Photo Credit: BCCI Twitter
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించనుంది. పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరేంగట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ కెరీర్ తొందరగా ముగియకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళికలు చేపట్టనుంది. వైభవ్‌ను చూస్తుంటే భవిష్యత్తు సచిన్‌లా కనిపిస్తున్న తరుణంలోనే అతడి కెరీర్ ఒక్క సిరీస్, ఏడాది లేదా రెండేళ్లకే పరిమితం కాకూడదని, అతడి కెరీర్ సుదీర్ఘంగా సాగాలని బీసీసీఐ భావిస్తోంది.
వైభవ్‌తో పాటు ప్రతిభ చూపుతున్న యువ ఆటగాళ్లకు సరైన మార్గదర్శకత్వం, సహకారం అందించాలని ముంబైలో గురువారం నిర్వహించిన బీసీసీఐ కీలక సమావేశంలో నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆటగాడిని ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
సచిన్ టెండూల్కర్‌లా వైభవ్ సూర్యవంశీ దేశానికి సుదీర్ఘకాలం సేవలందించే ఆటగాడిగా ఎదగాలని బీసీసీఐ కోరుకుంటోందని చెప్పారు. అతడి కెరీర్‌ను ప్రతి దశలోనూ నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సీవోఈ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇటీవలే వైభవ్ 15 ఏళ్ల 157 రోజుల వయసులో దులీప్ ట్రోఫీ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అర్ధశతకం చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 57 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. భారత్ ఆ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ద్వారా భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అతడు 776 పరుగులు చేశాడు. 237.30 స్ట్రైక్‌రేట్‌తో ఆడాడు. ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలు బాదాడు. 72 సిక్సర్లతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.


