అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్‌తో పోటీ.. స్పందించిన సంజూ | IND Vs AFG, Sanju Samson Breaks Silence On Competition With Vaibhav Sooryavanshi And Abhishek Sharma, Read Story Inside | Sakshi
Sakshi News home page

నన్ను కాదని అతడిని ఆడిస్తారా?.. వైభవ్‌తో పోటీ.. స్పందించిన సంజూ

Sep 16 2026 8:56 AM | Updated on Sep 16 2026 10:04 AM

IND vs AFG: Sanju Breaks Silence On Competition With Vaibhav Sooryavanshi

సంజూ- వైభవ్‌ (Photo Credit: BCCI/Sonysports)

టీమిండియా ఓపెనర్‌ సంజూ శాంసన్‌ ఎట్టకేలకు బ్యాట్‌ ఝులిపించాడు. అఫ్గానిస్తాన్‌తో రెండో టీ20 సందర్భంగా ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మెరుపు అర్ధ శతకంతో అలరించాడు. మొత్తంగా 22 బంతులు ఎదుర్కొన్న సంజూ.. ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 57 పరుగులు సాధించాడు.

తొలి మ్యాచ్‌లో విఫలం కావడంతో
కాగా జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న సంజూ శాంసన్‌.. అఫ్గాన్‌తో ఢిల్లీలో జరుగుతున్న టీ20 సిరీస్‌తో టీమిండియాలోకి తిరిగి వచ్చాడు. అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం పది పరుగులే చేసి ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో సంజూపై విమర్శల వర్షం కురిసింది.

బ్యాట్‌తోనే సమాధానం 
సంజూకు బదులు.. జింబాబ్వేలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచిన చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీని ఓపెనర్‌గా పంపాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు సంజూ. రెండో టీ20లో భారత ఇన్నింగ్స్‌లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచి తన బ్యాటింగ్‌ పదును తగ్గలేదని నిరూపించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి సత్తా చాటాడు.

వైభవ్‌, అభిషేక్‌తో పోటీపై స్పందన
ఈ నేపథ్యంలో అఫ్గాన్‌పై విజయానంతరం సంజూ శాంసన్‌ మీడియాతో మాట్లాడగా.. సహచర ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీలతో పోటీ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘బయటి ప్రపంచం దృష్టిలోనే వాళ్లిద్దరు (అభిషేక్‌, వైభవ్‌) నాకు పోటీదారులు. అయితే, జట్టుగా మేమంతా ఒకటే.

దేశం కోసం ఆడుతున్నాము. అన్నింటికంటే జట్టు విజయమే మా మొదటి ప్రాధాన్యం. ఆ తర్వాతే వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తాము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకరి పట్ల ఒకరికి ప్రతికూల ఆలోచనలు ఉండవు. కోపం తెచ్చుకునే మైండ్‌సెట్‌ కూడా ఉండదు.

నన్ను కాదని అతడిని ఎలా ఆడిస్తారు?
‘నాకు కాకుండా.. అతడికే ఎందుకు అవకాశం ఇచ్చారు?.. నన్ను కాదని అతడిని ఎలా ఆడిస్తారు?’ అనే ప్రశ్నలకు తావు లేదు. అలాంటి మనస్తత్వం ఉంటే ఇక్కడ పనికిరాదు’’ అని సంజూ శాంసన్‌ విలేకరులతో పేర్కొన్నాడు. ఏదేమైనా గతంలో విమర్శల గురించి ఆలోచిస్తూ బాధపడేవాడినన్న ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. ప్రస్తుతం తానెంతో పరిణతి సాధించానని తెలిపాడు.

కచ్చితగా ప్రభావం ఉంటుంది.. కానీ
‘‘ప్రస్తుతం నాకు తగినంత అనుభవం, పరిణతి వచ్చాయి. కెరీర్‌ ఆరంభంలో ట్రోల్స్‌ చూసి బాధపడేవాడిని. నేనేమీ యంత్రాన్ని కాదు. ఆటగాళ్లు రోబోలు కాదు. కాబట్టి.. ‘అలాంటి మాటలు నాపై ప్రభావం చూపలేవు’ అని సులువుగా చెప్పలేము. ఎందుకంటే కొంతమంది మాటలు తప్పకుండా ప్రభావం చూపుతాయి.

అయితే, గతంలో మాదిరి నేను ఇప్పుడు ఆ మాటల్ని పట్టించుకోవడం మానేశాను. ఒక షాట్‌ ఆడేముందు గతంలో చాలా ఆలోచించేవాడిని. సోషల్‌ మీడియాలో ఎలాంటి విమర్శలు వస్తాయో ఊహించుకునేవాడిని. కానీ ఇప్పుడు కేవలం ఆట మీదే పూర్తిగా దృష్టి పెట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఎలాంటి సమస్యా ఉండదనే పరిణతి సాధించాను’’ అని సంజూ శాంసన్‌ ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చాడు.

చదవండి: ఇషాన్‌ కిషన్‌ ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement