ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గాయపడిన సంగతి తెలిసిందే. సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో అలెక్స్ కారీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో.. శ్రేయస్ ఎడమ వైపు పక్కటెముకలు నేలను బలంగా తాకడంతో స్ల్పీన్(ప్లీహాం)కి గాయమైంది.
అయ్యర్ ప్రస్తుతం సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బీసీసీఐ వెల్లడించింది. అయ్యర్‌ను ఐసీయూ నుంచి బయటకు తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
అయితే ఆస్పత్రిలో ఈ చికిత్సకు శ్రేయస్ స్వయంగా ఖర్చు చేస్తున్నారా? లేక బీసీసీఐ భరిస్తుందా? అన్న సందేహం అందరిలో నెలకొంది. అధికారిక మ్యాచ్‌లు లేదా టూర్‌లలో గాయపడిన క్రికెటర్ల వైద్య ఖర్చులను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI)నే భరిస్తుంది.
సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లకు బీసీసీఐ భరోసా..
👉సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఉన్న ఆటగాళ్లందరూ బీసీసీఐ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ కింద పూర్తి కవరేజీని పొందుతారు.
👉విదేశాల్లో అత్యవసర చికిత్స, సర్జరీ, ఆసుపత్రి ఖర్చులు, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) లో పునరావాసం ఖర్చులు అన్ని బీసీసీఐనే భరిస్తుంది.
👉ఆటగాడు విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ గాయం అయిన వెంటనే బీసీసీఐ మెడికల్ స్టాప్.. స్ధానిక వైద్యుల సహాయంతో వెంటనే చికిత్సను ప్రారంభిస్తారు. శ్రేయస్ అయ్యర్ విషయంలో ఇప్పుడు అదే జరిగింది.
👉గాయం కారణంగా ఒక ఆటగాడు మ్యాచ్‌లకు దూరమైనప్పుడు, మ్యాచ్ ఫీజును కూడా బీసీసీఐ పరిహారంగా చెల్లిస్తుంది.
👉సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో భాగం కాని ఆటగాళ్లకు కూడా బీమా పాలసీలు ఉన్నాయి. కానీ కాంట్రాక్ట్ ఆటగాళ్లకు లభించేంత ప్రయోజనాలను వారికి ఉండవు.
చదవండి: Shreyas Iyer injury update: శ్రేయస్ అయ్యర్ తల్లిదండ్రుల కీలక నిర్ణయం..


