ఐపీఎల్ షెడ్యూల్‌లో కీల‌క మార్పు! | BCCI Announced GT-CSK fixtures Swapped For April 26 And May 21 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ షెడ్యూల్‌లో కీల‌క మార్పు!

Apr 13 2026 7:38 PM | Updated on Apr 13 2026 8:03 PM

BCCI Announced GT-CSK fixtures Swapped For April 26 And May 21

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో షెడ్యూల్‌కు సంబంధించి బీసీసీఐ కీల‌క మార్పు చేసింది. అహ్మ‌దాబాద్‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల దృష్ట్యా చెన్నై సూప‌ర్‌కింగ్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ మ్యాచ్‌ల‌కు సంబంధించి మ్యాచ్ వేదిక‌ల‌ను స్వాప్ చేస్తూ బీసీసీఐ సెక్ర‌ట‌రీ దేవ‌జిత్‌ సైకియా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

విష‌యంలోకి వెళితే.. సీజ‌న్ తొలి ద‌శలో ఏప్రిల్ 26న అహ్మ‌దాబాద్ వేదిక‌గా మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు గుజ‌రాత్ టైటాన్స్‌, చెన్నై సూప‌ర్‌కింగ్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల దృష్ట్యా ఈ మ్యాచ్ వేదిక‌ను చెన్నై చిదంబ‌రం స్టేడియానికి మారుస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మ్యాచ్ స‌మ‌యంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 

ఇక మే 21 ఈ రెండు జ‌ట్లు చెన్నైలోని చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా రాత్రి 7.30 గంట‌ల‌కు మ‌రోసారి త‌ల‌ప‌డాల్సి ఉంది. తాజాగా ఈ వేదిక‌ను అహ్మ‌దాబాద్‌కు మారుస్తున్న‌ట్లు బీసీసీఐ తెలిపింది. ఐపీఎల్‌ 19వ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ 4 మ్యాచ్‌​ల్లో ఒక విజయంతో పట్టికలో 9వ స్థానంలో ఉండగా, గుజరాత్‌ టైటాన్స్‌ 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతుంది.

చదవండి: తిక్క కుదిరింది.. ఆర్సీబీ బ్యాటర్‌కు షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement