెలుగులోకి తీసుకుచ్చింది ఎవరు?.. అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. జమ్మూ కశ్మీర్ సెలక్టర్లే కదా!.. దేశీ క్రికెట్లో రాష్ట్ర జట్టు తరఫున అదరగొట్టిన వారికి బీసీసీఐ సెలక్టర్లు కచ్చితంగా అవకాశం ఇస్తారు’’ అని దేవజిత్ సైకియా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.60 వికెట్లు కూల్చాడుకాగా కర్ణాటకతో ఫైనల్లో జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ ఐదు వికెట్లతో రాణించి.. కర్ణాటక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజేతగా అవతరించింది. తాజా రంజీ సీజన్లో 29 ఏళ్ల కుడిచేతి వాటం పేసర్ ఏకంగా 60 వికెట్లు కూల్చాడు. ఇందులో ఎనిమిది ఫైవ్ వికెట్లు హాల్స్ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే ఆకిబి నబీ అరంగేట్రానికి డిమాండ్లు పెరుగుతున్నాయి. చదవండి: ప్రపంచకప్ వైఫల్యాల తర్వాత కూడా బాబర్ ఆజమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు -
తుది నిర్ణయం వారిదే: గంభీర్ ‘తొలగింపు’పై బీసీసీఐ స్పందన
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్.. ఆస్ట్రేలియాకు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోల్పోవడం.. సొంతగడ్డపై పాతికేళ్ల తర్వాత తొలిసారి సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్.. తాజాగా స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్‌కు వన్డే సిరీస్ (2-1) కోల్పోవడం..పదవి నుంచి తొలగించాలిగౌతం గంభీర్ హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత టీమిండియా చవిచూసిన ఘోర పరాభవాలు ఇవి.. ఈ నేపథ్యంలో అతడిని పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరిగాయి. భారత జట్టు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సైతం ఇంచుమించు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రతి ఒక్కరు క్రికెట్ నిపుణులేఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా వ్యంగ్యరీతిలో స్పందించారు. ‘‘ఇండియాలో 140 కోట్ల మందితో కూడిన దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరు క్రికెట్ నిపుణులే. ప్రతి ఒక్కరికి వారికంటూ ఓ అభిప్రాయం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం.కాబట్టి మనం ఎవరినీ మాట్లాడకుండా ఆపలేము. మీడియా సహా అందరూ తమ అభిప్రాయాలను చెబుతూనే ఉంటారు. వార్తా సంస్థలు, మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు.. ఇతర వ్యక్తులు అంతా ఎప్పటికప్పుడు తమకు నచ్చినట్లుగా మాట్లాడుతూనే ఉంటారు. ఇది సోషల్ మీడియా యుగం.వారిదే తుది నిర్ణయంఅయితే, బీసీసీఐలో క్రికెట్ కమిటీ ఉంటుంది. అందులో మాజీ క్రికెటర్లు ఉంటారు. వారే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మరోవైపు.. జట్టు ఎంపిక కోసం ఐదుగురు సెలక్టర్లు ఉన్నారు. వాళ్లు కూడా అర్హత ప్రకారమే ఆ స్థానానికి చేరుకున్నారు. వాళ్లకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి.అయితే, ఇతరులు వాటితో విభేదించవచ్చు. అయినప్పటికీ బోర్డులోని వ్యక్తుల మాటలు, నిర్ణయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము. క్రికెట్ కమిటీ, సెలక్టర్లదే తుది నిర్ణయం’’ అని దేవజిత్ సైకియా స్పోర్ట్స్‌స్టార్‌తో పేర్కొన్నారు. చదవండి: Suryakumar Yadav: ఓడినా పర్లేదు.. మా ప్లాన్ అదే -
దిగ్గజాలకు షాక్!.. అది నిజమే: బీసీసీఐ
ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టు గ్రేడ్లలో మార్పులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పందించింది. A+ గ్రేడ్‌ను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం ధ్రువీకరించారు.బోర్డు సంతృప్తితో లేదు‘‘A+ గ్రేడ్‌ను తొలగించే విషయంలో త్వరలోనే తుది నిర్ణయం తీసుకోబోతున్నాం. ప్రస్తుతం ఈ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు కాకుండా.. కేవలం ఒకే ఒక్క ఫార్మాట్ ఆడేందుకు సుముఖంగా ఉన్నారు. A+ గ్రేడ్‌లో కొనసాగేందుకు కావాల్సిన అర్హతలు ఇప్పుడు ఎవరూ కలిగిలేరు. ఈ విషయంలో బోర్డు సంతృప్తితో లేదు.ఈ గ్రేడ్‌లో ఉన్న కొంతమంది ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు ఆడవద్దని నిర్ణయించుకున్నారు. మా నిబంధనలకు అనుగుణంగా ఎవరూ లేరు కాబట్టి ఈ గ్రేడ్‌ను తీసివేయాలని ఫిక్సయిపోయాం’’ అని దేవజిత్ సైకియా స్పోర్ట్స్‌స్టార్‌తో పేర్కొన్నారు.రో-కో వన్డేలలో మాత్రమేకాగా గతేడాది ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులలో బ్యాటింగ్ దిగ్గజాలు, మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలతో పాటు.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా మాత్రమే A+ గ్రేడ్‌లో ఉన్నారు. వీరిలో కోహ్లి, రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లు, టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు.మరోవైపు.. జడేజా కూడా పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పి కేవలం వన్డే, టెస్టులు ఆడుతున్నాడు. ఇక బుమ్రా మూడు ఫార్మాట్లు ఆడుతున్నా పనిభారం తగ్గించుకునే క్రమంలో అతడు ఎక్కువసార్లు విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. అయితే, టెక్నికల్‌గా మాత్రం మూడు ఫార్మాట్లు ఆడుతున్నట్లే లెక్క.బుమ్రాకు మాత్రం ఏడు కోట్లు?ఈ క్రమంలో రో-కోలతో పాటు జడ్డూకు వార్షిక తగ్గించే విషయంలో నిర్ణయం తీసేసుకున్న బీసీసీఐ.. బుమ్రాకు A+ గ్రేడ్ మాదిరే మాత్రం రూ. 7 కోట్లు జీతంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా A గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, B గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు రూ. 3 కోట్లు. అదే విధంగా C గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు రూ. కోటి వార్షిక జీతంగా చెల్లిస్తోంది బీసీసీఐ.చదవండి: RCB: ‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్‌బీర్ కపూర్! -
భారత్‌లో ఆడబోము..! బంగ్లా డిమాండ్‌పై స్పందించిన బీసీసీఐ
టీ20 ప్రపంచకప్-2026లో పాల్గోనేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు భారత్‌కు రావడంపై ఇంకా సందిగ్థత కొనసాగుతోంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్‌లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఐసీసీని కోరిన సంగతి తెలిసిందే.అయితే అందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విముఖత చూపించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఐసీసీ నుంచి మాత్రం ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ఈ విషయంపై బీసీసీఐ తొలిసారి స్పందించింది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవిష్యత్తు ప్రణాళికలను రచించేందుకు బీసీసీఐ ఉన్నతాధికారులు శుక్రవారం ముంబైలో సమావేశమయ్యారు.ఈ మీటింగ్‌లో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియాతో పాటు అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సీఓఈ హెడ్ వీవీయస్ లక్ష్మణ్ పాల్గోన్నారు. అయితే ఈ సమావేశంలో కేవలం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సంబంధించిన విషయాలు మాత్రమే చర్చించినట్లు దేవజిత్ సైకియా స్పష్టం చేశారు."కేవలం సీఓఈ, క్రికెట్ క్రికెట్ అభివృద్ధిపైనే చర్చించాం. బంగ్లాదేశ్ ప్రపంచకప్ మ్యాచ్‌ల తరలింపు అనేది మా పరిధిలోని అంశం కాదు. దానిపై ఐసీసీయే తుది నిర్ణయం తీసుకుంటుంది" సైకియా పేర్కొన్నారు. అదేవిధంగా సీఓఈలో ఖాళీగా ఉన్న హెడ్ ఆఫ్ క్రికెట్ ఎడ్యుకేషన్, హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ పోస్ట్‌లను భర్తీ చేసేందుకు బోర్డు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది.కాగా ఇటీవల భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే బంగ్లా స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ 2026 నుంచి తప్పించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. 2026 టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌లో మ్యాచ్‌లు ఆడబోమని, తమ మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు తరలించాల్సిందిగా ఐసీసీకి బంగ్లా లేఖ రాసింది. బంగ్లా అభ్యర్ధను ఐసీసీ తిరస్కరించినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే మరోసారి ఐసీసీకి బీసీబీ లేఖ రాసినట్లు సమాచారం. -
గౌతమ్ గంభీర్‌పై వేటు.. తుది నిర్ణయం ప్రకటించిన బీసీసీఐ
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రయాణం మిశ్రమ ఫలితాలతో కూడుకొని ఉంది. అతని మార్గదర్శకత్వంలో భారత జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అదరగొడుతున్నా.. టెస్ట్‌ల్లో మాత్రం తేలిపోతుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలొ క్లీన్ స్వీప్‌తో (0-3)మొదలైన గంభీర్ టెస్ట్ ప్రస్తానం (టీమిండియా హెడ్ కోచ్‌గా).. తాజాగా స్వదేశంలోనే సౌతాఫ్రికా చేతిలో క్లీన్ స్వీప్ (0-2) వరకు సాగింది.ఈ మధ్యలో గంభీర్ మార్గదర్శకత్వంలో భారత జట్టు ఒక్క విండీస్‌పై మాత్రమే సానుకూల ఫలితం (2-0) సాధించింది. దీనికి ముందు ఆసీస్ పర్యటనలో 1-3తో సిరీస్ కోల్పోయి, ఇంగ్లండ్ పర్యటనలో డ్రాతో (2-2) గట్టెక్కింది.టెస్ట్‌ల్లో పేలవ ట్రాక్ రికార్డు కలిగి ఉండటంతో పాటు అనునిత్యం వివాదాలతో సావాసం చేసే గంభీర్‌ను టెస్ట్ జట్టు హెడ్ కోచ్ విధుల నుంచి తప్పించాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. త్వరలో గంభీర్‌పై వేటు ఖాయమని గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.గంభీర్ స్థానంలో భారత టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్షణ్ ఎంపిక ఖరారైందని పలు జాతీయ మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రసారం చేశాయి.ఇదే అంశంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. గంభీర్‌పై వేటు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. టెస్ట్ జట్టు విధుల నుంచి గంభీర్‌ను తప్పించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. గంభీర్ టెస్ట్ జట్టు కోచ్‌గా కొనసాగడానికి మద్దతు ప్రకటించారు. సైకియా చేసిన ఈ ప్రకటనతో గంభీర్ టెస్ట్ హెడ్‌కోచ్‌మెన్‌షిప్‌పై ఊహాగానాలు తొలగిపోయాయి.ముందుంది ముసళ్ల పండగప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో (2005-27) గంభీర్ మార్గదర్శకత్వంలో భారత టెస్ట్ జట్టు పరిస్థితి దయనీయంగా ఉంది. గంభీర్ రాకకు ముందు వరుసగా రెండు డబ్ల్యూటీసీ సైకిల్స్‌లో ఫైనల్స్‌కు చేరిన టీమిండియా.. గత ఎడిషన్‌లో ఫైనల్స్‌కు చేరుకుండానే ఇంటిదారి పట్టింది. తాజా సైకిల్లో కూడా పరిస్థితి అలాగే కొనసాగుతుంది. ఈ సైకిల్లో భారత్ ఇప్పటివరకు ఆడిన 9 టెస్ట్ మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఈ సైకిల్లో టీమిండియా ఫైనల్‌కు చేరాలంటే ఇంకా ఆడాల్సిన 9 టెస్టుల్లో కనీసం 6 విజయాలు సాధించాలి. అయితే ఇలా జరగడం అంత ఈజీగా కనిపించడం లేదు. భారత్ తదుపరి ఐదు ఆస్ట్రేలియాతో, రెండు న్యూజిలాండ్‌తో ఆడాల్సిన ఉంది. మిగిలిన రెండు శ్రీలంకతో ఆడాల్సి ఉంది. శ్రీలంకపై టీమిండియా పైచేయి సాధించినా.. ఆసీస్, కివీస్‌పై గెలవడం మాత్రం అంత ఈజీగా కాదు. -
డబ్బు తిరిగి ఇచ్చేయండి.. బీసీసీఐ స్పందన ఇదే
భారత్- దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 రద్దైన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై విమర్శల వర్షం కురుస్తోంది. లక్నోలో పొగమంచు కారణంగా టాస్ పడకుండానే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది. ఆరుసార్లు మైదానంలోకి వచ్చి.. పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు ఆఖరికి 9.30 నిమిషాల సమయంలో.. ప్రతికూల వాతావరణం వల్ల మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.అయితే, ఉత్తర భారతంలో పరిస్థితులు తెలిసి కూడా బీసీసీఐ (BCCI) ఇలా మ్యాచ్‌ను షెడ్యూల్ చేయడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. నవంబరు, డిసెంబరు నెలల్లో అక్కడ కాలుష్యం, పొగమంచు ఏ స్థాయిలో ఉంటుందో తెలిసినా లక్నోలో మ్యాచ్ ఎలా షెడ్యూల్ చేశారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. స్పందించిన బీసీసీఐమరోవైపు.. లక్నో మ్యాచ్ కోసం టికెట్ల రూపంలో డబ్బులు ఖర్చుచేసిన ప్రేక్షకులు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఈ మ్యాచ్ నిర్వహణకు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) బాధ్యత వహిస్తుందని తెలిపారు.‘‘ఈ మ్యాచ్ టికెట్ల విక్రయాన్ని రాష్ట్ర అసోసియేషన్ చూసుకుంది. బీసీసీఐ మ్యాచ్ నిర్వహణ హక్కులను మాత్రమే వారికి ఇచ్చింది. మిగతా విషయాలన్ని యూపీసీఏ పరిధిలోనే ఉంటాయి’’ అని IANSకు గురువారం దేవజిత్ సైకియా తెలిపారు. తద్వారా ప్రేక్షకులకు టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో యూపీసీఏదే పూర్తి బాధ్యత అని చెప్పకనే చెప్పారు. రీఫండ్ నిబంధనల ప్రకారం.. కాగా బీసీసీఐ రీఫండ్ నిబంధనల ప్రకారం.. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దైతే టికెట్లు కొనుక్కున్న వారు.. ఆ మొత్తాన్ని తిరిగి పొందేందుకు అర్హులు అవుతారు. ఇప్పుడు బంతి యూపీసీఏ కోర్టులో ఉందన్నమాట! కాగా సొంతగడ్డపై టీమిండియా సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత కటక్‌లో భారత్ 101 పరుగులతో గెలవగా.. ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో ప్రొటిస్ జట్టు 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ధర్మశాలలో మూడో టీ20లో భారత్ గెలిచి.. 2-1తో ఆధిక్యం సంపాదించింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో నాలుగో టీ20 జరగాల్సి ఉండగా.. పొగమంచు వల్ల రద్దైపోయింది. ఇరుజట్ల మధ్య ఆఖరి, ఐదో టీ20కి అహ్మదాబాద్ వేదిక.చదవండి: తల్లి నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు.. ఇప్పుడిలా! -
శ్రేయస్ అయ్యర్ గాయంపై బీసీసీఐ మరో అప్డేట్
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది. అయ్యర్ వేగంగా కోలుకుంటున్నట్లు బోర్డు తెలిపింది. "ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా శ్రేయస్ అయ్యర్ పొత్తికడుపుపై బలమైన గాయమైంది. ఈ గాయం కారణంగా అతని ప్లీహం (Spleen) చీలికకు గురై, అంతర్గత రక్తస్రావం జరిగింది.వెంటనే అతడి గాయాన్ని గుర్తించి బీసీసీఐ వైద్య బృందం అంతర్గత రక్తస్రావాన్ని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం శ్రేయస్ ఆరోగ్యం నిలకడగా ఉంది. మంగళవారం (అక్టోబర్ 28) అతడికి మరోసారి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. అతడి స్ల్పీన్ గాయంలో మెరుగుదల కన్పించింది. అతడు శరవేగంగా కోలుకుంటున్నాడు. అతడు మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు" అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా పేర్కొన్నారు. అయ్యర్‌ను ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో అతడు ఆస్ప్రత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముంది.చదవండి: ఆస్పత్రిలో శ్రేయస్ అయ్యర్.. ఖర్చులు ఎవరు భరిస్తారో తెలుసా? -
ఆస్ట్రేలియా క్రికెటర్లకు సారీ చెప్పిన బీసీసీఐ..
వన్డే వరల్డ్‌కప్‌లో ఆడేందుకు వచ్చిన ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ఆకతాయి వేధింపులకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సభ్యులు ఇద్దరూ గురువారం రాత్రి హోటల్‌కు తిరిగి వస్తుండగా.. ఇండోర్‌లోని ఖజ్రానా రోడ్ వద్ద ఓ వ్యక్తి వారి వెంటపడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే సదరు క్రికెటర్లు జట్టు మేనేజర్‌కు సమాచారం అందించారు. అతడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీలుసు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఖజ్రానాకు చెందిన 30 ఏళ్ల అకీల్‌ను నిందుతుడిగా గుర్తించారు. ప్రస్తుతం అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంతకుముందు కూడా అతడిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. "ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. భారత్ అతిథిలను గౌరవించే దేశంగా పేరుగాంచినది. ఇటువంటి ఘటనలు దేశ గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ఎవరిపట్ల కూడా ఇలా ప్రవర్తించకూడదు. ఆసీస్ క్రికెటర్లకు ఇలా జరిగినందుకు మేము చింతిస్తున్నాము. నిందితుడిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నందుకు సంతోషిస్తున్నాము.ఈ వన్డే ప్రపంచ కప్‌లో ఆడేందుకు వచ్చిన అన్ని జట్లకు ఇప్పటికే పూర్తి స్ధాయి భద్రతను కల్పించాము. ఇకపై సెక్యూరిటీ మరింత పెంచుతాము. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాము." అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) పీటీఐతో పేర్కొన్నారు. కాగా అక్టోబర్ 30న జరగనున్న రెండో సెమీఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.చదవండి: భారత్ సెమీస్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా -
BCCI: ఇస్తారా? లేదా?.. పీసీబీ చీఫ్ నక్వీకి బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్
ఆసియా టీ20 కప్-2025 ట్రోఫీ ఇంత వరకు టీమిండియాకు అందనే లేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB), ఆసియా క్రికెట్ మండలి (ACC) చైర్మన్ మొహ్సిన్ నక్వీ మొండి వైఖరి ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నక్వీకి గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.తీవ్ర పరిణామాలుట్రోఫీ గనుక టీమిండియాకు అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీసీసీఐ నక్వీకి అధికారికంగా ఇ- మెయిల్ పంపినట్లు సమాచారం. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఇండియా టుడే పేర్కొంది. ఒకవేళ నక్వీ గనుక తమకు సరైన రీతిలో సమాధానం ఇవ్వకుంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని ఆశ్రయిస్తామని చెప్పినట్లు తెలిపింది.అదే జరిగితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని హెచ్చరించామని.. వీలైనంత త్వరగా ట్రోఫీ పంపించాలని మెయిల్ రాసినట్లు పేర్కొంది. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.టీమిండియా నిరాకరణలీగ్, సూపర్-4 దశల్లో పరాజయమన్నదే ఎరుగక ఫైనల్ చేరిన సూర్యకుమార్ సేన.. టైటిల్ పోరు (సెప్టెంబరు 28)లో దాయాది పాకిస్తాన్‌ను ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. అయితే, ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న నక్వీ నుంచి కప్ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. మరోవైపు.. నక్వీ మాత్రం పట్టువీడలేదు. ట్రోఫీ, మెడల్స్ తీసుకుని హోటల్‌కు పారిపోయాడు.పద్ధతి ప్రకారమేతన చేతుల మీదుగానే టీమిండియా ట్రోఫీ తీసుకోవాలని.. ఒకవేళ ఎవరైనా వచ్చి అడిగినా ట్రోఫీ ఇవ్వొద్దని నక్వీ ఏసీసీ ప్రతినిధులకు చెప్పినట్లు సమాచారం. దీంతో బీసీసీఐ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకుంది. పద్ధతి ప్రకారమే ట్రోఫీని తమ వద్దకు రప్పించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే మెయిల్ కూడా పంపినట్లు తెలుస్తోంది.పూర్తి స్పృహలో ఉండేకాగా నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని టీమిండియా నిరాకరించడానికి గల కారణాన్ని సైకియా గతంలో వెల్లడించాడు. ‘‘ఏసీసీ చైర్మన్‌గా ఉన్న వ్యక్తి పాకిస్తాన్ సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. పూర్తి స్పృహలో ఉండే ఈ నిర్ణయం తీసుకున్నాము’’ అని దేవజిత్ సైకియా తెలిపాడు.ఉగ్రదాడికి నిరసనగాపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి నిరసనగా టీమిండియా పాక్ ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్‌కు నిరాకరించింది. దీంతో రచ్చకెక్కిన పీసీబీ.. అతి చేసింది.ఇందుకు అనుగుణంగానే పాక్ ఆటగాళ్లు హ్యారిస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ మైదానంలో టీమిండియా ఆటగాళ్లు, అభిమానులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించి.. ఐసీసీతో చివాట్లు తిన్నారు. ఆ తర్వాత ఫైనల్లో దాయాది చేతిలో ఓడి ఇంటిబాట పట్టగా.. పీసీబీ చైర్మన్ నక్వీ ఇలా మెడల్స్, ట్రోఫీ ఎత్తుకెళ్లడం గమనార్హం.చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషభ్ పంత్ -
BCCI:‘డ్రీమ్ 11’తో కటీఫ్!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్షిప్ నుంచి ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ ‘డ్రీమ్ 11’ను తప్పించారు. డ్రీమ్ ఎలెవన్‌తో ఒప్పందాన్ని అధికారికంగా రద్దు చేసుకుంటున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. మూడేళ్ల కాలానికి 2023లో రూ.358 కోట్లతో డ్రీమ్ 11 ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్’ ప్రకారం ఇకపై ‘డ్రీమ్ 11’ తన కార్యకలాపాలు కొనసాగించే అవకాశం లేదు. దాంతో ఆరి్థకపరంగా ఆ కంపెనీకి భారం కావడంతో పాటు ప్రభుత్వం నిషేధించిన సంస్థతో ఒప్పందాన్ని కొనసాగించరాదని బోర్డు కూడా నిర్ణయించింది. ‘మాకు ఈ విషయంలో చాలా స్పష్టత ఉంది. ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం డ్రీమ్ 11 లేదా అలాంటి ఏ గేమింగ్ కంపెనీతోనైనా బీసీసీఐ ఒప్పందాన్ని కొనసాగించదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఒప్పందం రద్దు చేయాల్సిందే. ప్రధాన స్పాన్సర్‌గా మరో కొత్త కంపెనీ కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రక్రియ ఇంకా ఆరంభ దశలోనే ఉంది’ అని సైకియా వెల్లడించారు. ‘డ్రీమ్ 11తో ఒప్పందం 2026 వరకు ఉంది. అయితే తాజా పరిణామాల్లో డ్రీమ్ 11 వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు కాబట్టి ఉల్లంఘన అనే మాటే తలెత్తదని సైకియా చెప్పారు. ‘ప్రధాన స్పాన్సర్ పరిస్థితిని మేం అర్థం చేసుకోగలం. చెల్లింపుల ఉల్లంఘనలాంటివేమీ వర్తించవు కాబట్టి వారిపై ఎలాంటి జరిమానా కూడా విధించడం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం కాబట్టి అందరూ పాటించాల్సిందే. వారి వ్యాపారం దెబ్బ తినడమే కాదు, బీసీసీఐ లాభాలపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ స్పాన్సర్లలో ఒకటిగా ఉన్న ‘మై సర్కిల్ 11’తో కూడా ఒప్పందం ముగియడం ఖాయమైంది. ‘మై సర్కిల్ 11’ ఏడాదికి రూ. 125 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ. 625 కోట్లతో బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆసియా కప్‌లోగా సాధ్యమేనా! ‘డ్రీమ్ 11’ తప్పుకోవడంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ వేటలో పడింది. ఆసియా కప్‌కు ముందే ఈ ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నా...అది సాధ్యం కాకపోవచ్చు. సెపె్టంబర్ 9 నుంచే టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొత్త స్పాన్సర్ కోసం ప్రకటన ఇచ్చి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పట్టవచ్చు. కాబట్టి ఆసియా కప్‌లో టీమిండియా ప్రధాన స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇది మరింత ఆలస్యం అయితే వన్డే వరల్డ్ కప్‌లో మహిళల జట్టు కూడా స్పాన్సర్ లేకుండానే ఆడుతుంది. భారత జట్టుతో జత కట్టేందుకు జపాన్‌కు చెందిన ప్రఖ్యాత మోటార్ కంపెనీ టయోటా ముందుకు వస్తున్నట్లు సమాచారం. టయోటా ఇప్పటికే ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కు ప్రధాన స్పాన్సర్‌గా ఉండటంతో పాటు ఆ్రస్టేలియా టీమ్‌తో కూడా సహ స్పాన్సర్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఫైనాన్షియల్ సర్విస్ కంపెనీ అయిన ‘ఫిన్‌టెక్’ కూడా ఆసక్తి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో పలు కంపెనీల వద్ద పోటీ ఉండవచ్చు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. బోర్డు కూడా గత ఒప్పందంకంటే ఎక్కువ మొత్తాన్ని ఆశిస్తోంది. నిజానికి ‘డ్రీమ్ 11’ లోగోతో కూడిన జెర్సీలతో భారత టీమ్ కిట్ సిద్ధంగా ఉంది. అయితే వీటిని వేసుకోరాదని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. -
IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
ప్రశాంతమైన పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు (IND vs PAK)తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోమని పునరుద్ఘాటించింది. ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ.. ముష్కరుల చర్యను తీవ్రంగా ఖండించింది.పాకిస్తాన్‌తో ఇకపై కూడా..బీసీసీఐ తరఫున కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajiv Shukla) ఈ మేరకు తమ స్పందన తెలియజేశారు. రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘బాధిత కుటుంబాలకు మా మద్దతు. ఉగ్రవాదుల చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.ప్రభుత్వ నిర్ణయానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం. పాకిస్తాన్‌తో ఇకపై కూడా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోము. ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటాం. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అంశం గురించి సమీప భవిష్యత్తులో కనీసం చర్చ కూడా ఉండదు.అయితే, ఐసీసీ ఈవెంట్లలో మాత్రం నిబంధనలకు అనుగుణంగా పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రస్తుత పరిస్థితులను ఐసీసీ కూడా నిశితంగా గమనిస్తోంది’’ అని స్పోర్ట్స్‌తక్‌తో పేర్కొన్నారు.మాటలకు అందని విషాదంఇక బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. ‘‘పహల్గామ్లో జరిగిన పాశవిక ఉగ్రదాడి కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి.బీసీసీఐ తరఫున ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం. ఈ కష్ట సమయంలో వారంతా ధైర్యం కోల్పోకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో చోటు చేసుకున్న ఈ విషాదాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవడం లేదు. మనమంతా వారికి అండగా ఉండాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు.బాధితులకు నివాళికాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్-2025లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ బాధితులకు నివాళి అర్పించింది. ఆటగాళ్లంతా నిమిషం పాటు మౌనం పాటించారు. అదే విధంగా చీర్‌లీడర్స్ ప్రదర్శనలు లేకుండా చూసుకున్నారు. బాణసంచా కూడా కాల్చలేదు.చివరగా 2008లోఇదిలా ఉంటే.. భారత జట్టు చివరగా 2008లో పాకిస్తాన్లో పర్యటించింది. అదే విధంగా పాక్ జట్టు 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు భారత్‌కు వచ్చింది. ఆ తర్వాత ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 ఆడేందుకు పాక్ జట్టు భారత పర్యటనకు రాగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా మాత్రం అక్కడకు వెళ్లలేదు. భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. ఐసీసీ జోక్యంతో తటస్థ వేదికైన దుబాయ్‌లో రోహిత్ సేన తమ మ్యాచ్‌లు ఆడింది. ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలవగా.. ఆతిథ్య పాక్ జట్టు ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది.కాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల బైసారన్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి దిగారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన ఈ ప్రదేశాన్ని చూసేందుకు వచ్చిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు.చదవండి: Pahalgam Incident: "గౌతమ్ గంభీర్‌ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు -
BCCI: ఒక్కో ఆటగాడికి రూ. 3 కోట్లు.. గంభీర్‌కు ఎంతంటే?
టీమిండియాకు ప్రకటించిన నగదు బహుమతి పంపిణీ అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఆటగాళ్లకు, కోచ్‌లకు, సహాయక సిబ్బందికి ఇచ్చే మొత్తం ఎంతన్నది తాజాగా వెల్లడించారు. చాంపియన్స్ ట్రోఫీ జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 3 కోట్ల మేర అందజేయనున్నట్లు తెలిపారు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. గ్రూప్ దశలో మూడింటికి మూడు గెలిచిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై, ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. ఐదు మ్యాచ్‌లలో అజేయంగా నిలిచి తొమ్మిది నెలల వ్యవధిలోనే మరో ఐసీసీ ట్రోఫీని సాధించింది.ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టుకు భారీ క్యాష్ రివార్డు (BCCI Cash Reward) ప్రకటించింది. రూ. 58 కోట్ల నజరానా ఇవ్వనున్నట్లు గురువారం వెల్లడించింది. అయితే, ఇందులో ఎవరెవరికి ఎంత మొత్తం ఇస్తారన్న విషయం గురించి కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా వెల్లడించారు.గౌతం గంభీర్‌కు మూడు కోట్లువార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 3 కోట్లు.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు మూడు కోట్లు.. మిగిలిన కోచ్‌లలో అసిస్టెంట్లు ర్యాన్ టెన్ డష్కాటే, అభిషేక్ నాయర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్‌కు టి. దిలీప్‌నకు రూ. 50 లక్షలు.. మిగిలిన సహాయక సిబ్బందికి రూ. యాభై లక్షలు.. బీసీసీఐ అధికారులకు రూ. 25 లక్షలు ఇస్తాం’’ అని దేవజిత్ సైకియా తెలిపారు.కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియాతో చేతిలో ఓటమి పాలై టైటిల్‌ను చేజార్చుకుంది. అయితే, టీ20 ప్రపంచకప్-2024తో ఈ గాయాలను మాన్పివేసింది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ మెగా టోర్నీలో ఆఖరి వరకు ఓటమన్నదే లేక చాంపియన్‌గా నిలిచింది.దుబాయ్‌లోనే అన్ని మ్యాచ్‌లు తొమ్మిది నెలల అనంతరం తాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఈ వన్డే టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్య దేశంగా వ్యవహరించిగా.. భద్రతా కారణాల వల్ల టీమిండియాను అక్కడకు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ క్రమంలో ఐసీసీ జోక్యంతో దుబాయ్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లన్నీ ఆడేలా హైబ్రిడ్ మోడల్‌కు పాక్ అంగీకరించింది. ఇక ఒకే వేదిక మీద అన్ని మ్యాచ్‌లు ఆడటం వల్ల టీమిండియాకు మిగతా జట్లతో పోలిస్తే.. అదనపు ప్రయోజనాలు చేకూరాయని ఇంగ్లండ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు విమర్శించారు. అయితే, భారత జట్టు ఎంతో పటిష్టంగా ఉందని.. వేదిక ఏదైనా గెలుపు టీమిండియాదేనంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు ఆ విమర్శలను తిప్పికొట్టారు. టీ20 ప్రపంచకప్-2024లో మిగతా జట్ల మాదిరే టీమిండియా కూడా ప్రయాణాలు చేసిందని.. అయినా విజేతగా నిలిచిందంటూ కౌంటర్ ఇచ్చారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లొ పాల్గొన్న భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, రిషభ్ పంత్.సహాయక సిబ్బంది:హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కోచ్‌లు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డష్కాటే, టి. దిలీప్, మోర్నీ మోర్కెల్. చదవండి: ‘రేపు మీ బౌలింగ్‌ను చితక్కొడతాను చూడు!.. అన్నంత పని చేశాడు’ -
BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ
ఆటగాళ్ల కుటుంబ సభ్యులను విదేశీ పర్యటనలకు అనుమతించే విషయంలో తమ నిర్ణయం మారదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పష్టం చేసింది. జట్టుతో పాటు బోర్డుకు కూడా ఇదే మంచిదని పేర్కొంది. ఈ విషయంలో ఆటగాళ్లకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని.. అయితే, తాము జట్టు ప్రయోజనాల కోసం కఠినంగా వ్యవహరించక తప్పదని తెలిపింది.ఈ మేరకు బోర్డు తరఫున.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) తమ స్పందన తెలియజేశారు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్ గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. 3-1తో ఓడి ఇంటిబాటపట్టింది.ఈ పరాభవం తర్వాత.. విదేశీ పర్యటనలకు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించే విషయమై బీసీసీఐ కఠిన నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నలభై ఐదు రోజుల్లోపు విదేశీ పర్యటనలో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కుటుంబ సభ్యులను వారం రోజులు మాత్రమే అనుమతిస్తారు.విరాట్ కోహ్లి ఘాటు విమర్శలుఅంతకు మించి పర్యటన కొనసాగితే రెండు వారాల పాటు సన్నిహితులకు అక్కడే ఉండే వెసలుబాటు ఉంటుంది. అయితే, ఈ విషయంలో టీమిండియా సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) బీసీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సన్నిహితులే సగం బలమని.. ఆటగాడి విజయం వెనుక కుటుంబ సభ్యుల పాత్రను అందరికీ వివరించలేమని పేర్కొన్నాడు.మైదానంలో దిగని వాళ్లు, అక్కడ ఏం జరుగుతుందో తెలియని వాళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిరాశ కలిగించిందని కోహ్లి ఘాటుగా విమర్శించాడు. ప్రతి ఆటగాడు తన కుటుంబ సభ్యులు వెంట ఉంటే మరింత బాధ్యతగా ఆడతారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ విషయంలో యూటర్న్ తీసుకోనుందనే వార్తలు వచ్చాయి.బీసీసీఐకి, దేశానికి ఇదే మంచిదిఅయితే, అలాంటిదేమీ లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా కొట్టిపడేశారు. ‘‘మేము ప్రవేశపెట్టిన నిబంధనలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు చేయడం లేదు. బీసీసీఐకి, వ్యవస్థకి, జట్టుకు, దేశానికి ఇదే మంచిది.ఈ అంశంలో ఆటగాళ్ల నుంచి భిన్నాభిప్రాయాలు, మిశ్రమ స్పందన వస్తుందని తెలుసు. ఇక్కడంతా ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి.. ఎవరైనా తమ గొంతును వినిపించవచ్చు. తమ భావాలను నిర్భయంగా పంచుకోవచ్చు.అయితే, ఈ నిబంధన విషయంలో అందరు ఆటగాళ్లూ సమానమే. జట్టులోని ప్రతి సభ్యుడు, కోచ్‌లు, మేనేజర్లు, సహాయక సిబ్బంది.. ఇలా అందరికీ రూల్స్ వర్తిస్తాయి. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం.రాత్రికి రాత్రే హడావుడిగా ఈ విధానాన్ని మేము ప్రవేశపెట్టలేదు. దశాబ్దాలుగా జరుగుతున్న విషయాలను పరిగణనలోకి తీసుకుని మా అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఈ పాలసీ తీసుకువచ్చారు. నిజానికి గతంతో పోలిస్తే విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యులను అనుమతించే విషయమై మేము ఆటగాళ్లకు చాలా వరకు మినహాయింపులు ఇచ్చాం. అయితే, ఇప్పుడు ఈ రూల్ కాస్త కఠినంగా అనిపించినా.. తప్పక అమలు చేస్తాం’’ అని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ -
BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్‌గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ షామా మొహమద్(Dr Shama Mohamed) చేసిన వ్యాఖ్యలను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా(Devajit Saikia ) ఖండించారు. బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తుల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో భారత్ సెమీ ఫైనల్ ఆడేందుకు సిద్ధమవుతుంటే.. రాజకీయ నాయకులు జట్టుపై ప్రభావం పడేలా ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.కాగా చాంపియన్స్ ట్రోఫీ- 2025లో భాగంగా టీమిండియా ఆదివారం న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. కివీస్‌ను 44 పరుగుల తేడాతో ఓడించి హ్యాట్రిక్ విజయంతో లీగ్ దశను ముగించింది. అయితే, దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 15 పరుగులకే అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన షామా మొహమద్ ‘ఎక్స్’ వేదికగా రోహిత్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.యావరేజ్ ఆటగాడు.. అవునా?‘‘క్రీడాకారులు ఫిట్‌గా ఉండాలి. అతడు అధిక బరువుతో ఉన్నాడు. కెప్టెన్‌గానూ ఆకట్టుకోలేకపోతున్నాడు. మాజీ కెప్టెన్లతో పోలిస్తే అసలు అతడు ఎందుకూ కొరగాడు. యావరేజ్ ఆటగాడు’’ అని షామా పేర్కొన్నారు. అయితే, రోహిత్ శర్మను ఉద్దేశించి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్‌కు అధిక విజయాలు అందించడంతో పాటు.. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని తర్వాత టీమిండియాకు వరల్డ్‌కప్ అందించిన సారథి, వన్డేలలో అత్యధికంగా మూడు డబుల్ సెంచరీ చేసిన మొనగాడి పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు సరికాదంటూ పెద్ద ఎత్తున షామాపై ట్రోలింగ్ జరిగింది.అదేమీ బాడీ షేమింగ్ కాదే!ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చే క్రమంలో షామా మొహమద్ మాట్లాడిన తీరు రోహిత్ అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ‘‘క్రీడాకారులకు ఫిట్నెస్ ఎంత ముఖ్యమో చెప్పే క్రమంలో నేను ఆ ట్వీట్ చేశాను. అదేమీ బాడీ షేమింగ్ కాదే!.. నేను కేవలం ఫిట్నెస్ గురించే మాట్లాడాను. అతడు కాస్త లావుగా ఉన్నాడనిపించింది. అదే విషయం గురించి ట్వీట్ చేశా.కారణం లేకుండానే నాపై మాటల దాడికి దిగుతున్నారు. ఇతర కెప్టెన్లు.. అంటే ధోని, గంగూలీ, ద్రవిడ్, టెండుల్కర్, కపిల్ దేవ్, విరాట్ కోహ్లిలతో అతడిని పోల్చినప్పుడు రోహిత్ గురించి నాకేం అనిపించిందో అదే చెప్పాను. ఇది ప్రజాస్వామ్యం. నా అభిప్రాయాన్ని పంచుకునే హక్కు నాకు ఉంది. నా మాటల్లో తప్పేముంది?నేను ఓ వ్యక్తిని ఉద్దేశించి ఇలా మాట్లాడలేదు. అయినా ప్రజాస్వామ్యం గురించి అర్థం చేసుకోవడంలో నేను విఫలమయ్యాననుకుంటా. నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో ఇలా మాట్లాడకూడదేమో’’ అని షామా మొహమద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే, షామా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలపగా.. బీజేపీ మాత్రం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.హుందాగా ప్రవర్తించాలిఇక ఈ విషయంపై తీవ్రస్థాయిలో దుమారం రేగడంతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్వయంగా స్పందించారు. ‘‘టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఇలాంటి మాటలు వినాల్సి రావడం దురదృష్టకరం. బాధ్యత గల పదవుల్లో ఉన్న వ్యక్తులు హుందాగా ప్రవర్తించాలి. టీమిండియా కీలక సెమీ ఫైనల్ ఆడేముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు’’ అని షామా వ్యాఖ్యలను ఖండించారు.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన రోహిత్ సేన.. తదుపరి పాకిస్తాన్, న్యూజిలాండ్‌పై వరుస విజయాలు సాధించింది. ఈక్రమంలో గ్రూప్-‘ఎ’ టాపర్‌గా నిలిచిన టీమిండియా మంగళవారం నాటి తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.చదవండి: వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్#WATCH | On her comment on Indian Cricket team captain Rohit Sharma, Congress leader Shama Mohammed says, "It was a generic tweet about the fitness of a sportsperson. It was not body-shaming. I always believed a sportsperson should be fit, and I felt he was a bit overweight, so I… pic.twitter.com/OBiLk84Mjh— ANI (@ANI) March 3, 2025


