10 ఏళ్లకే టైటిల్ గెలిచిన మెస్సీ తనయుడు
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ పుత్రోత్సాహంతో పొంగిపోతుంటాడు. అతడి రెండో కుమారుడు మటియో మెస్సీ 10 ఏళ్ల వయసులోనే ఇంటర్ మయామి అకాడమీకి నేపుల్స్ కప్ టైటిల్ (కెప్టెన్‌గా) అందించి వార్తల్లో నిలిచాడు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులను ప్రత్యేకంగా ఆకర్శిస్తుంది. ముఖ్యంగా మెస్సీ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటుంది.దీని గురించి తెలిసిన తర్వాత వారు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడంటూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. నేపుల్స్ కప్ విజయం తర్వాత ట్రోఫీతో మటియో పోజులిచ్చిన వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ట్రోఫీని చేత పట్టుకుని చిరునవ్వుతో కనిపించిన మటియోపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మటియో మెస్సీ సెప్టెంబర్ 11న తన 11వ పుట్టినరోజు జరుపుకోనున్న నేపథ్యంలో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.కాగా, లియోనల్ మెస్సీకి మొత్తం ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు థియాగోకు ప్రస్తుతం 13 ఏళ్లు కాగా, చిన్న కుమారుడు సిరో వయసు 8 ఏళ్లు. మటియో వీరిద్దరి మధ్యవాడు.ఇదిలా ఉంటే, లియోనెల్ మెస్సీ కొద్ది రోజుల కిందటే అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022లో అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించిన మెస్సీ.. ఇటీవల ముగిసిన 2026 ఎడిషన్‌లో తన జట్టును రన్నరప్‌గా నిలిపాడు. చదవండి: కెవిన్ పీటర్సన్‌కు కీలక బాధ్యతలు