'రూట్' సంచ‌ల‌న నిర్ణ‌యం.. క్రికెట్‌కు గుడ్‌బై | Joe Roots Brother To Retire After 2026 Season | Sakshi
Sakshi News home page

'రూట్' సంచ‌ల‌న నిర్ణ‌యం.. క్రికెట్‌కు గుడ్‌బై

Sep 23 2026 5:50 PM | Updated on Sep 23 2026 7:00 PM

Joe Roots Brother To Retire After 2026 Season

PC: England cricket

ఇంగ్లండ్ దిగ్గజం జో రూట్ సోద‌రుడు, గ్లామోర్గాన్ స్టార్ బిల్లీ రూట్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఈ ఏడాది డొమాస్టిక్ సీజ‌న్ త‌ర్వాత ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు రూట్ ప్రకటించాడు.  34 ఏళ్ల రూట్ 2017లో నాటింగ్‌హామ్‌షైర్ క్లబ్ తరపున ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 

రెండేళ్ల తర్వాత అతడు 2019లో గ్లామోర్గాన్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.  గ్లామోర్గాన్ క్లబ్ 2021, 2024 లలో వన్డే కప్ టైటిల్స్ గెలవడంలో బిల్లీ రూట్ కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్   83 ఫస్ట్-క్లాస్, 60 లిస్ట్-ఎ, 50 టీ20 మ్యాచ్‌లు ఆడి 6406 పరుగులు సాధించాడు.

 అతడి పేరిట 7 ఫస్ట్‌ క్లాస్‌, 3 లిస్ట్‌-ఎ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో రూట్‌ అత్యధిక స్కోర్‌ 229 పరుగులగా ఉంది. అయితే ప్రస్తుత కౌంటీ సీజన్‌లో బిల్లీ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గత సీజన్‌లోనూ ఇదే తీరు కనబరిచాడు.

ఐదు మ్యాచ్‌లు కేవలం 56 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. తన పేలవ ఫామ్ కారణంగా అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మం‍గళవారం మరో గ్లామోర్గాన్ లెజెండ్ కొలిన్ ఇంగ్రామ్ కూడా తన 22 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు.
చదవండి: పాక్‌ను ఛీకొట్టి.. చిన్న జ‌ట్టులోకి వెళ్లిపోయాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement