అతడు బంగారం.. ఇతడేమో అంచనాలు పెంచేశాడు! | Has raised Expectations: Aakash Chopra lauds Nitish Kumar Reddy spell | Sakshi
Sakshi News home page

IND vs AFG: అతడు బంగారం.. ఇతడేమో అంచనాలు పెంచేశాడు

Sep 16 2026 1:42 PM | Updated on Sep 16 2026 2:13 PM

Has raised Expectations: Aakash Chopra lauds Nitish Kumar Reddy spell

నితీశ్‌ కుమార్‌ రెడ్డి (PC: BCCI X)

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌ ద్వారా టీమిండియాలోకి పునరాగమనం చేశాడు యువ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి. చాన్నాళ్లుగా గాయం కారణంగా బీసీసీఐ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందిన ఈ ఆంధ్ర ఆటగాడు.. ఆదివారం నాటి తొలి టీ20 సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు.

తొలి మ్యాచ్‌లో విఫలం
ఢిల్లీ వేదికగా అఫ్గాన్‌తో తొలి టీ20లో నితీశ్‌ రెడ్డి.. రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఏకంగా ముప్పై పరుగులు ఇచ్చుకున్నాడు. కానీ వికెట్‌ మాత్రం తీయలేకపోయాడు. దీంతో ఈ పేస్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ బౌలింగ్‌పై విమర్శలు వచ్చాయి.

తిరిగి పుంజుకుని.. అద్భుత ప్రదర్శన
అయితే, మంగళవారం నాటి రెండో టీ20 సందర్భంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్‌ రెడ్డి.. విమర్శకులకు చెక్‌ పెట్టాడు. మూడు ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఈ రైటార్మ్‌ పేసర్‌.. కేవలం ఇరవై నాలుగు పరుగులే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు కూల్చాడు. అఫ్గానిస్తాన్‌ ఓపెనర్‌, కెప్టెన్‌ ఇబ్రహీం జద్రాన్‌ (37), గుల్బదిన్‌ నైబ్‌ (10), రషీద్‌ ఖాన్‌ (28)లను అవుట్‌ చేశాడు.

తద్వారా అఫ్గాన్‌ను 159 పరుగులకే చేయడంలో నితీశ్‌ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 14.5 ఓవర్లలోనే పని పూర్తి చేయగా.. 23 ఏళ్ల నితీశ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా నితీశ్‌ రెడ్డిపై ప్రశంసలు కురిపించాడు.

PC: BCCI X
అతడు బంగారం
తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఐదో బౌలర్‌ సరిగ్గా బౌలింగ్‌ చేయగలడా? వికెట్లు తీయగలడా? టీమిండియాకు ఉన్న సమస్య ఇదే. రెండో టీ20లో జస్‌ప్రీత్‌ బుమ్రా నాలుగు ఓవర్లలో 25 పరుగులే ఇచ్చి వికెట్‌ తీశాడు. అతడు బంగారం.

జట్టుకు అవసరమైనపుడు అద్భుతంగా బౌలింగ్‌ చేస్తాడు. ఇక అర్ష్‌దీప్‌ సింగ్‌ నాలుగు ఓవర్లలో 35 రన్స్‌ ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్‌ పటేల్‌ నాలుగు ఓవర్లలో 28 పరుగులే ఇచ్చాడు. ఇక రవి బిష్ణోయి 32 పరుగులిచ్చి వికెట్‌ తీశాడు.

నితీశ్‌ రెడ్డి అంచనాలు పెంచేశాడు
వీరందరిని పక్కనపెడితే.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి.. మూడు ఓవర్లలో కేవలం 24 పరుగులే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు కూల్చాడు. అతడిని ఇరవయ్యో ఓవర్లోనూ రంగంలోకి దించవచ్చు. నిజంగా నితీశ్‌ రెడ్డి అంచనాలు పెంచేశాడు. 

హార్దిక్‌ పాండ్యా తర్వాత టీమిండియాకు ఆ స్థాయి పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఎవరన్న ప్రశ్న ఉండేది. హార్దిక్‌ వారసుడిగా తానే సరైన వాడినంటూ నితీశ్‌ బెర్తు ఖరారు చేసుకునే పనిలో పడ్డాడు’’ అని ఆకాశ్‌ చోప్రా ప్రశంసించాడు.

చదవండి: అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్‌తో పోటీ.. సంజూ స్పందన ఇదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement