12 ఏళ్ల క్రితం మనవరాల్ని చంపి జైలుకు : పెరోల్‌పై వచ్చి భార్య హత్య | He out on parole who got life term now assassinated his wife | Sakshi
Sakshi News home page

12 ఏళ్ల క్రితం మనవరాల్ని చంపి జైలుకు : పెరోల్‌పై వచ్చి భార్య హత్య

Sep 15 2026 6:17 PM | Updated on Sep 15 2026 6:41 PM

He out on parole who got life term now assassinated his wife

ఉత్తర ప్రదేశ్‌లో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని   సత్నా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న  ఖైదీ కల్లాన్ రైక్వార్ (50) ప్యారోల్‌పై ఇంటికి వచ్చి తన భార్యను త్రిశూలంతో పొడిచి హత్య చేశాడు.  యూపీలోని మహోబా జిల్లా కుల్పహార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  10  నెలల పసికందు హత్య కేసులో జీవిత ఖైదు  అనుభవిస్తున్న  కల్లాన్‌ ఇటీవల పెరోల్‌పై ఇంటికి వచ్చాడు.  బుధవారం  తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఇంత ఘోరానికి ఎందుకు  పాల్పడ్డాడు.

అనుమానమేనా?
తాను తినే ఆహారంలో తన భార్య చంప  ఏదో విషం కలిపిందని కల్లాన్ అనుమానించాడు. ఈ విషయంలో ఆదివారం రాత్రి వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపోదిక్తుడైన  కల్లాన్ ఇంట్లోని త్రిశూలంతో భార్య చంప (45) తలపై, మెడపై తీవ్రంగా పొడిచి చంపేశాడు. రాత్రంతా అక్కడే  ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం చుట్టుపక్కల ఉన్న తన బంధువులకు ఈ విషయం చెప్పాడు. బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని కల్లాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టులో హాజరుపరుస్తామని మహోబా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) శశాంక్ సింగ్ చెప్పారు. 

ఇదీ చదవండి: ఫ్రిజ్‌ పేలి ఒకే కుటుంబంలో నలుగురు సజీవ దహనం

 

12 ఏళ్ల క్రితం మనవరాలి హత్య 
కుల్పహార్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్‌ఓ అవధేష్ కుమార్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. 2014లో మధ్యప్రదేశ్‌లోని నౌగావ్‌లో తన కూతురి 10 నెలల చిన్నారి తలను రాయితో పగులగొట్టి హత్య చేసిన కేసులో కల్లాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 2017లో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. ఇటీవల 14 రోజుల ప్యారోల్‌పై ఇంటికి వచ్చి ఈ అఘాయిత్యానికి  ఒడిగట్టాడు. కల్లాన్‌ కుమారుడు మున్నా దిల్లీలో కూలీగా పనిచేస్తుండగా, మరో కుమారుడు నాలుగేళ్ల క్రితం మరణించాడు. 

ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement