కేకేఆర్‌ జట్టులోకి డేంజరస్‌ బౌలర్‌ | KKR signs Blessing Muzarabani as replacement for Mustafizur Rahman | Sakshi
Sakshi News home page

IPL 2026: కేకేఆర్‌ జట్టులోకి డేంజరస్‌ బౌలర్‌

Mar 14 2026 7:46 AM | Updated on Mar 14 2026 10:42 AM

KKR signs Blessing Muzarabani as replacement for Mustafizur Rahman

జింబాబ్వే పేస్‌ బౌలర్‌ బ్లెస్లింగ్‌ ముజరబాని మరోసారి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అవకాశం దక్కించుకున్నాడు. 2026 సీజన్‌ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) జట్టు ముజరబానిని ఎంచుకుంది. గత డిసెంబరులో తమ జట్టు నుంచి తప్పించిన ముస్తఫిజుర్‌ రహమాన్‌ స్థానంలో కేకేఆర్‌ ముజరాబానికి అవకాశం కల్పించింది. 

6 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న ముజరబాని తమ పేస్‌ బౌలింగ్‌ బృందంలో కీలకంగా మారతాడని కేకేఆర్‌ ఆశిస్తోంది. 89 అంతర్జాతీయ టి20ల్లో అతను 7.24 ఎకానమీతో 106 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల టి20 వరల్డ్‌ కప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న 29 ఏళ్ల ముజరబాని మొత్తం 13 వికెట్లు తీసి జింబాబ్వే సూపర్‌ ఎయిట్స్‌ దశకు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 

2025లో లుంగీ ఎన్‌గిడి స్థానంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ముజరబానిని తమ టీమ్‌లోకి తీసుకుంది. ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాకున్నా... విజేతగా నిలిచిన ఆర్‌సీబీ జట్టులో అతను భాగమయ్యాడు.
చదవండి: IPL 2026: కేకేఆర్‌కు మరో భారీ షాక్‌

Advertisement
 
Advertisement
Advertisement