శాంసన్‌ మెరుపులు.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం | Sanju Samson Half Century-India Won-by 7 Wickets Vs AFG 2nd T20I-Delhi | Sakshi
Sakshi News home page

శాంసన్‌ మెరుపులు.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం

Sep 15 2026 10:26 PM | Updated on Sep 15 2026 10:42 PM

Sanju Samson Half Century-India Won-by 7 Wickets Vs AFG 2nd T20I-Delhi

Photo Credit: BCCI Twitter

ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్ విధించిన 160 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టీమిండియా 14.5 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్‌ సంజూ శాంస‌న్ (57) అర్థ‌సెంచ‌రీ చేయగా, మరో ఓపెనర్‌ అభిషేక్ శ‌ర్మ (39) రాణించాడు. 

చివర్లో వికెట్‌ కీపర్‌ ఇషాన్ కిష‌న్ (34 నాటౌట్‌), తిల‌క్ వ‌ర్మ (15 నాటౌట్‌) అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. ఆఫ్గన్‌ బౌలర్లలో ర‌షీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు.  ఈ నేపథ్యంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 

కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ (37) టాప్ స్కోరర్‌గా నిలవగా, డార్విష్ రసూలీ (26), రషీద్ ఖాన్ (28) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో నితీశ్‌కుమార్ రెడ్డి మూడు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు, బుమ్రా, అక్షర్ పటేల్‌, బిష్ణోయిలు తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇరుజట్ల మధ్య చివరి టీ20 గురువారం ఇదే స్టేడియం వేదికగా జరగనుంది.

ఇదీ చదవండి: రెన్షా శతకం, ఇల్లిస్‌ విజృంభణ.. తొలి వన్డే ఆసీస్‌దే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement