ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ 16న దుబాయ్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేలంలో పాల్గోనే ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేలం కోసం మొత్తం 1,355 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 350 మంది షార్ట్‌లిస్ట్ అయినట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ లిస్ట్‌లో చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన 35 మంది ఆటగాళ్లు ఉండటం గమనార్హం.
సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తొలుత తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో మొదటి ప్రకటించిన జాబితాలో అతడు పేరు లేదు. కానీ చివరి నిమిషంలో తన మనసును మార్చుకుని వేలంలో పాల్గోవాలని నిర్ణయించుకున్నాడు.
దీంతో కొన్ని ఫ్రాంచైజీల అభ్యర్థన మేరకు డి కాక్‌ను తుది జాబితాలో చేర్చారు. డికాక్ తన బేస్ ధరను 50 శాతం తగ్గించుకున్నాడు. కనీస ధర రూ. రూ.కోటి రూపాయలతో అతడు వేలం బరిలోకి దిగనున్నాడు. ఈ 35 మంది క్రికెటర్లలో శ్రీలంక, సౌతాఫ్రికా ప్లేయర్లతో పాటు భారత దేశవాళీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇక వేలానికి సంబంధించిన విదివిధానాలు బీసీసీఐ ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలను మెయిల్ చేసినట్లు తెలుస్తోంది.
వేలం రూల్స్ ఇవే..
ఈ మినీ వేలం మొదట క్యాప్‌డ్ (Capped) ఆటగాళ్లతో ప్రారంభమవుతుంది. ఇందులో బ్యాటర్లు, ఆల్-రౌండర్లు, వికెట్ కీపర్-బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఉంటారు. తరువాత అన్‌క్యాప్‌డ్ (Uncapped) ఆటగాళ్లతో పూర్తి రౌండ్ కొనసాగుతుంది.
మొదటి 70 మంది ఆటగాళ్ల పేక్లు పూర్తయిన తర్వాత మిగిలిన ప్లేయర్ల కోసం యాక్సిలరేటెడ్ రౌండ్‌ను నిర్వహించనుంది. చివగా తొలి మూడు రౌండ్లలో అమ్ముడుపోని ఆటగాళ్లు ఆఖరిలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.
అయితే ఈసారి మార్క్యూ లిస్ట్ రౌండ్ ఉండదు. తొలి రౌండ్‌లో కెమెరూన్ గ్రీన్, డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, డేవిడ్ మిల్లర్ వంటి విదేశీ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశముంది. అదే విధంగా వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్‌కు కూడా భారీ ధర దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ వేలంలో అన్ని జట్లు కలిపి మొత్తం 77 స్లాట్‌లు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో 31 విదేశీ స్థానాలు ఉన్నాయి.
ఐపీఎల్ వేలంలో కొత్త ఆటగాళ్లు
విదేశీ ఆటగాళ్లు:
అరబ్ గుల్ (ఆఫ్ఘనిస్తాన్), మైల్స్ హమ్మండ్ (ఇంగ్లండ్), డాన్ లాటెగాన్ (ఇంగ్లండ్), క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా), కానర్ ఎస్టర్‌హూజెన్ (దక్షిణాఫ్రికా), జార్జ్ లిండే (దక్షిణాఫ్రికా), బయాండా మజోలా (దక్షిణాఫ్రికా), ట్రావీన్ మాథ్యూ (శ్రీలంక), డిసురి లంకాల్ (పెర్నాగెసల్ వెల్సాల్ లంకా), డిసురి లంకాల్ (శ్రీలంక), అకీమ్ అగస్టే (వెస్టిండీస్).
భారత ఆటగాళ్లు:
సాదేక్ హుస్సేన్, విష్ణు సోలంకి, సబీర్ ఖాన్, బ్రిజేష్ శర్మ, కనిష్క్ చౌహాన్, ఆరోన్ జార్జ్, జిక్కు బ్రైట్, శ్రీహరి నాయర్, మాధవ్ బజాజ్, శ్రీవత్స ఆచార్య, యష్‌రాజ్ పుంజా, సాహిల్ పరాఖ్, రోషన్ వాఘ్‌సారే, యష్ డిచోల్కర్, అయాజ్‌క్ వల్కర్, ధుర్‌మిల్త్ ఖాన్, ధుర్మిల్త్ ఖాన్ పురవ్ అగర్వాల్, రిషబ్ చౌహాన్, సాగర్ సోలంకి, ఇజాజ్ సవారియా, అమన్ షెకావత్.
చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..!


