మంచు మనోజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. హనుమా రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. నేడు రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసేంది. దీనిని మంచు మనోజ్ పోస్ట్ చేస్తూ ఈమెతో కలిసి వెండితెరపై నటించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా ఈ లుక్‌లో రమ్యకృష్ణ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. 1897, 1920ల మధ్య బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రంలో మారియా ర్యాబోషాప్కా హీరోయిన్‌గా కనిపించనున్నారు. సముద్రఖనితో పాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.


