source: X
ఆస్ట్రేలియా వెటరన్ వికెట్‌కీపర్ బ్యాటర్, టీ20 ప్రపంచకప్ విజేత మాథ్యూ వేడ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. స్థానికంగా జరిగే బిగ్‌బాష్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు (రిటైర్మెంట్) ప్రకటించాడు. 38 ఏళ్ల వేడ్ 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా, ఇప్పుడు దేశవాళీ టీ20 లీగ్ నుంచి కూడా తప్పుకున్నాడు.
బిగ్‌బాష్ లీగ్ ప్రారంభం నుంచి (2011-12) వివిధ ఫాంచైజీలకు (హోబర్ట్ హరికేన్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్, మెల్‌బోర్న్ స్టార్స్) ప్రాతినిథ్యం వహించిన వేడ్.. 2026-27 సీజన్‌కు ముందు ఆటగాడిగా తన ప్రయాణాన్ని ముగించాడు. కోచింగ్ కెరీర్‌పై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వేడ్ ప్రకటించాడు. ప్రస్తుతం వేడ్ ఆస్ట్రేలియా పురుషుల వైట్-బాల్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.
టెస్ట్ వికెట్‌కీపర్‌గా కెరీర్ ప్రారంభించిన వేడ్.. ఆ తర్వాత స్పెషలిస్ట్ మిడిలార్డర్ బ్యాటర్‌గా మారాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వికెట్‌కీపర్-ఫినిషర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2021 టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోనూ అతను కీలక సభ్యుడిగా ఉన్నాడు.
గత సీజన్‌లో హోబర్ట్ హరికేన్స్ తరఫున బీబీఎల్ ఆడుతూనే ఆస్ట్రేలియా పురుషుల జట్టుతో కోచింగ్, కన్సల్టింగ్ బాధ్యతల్లో పనిచేశాడు. 2020 ఎడిషన్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌పై చేసిన విధ్వంసకర శతకం (61 బంతుల్లో 130 నాటౌట్) వేడ్ బీబీఎల్ కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచింది.
వేడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ పలు సీజన్లలో ఆడాడు. 2011లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున.. 2022, 2024 సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా వేడ్ ఐపీఎల్‌లో 15 మ్యాచ్‌లు ఆడి 13.07 బ్యాటింగ్ సగటుతో 8 క్యాచ్‌లు, ఒక స్టంపింగ్ నమోదు చేశాడు.
ఇదీ చదవండి: ఐసీసీలో చారిత్రక నియామకం


