టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది. అయ్యర్ వేగంగా కోలుకుంటున్నట్లు బోర్డు తెలిపింది. "ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా శ్రేయస్ అయ్యర్ పొత్తికడుపుపై బలమైన గాయమైంది. ఈ గాయం కారణంగా అతని ప్లీహం (Spleen) చీలికకు గురై, అంతర్గత రక్తస్రావం జరిగింది.
వెంటనే అతడి గాయాన్ని గుర్తించి బీసీసీఐ వైద్య బృందం అంతర్గత రక్తస్రావాన్ని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం శ్రేయస్ ఆరోగ్యం నిలకడగా ఉంది. మంగళవారం (అక్టోబర్ 28) అతడికి మరోసారి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. అతడి స్ల్పీన్ గాయంలో మెరుగుదల కన్పించింది.
అతడు శరవేగంగా కోలుకుంటున్నాడు. అతడు మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు" అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా పేర్కొన్నారు. అయ్యర్‌ను ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో అతడు ఆస్ప్రత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముంది.
చదవండి: ఆస్పత్రిలో శ్రేయస్ అయ్యర్.. ఖర్చులు ఎవరు భరిస్తారో తెలుసా?


