రూ. 12,300 కోట్ల సీఎం విజయ్‌ డీల్‌ : 9 వేల ఉద్యోగాలు | Tamil Nadu Vijay Signs Rs 12300 Crore UK Deals 9000 Jobs Expected | Sakshi
Sakshi News home page

రూ. 12,300 కోట్ల సీఎం విజయ్‌ డీల్‌ : 9 వేల ఉద్యోగాలు

Sep 15 2026 2:23 PM | Updated on Sep 15 2026 2:51 PM

Tamil Nadu Vijay Signs Rs 12300 Crore UK Deals 9000 Jobs Expected

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బ్రిటన్ పర్యటన: రూ. 12,300 కోట్ల పెట్టుబడులు

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పర్యటనలో భాగంగా నాలుగు కీలక పెట్టుబడి ఒప్పందాలపై సంతకం చేశారు.  రాష్ట్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం, ఈ ఒప్పందాల విలువ దాదాపు రూ. 12,300 కోట్లు కాగా, దీనివల్ల సుమారు 9,000 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అంచనా. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే రూ. 1 లక్ష కోట్లకు పైగా విలువైన పెట్టుబడి అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయని ప్రభుత్వం  వెల్లడించింది.

 ఇందులో భాగంగా చెన్నైలో 'గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్' (GCC) ఏర్పాటు కోసం ఎర్నస్ట్ & యంగ్ (Ernst & Young) ద్వారా ఒక బ్రిటిష్ కంపెనీతో రూ. 1,000 కోట్ల ఒప్పందంపై కూడా విజయ్ సంతకం చేశారు.  వీటిలో అతిపెద్ద ఒప్పందం 'సంవర్ధన మదర్‌సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్'తో జరిగింది. ఈ ఒప్పందంగా రూ. 11,000 కోట్ల పెట్టుబడితో కుదిరింది. దీని ద్వారా డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, అసెంబ్లీ రంగాల్లో దాదాపు 7వేల ఉద్యోగాలు వస్తాయి.

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (చెన్నై): బ్రిటన్ కంపెనీతో ఎర్నెస్ట్ అండ్ యంగ్ (Ernst & Young) ద్వారా రూ. 1,000 కోట్ల ఒప్పందం కుదిరింది. దీని ద్వారా 2,000 ఉన్నత స్థాయి ఉద్యోగాలు లభించనున్నాయి  సిగ్మా టెక్నాలజీ గ్రూప్: స్వీడన్‌కు చెందిన ఈ సంస్థ చెన్నై, తిరుచిరాపల్లిలో తమ కేంద్రాలను విస్తరించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీని వల్ల 600 ఉద్యోగాలు రానున్నాయి. విల్సన్ పవర్ సొల్యూషన్స్: తిరువల్లూరు జిల్లాలో రూ. 300 కోట్ల పెట్టుబడితో మరో ఒప్పందం కుదిరింది. దీని ద్వారా దాదాపు 400 ఉద్యోగాలు లభిస్తాయి.

ఫోకస్ రంగాలు: అధునాతన తయారీ (అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్), ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్, మరియు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. యూకే పర్యటనలో మోటార్ స్పోర్ట్స్ మరో ముఖ్యమైన అంశం  తమిళనాడులో ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ నగరాన్ని అభివృద్ధి చేయడం, రేసింగ్‌కు సంబంధించిన తయారీ మరియు అనుబంధ పరిశ్రమలలో అవకాశాలను సృష్టించడం వంటి ప్రభుత్వ ప్రణాళికలతో కూడా ఈ పర్యటనకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్ సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్‌ను సందర్శించి, ప్రముఖ నటుడు, రేసర్ అజిత్ కుమార్ పాల్గొన్న రేసును జెండా ఊపి ప్రారంభించారు. తమిళనాడులో ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ప్రణాళికలో ఇది భాగం. 

ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్‌

ప్రతిపక్షం విమర్శలు- టీవీకే స్పందన
అయితే, ఈ పెట్టుబడుల ప్రోత్సాహం పారదర్శకత లోపించిందని ప్రతిపక్షాల నుంచి విమర్శలను కూడా రేకెత్తించింది. విజయ్ పర్యటన వివరాలు, సమావేశాలపై పారదర్శకత కొరవడిందంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో టీవీకే స్పందించింది . దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్న నేపథ్యంలో (పోటీ ఫెడరలిజం), ఎంఓయూలు కుదిరిన వెంటనే వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని తెలిపింది.సెప్టెంబర్ 16 వరకు యూకేలోనే ఉండనున్న విజయ్ మరిన్ని ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement