బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టును అదృష్టం వరించింది. మ్యాచ్ ఆడే అవసరం లేకుండానే ఆసియా క్రీడల సెమీ ఫైనల్లో బంగ్లా అడుగుపెట్టింది. అసలేం జరిగిందంటే.. జపాన్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 మధ్య ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే.
చైనాతో మ్యాచ్
ఇందులో భాగంగా మహిళల క్రికెట్ జట్ల మధ్య సెప్టెంబరు 17 నుంచి సెప్టెంబరు 22 వరకు టీ20 ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా తొలి క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్- చైనా మహిళా జట్లు మ్యాచ్ ఆడాల్సి ఉంది.
ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు
అయితే, వర్షం కారణంగా టాస్ పడకుండానే ఈ మ్యాచ్ రద్దై పోయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం.. చైనా కంటే మెరుగైన స్థితిలో ఉన్న బంగ్లాదేశ్ నేరుగా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు.. ఒక్క బంతి కూడా పడకుండానే చైనా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

చైనా జట్టు (PC: X)
సెమీస్‌కు బంగ్లాదేశ్ అర్హత
కాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ మహిళా జట్టు పదో స్థానంలో ఉండగా.. చైనా 36వ స్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. రెండో క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్- పాకిస్తాన్ జట్లు గురువారమే తలపడనున్నాయి.
మరోవైపు.. మూడో క్వార్టర్ ఫైనల్లో మలేషియా- శ్రీలంక మహిళా జట్లు పోటీ పడనుండగా.. నాలుగో క్వార్టర్ ఫైనల్లో భారత్- జపాన్ జట్లు తలపడతాయి. కరోగి స్పోర్ట్స్ పార్క్‌లో సెప్టెంబరు 18న జరిగే నాలుగో క్వార్టర్ ఫైనల్‌లో గెలిచిన జట్టును బంగ్లాదేశ్ సెమీస్‌లో ఢీకొంటుంది.
సెమీ ఫైనల్లో భారత్‌తో ఢీ
బలాబలాలు, ర్యాంకింగ్స్ ఆధారంగా హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు జపాన్ కంటే పటిష్ట స్థితిలో ఉంది. కాబట్టి సెప్టెంబరు 20న జరిగే తొలి సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ టీమిండియాను ఎదుర్కొనే అవకాశం ఉంది.
చదవండి: అగార్కర్ అవుట్.. టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్!


