విండీస్‌ గడ్డపై చరిత్ర సృష్టించిన పాక్‌ ప్లేయర్‌ | Pakistan Maaz Sadaqat Creates CPL History With Fastest Century By Youngest Ever Centurion, Read Story Inside | Sakshi
Sakshi News home page

విండీస్‌ గడ్డపై చరిత్ర సృష్టించిన పాక్‌ ప్లేయర్‌

Sep 17 2026 3:33 PM | Updated on Sep 17 2026 4:07 PM

Maaz Sadaqat became the youngest centurion in CPL History

పాకిస్తాన్‌ యువ ఓపెనర్‌ మాజ్‌ సదాకత్‌ విండీస్‌ గడ్డపై చరిత్ర సృష్టించాడు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2026లో జమైకా కింగ్స్‌మన్‌కు ఆడుతున్న ఈ 21 ఏళ్ల పాక్‌ ఓపెనర్‌.. బార్బడోస్‌ ట్రైడెండ్స్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో కేవలం 44 బంతుల్లోనే శతక్కొట్టాడు. 

తద్వారా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (21 ఏళ్ల 124 రోజులు) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు విండీస్‌ విధ్వంసకర బ్యాటర్‌ షిమ్రోన్‌ హెట్‌మైర్‌ పేరిట ఉండేది. హెట్‌మైర్‌ 21 ఏళ్ల 235 రోజుల వయసులో సీపీఎల్‌ సెంచరీ చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. మాజ్‌ సదాకత్‌ సుడిగాలి శతకంతో (49 బంతుల్లో 112; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడటంతో అతడి జట్టు జమైకా కింగ్స్‌మన్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి క్వాలిఫయర్‌-2కు చేరింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ట్రైడెంట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేయగా.. జమైకా కింగ్స్‌మన్‌ కేవలం 14.1 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ట్రైడెంట్స్‌ ఇన్నింగ్స్‌లో క్వింటన్‌ డికాక్‌ (71), క్రిస్‌ గ్రీన్‌ (57 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించగా.. కింగ్స్‌మన్‌ తరఫున మాజ్‌ సదాకత్‌ సోలో ఫైట్‌ చేశాడు. 

సదాకత్‌కు టీ20ల్లో ఇది తొలి సెంచరీ. ఇతను త్వరలో జరుగబోయే ఏషియన్‌ గేమ్స్‌లో పాక్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. సదాకత్‌ ఇప్పటివరకు పాక్‌ తరఫున 6 వన్డేలు ఆడి ఓ అర్ద సెంచరీ సాయంతో 134 పరుగులు చేశాడు. 

ఇదీ చదవండి: చచ్చీ చెడి సెమీస్‌కు చేరిన పాక్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement