ఇదంతా సోషల్ మీడియా జమానా. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడితే ఎవరి మనోభావాలు హర్ట్ అవుతాయో చెప్పలేం. ఒకరి గురించి మాట్లాడితే మరొకరి గురించి మాట్లాడినట్లు అనిపించొచ్చు. ఇప్పుడు ఈ ఉపోధ్ఝాతం అంతా ఎందుకంటే.. తమిళ బిగ్‌బాస్‌లో రాజకీయ రగడ రేగింది. హోస్ట్ విజయ్ సేతుపతి చేసిన కొన్ని కామెంట్స్.. ముఖ్యమంత్రి విజయ్‌ని ఉద్దేశించినవా అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగింది?
(ఇదీ చదవండి: త్రిగుణ్‌ని చెడుగుడు ఆడేసుకున్న సుధీర్.. నామినేషన్స్‌లో రచ్చ)
తెలుగుతో పాటు తమిళంలోనూ గతవారమే బిగ్‌బాస్ షో మొదలైంది. మన దగ్గర ఇంకా కెప్టెన్సీ పోటీ ప్రారంభం కాలేదు. తమిళ సీజన్‌లో మాత్రం గతవారం కెప్టెన్సీ పోటీని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల తరహాలో నిర్వహించారు. అంటే కెప్టెన్ కావాలనుకునే హౌస్‌మేట్స్.. గెలిపేస్తే ఇది చేస్తాం అది చేస్తామని వాగ్దానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే విజేతగా నిలిచిన సతిగా అనే అమ్మాయి ఇలా చాలా ప్రామిస్‌లు చేసింది. కానీ విజేత అయిన తర్వాత వాటిని నెరవేర్చలేకపోయింది. దీంతో వీకెండ్ వచ్చిన హోస్ట్ విజయ్ సేతుపతి ఈమెకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు.
సతిగా చేసిన వాటిని విమర్శించే క్రమంలో హోస్ట్ విజయ్ సేతుపతి.. 'హామీలు ఇవ్వడం, బాధ్యతలు స్వీకరించడం, కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడటం నాయకుడి లక్షణాలు. సమస్యలు వచ్చినప్పుడు తప్పించుకోవడం నాయకత్వం కాదు. ప్రతిపక్షాన్ని నిందించడం మాత్రమే నాయకుడి లక్షణం కాదు' అని అన్నాడు. అయితే ఇక్కడ ఏ రాజకీయ పార్టీ, నాయకుడు పేరు గానీ చెప్పలేదు. కానీ సేతుపతి.. సీఎం విజయ్‌ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు ట్రోల్స్ చేశారు.
దీంతో విజయ్ అభిమానులు.. విజయ్ సేతుపతి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. మరోవైపు ఈ షో ప్రసారమవుతున్న విజయ్ టీవీ కూడా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చింది. బిగ్‌బాస్ తమిళ సీజన్ 10.. షో ఫార్మాట్, థీమ్స్, గేమ్ వాతావరణానికి అనుగుణంగా రూపొందించిన వినోద కార్యక్రమం. ఇందులోని పరిస్థితులు, డైలాగ్స్, అభిప్రాయాలు షోలో భాగంగానే చూడాలి. కార్యక్రమంలో కనిపించే వ్యాఖ్యలకు బయట ఉన్న ఏ వ్యక్తి, సంస్థ, వ్యవస్థతో సంబంధం లేదని పేర్కొంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10 తెలుగు: ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారంటే?)
#VijaySethupathi Directly attack Someone🙄🤔#BiggBoss10Tamil #BiggBossTamil10 #BiggBossTamil #BiggBoss pic.twitter.com/3Pts1Wonfz
— Dinesh Kumar👁 (@DineshKumaaaar) September 12, 2026
— Vijay Television (@vijaytelevision) September 14, 2026


