source: X
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మరో ఘనత సాధించాడు. ఇంటర్ మయామీ తరఫున 100 గోల్స్ సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కాంపియోన్స్ కప్ ఫైనల్లో గోల్ చేయడంతో ఈ మైలురాయిని తాకాడు. మెస్సీ గోల్‌తో పాటు కాసెమిరో హెడర్‌తో మరో గోల్ చేయడంతో ఇంటర్ మయామీ 2-0తో క్రజ్ అజుల్‌పై విజయం సాధించి, ఐదోసారి కాంపియోన్స్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
LIONEL MESSI LIFTING HIS 49th CAREER TROPHY 🥹❤️
- The Greatest in Sporting history. pic.twitter.com/U21ZbYXbjI— Johns. (@CricCrazyJohns) September 17, 2026
2023లో ఇంటర్ మయామీలో చేరిన మెస్సీ ఇప్పటివరకు నాలుగు సీజన్లలో కలిపి 115 మ్యాచ్‌లు ఆడి 100 గోల్స్ చేశాడు. 2023లో 11, 2024లో 23, 2025లో 43, 2026లో 23 గోల్స్ సాధించాడు. మెస్సీ కెప్టెన్‌గా ఇంటర్ మయామీకి అందించిన ఐదో టైటిల్ ఇది. ఓవరాల్‌గా మెస్సీ కెరీర్‌లో ఇది 49వ టైటిల్‌గా నిలిచింది. కాగా, ఈ ఏడాది ఆగస్ట్ 31న మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: రిటైర్మెంట్‌పై మెస్సీ యూటర్న్!


