Photo Credit: BCCI Twitter
జపాన్ వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్‌లో పాల్గొనే టీమిండియా జట్టులో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. ఇప్పటికే గాయం కారణంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని పక్కనబెట్టిన బీసీసీఐ తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డిని కూడా జట్టు నుంచి తప్పించింది. ఇదే సమయంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు మాత్రం నితీశ్‌రెడ్డి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. ఇక గాయపడిన వరుణ్ చక్రవర్తి స్థానంలో విప్రజ్ నిగమ్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది.
అయితే ఆసియా గేమ్స్ నుంచి నితీశ్ కుమార్ రెడ్డిని తప్పించడం వెనుక బీసీసీఐ స్పష్టమైన సమాచారం ఇవ్వనప్పటికీ, రాబోయే ఏడాదిలో టీమిండియా వన్డే ప్రపంచకప్ ఆడనుంది. హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా భావిస్తున్న నితీశ్‌రెడ్డికి వీలైనంత ఎక్కువగా వన్డే మ్యాచ్‌ల్లో అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.
ఇప్పటికే టెస్టుల్లో తానేంటో నిరూపించుకున్న నితీశ్‌రెడ్డి వన్డేల్లోనూ అదే తరహా ప్రదర్శన చేయాలని బీసీసీఐ ఆశిస్తోంది. ఇప్పటివరకు ఆరు వన్డేలు మాత్రమే ఆడిన నితీశ్‌రెడ్డి వంద పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీశాడు. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు మాత్రం నితీశ్‌కుమార్ రెడ్డిని ఎంపిక చేయడం జరిగింది.
ఆసియా గేమ్స్‌కు టీమిండియా:
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్, విప్రజ్ నిగమ్.


