దేవజిత్‌ సైకియా ఆకస్మిక రాజీనామా | BCCI Secretary Devajit Saikia Suddenly Resigns From Important Post In Assam Government | Sakshi
Sakshi News home page

దేవజిత్‌ సైకియా ఆకస్మిక రాజీనామా

May 7 2026 3:01 PM | Updated on May 7 2026 3:10 PM

BCCI Secretary Devajit Saikia Suddenly Resigns From Important Post In Assam Government

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోం రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

అసోం ముఖ్యమంత్రి హేమంత బిస్వ శర్మ ప్రభుత్వంలో దాదాపు ఐదేళ్ల పాటు అడ్వకేట్ జనరల్‌గా సేవలందించిన దేవజిత్ సైకియా.. రాజ్యాంగ సంప్రదాయాలను గౌరవిస్తూ  పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

క్రికెట్‌తో పాటు న్యాయరంగంలోనూ సైకియా ప్రత్యేక గుర్తింపు పొందారు. అసోంకు చెందిన ఆయన గతంలో రాష్ట్ర రంజీ జట్టుకు వికెట్‌కీపర్‌, మిడిలార్డర్ బ్యాటర్‌గా సేవలందించారు. అనంతరం న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టి గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2021లో అసోం రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఇక క్రికెట్ పరిపాలనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. అసోం క్రికెట్ అసోసియేషన్‌లో వివిధ హోదాల్లో పని చేసి.. 2022లో బీసీసీఐ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. అనంతరం జై షా ఐసీసీ చైర్మన్‌గా వెళ్లిన తర్వాత బీసీసీఐ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement