ఈ రోజుల్లో సినిమా తీయడం ఎంత కష్టమో.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే కష్టం. పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తే కానీ సినిమా రిలీజ్ అవుతుందన్న విషయం జనాల్లోకి వెళ్లడం లేదు. పెద్ద సినిమాలకు సైతం ప్రమోషన్స్ గట్టిగానే చేయాల్సి వస్తుంది. హీరో హీరోయిన్లతో పాటు చిత్రబృందం అంతా ప్రచారంలో పాల్గొంటున్నాయి. అప్పుడే ఆ సినిమాపై కాస్త బజ్ ఏర్పడి.. జనాల్లో దానిపై చర్చ జరుగుతుంది. ఇక చిన్న సినిమాల పరిస్థితి అయితే మరీ దారణం. పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసినా.. సినిమా టైటిల్ జనాల్లోకి వెళ్లడం లేదు. అందుకే పేరున్న నటీనటులతో ఇంటర్వ్యూలు ఇప్పించడం..హీరో హీరోయిన్లతో మీడియా సమావేశాలు పెట్టి.. వీలైనంత వరకు సినిమాని జనాల్లోకి తీసుకెళ్తున్నారు.
ముఖ్యంగా హీరోహీరోయిన్లు ప్రతి ఈవెంట్‌లోనూ పాల్గొంటున్నారు. అయితే కొన్ని చిన్న సినిమాలో నటించిన నటీనటులు మాత్రం ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటున్నారు. చిన్న చిన్న కారణాలు చెప్పి..ప్రచారానికి డుమ్మా కొడుతున్నారు. తాజాగా మిస్సింగ్ మేఘన అనే సినిమా విషయంలోనూ ఇదే జరిగింది.
(ఇదీ చదవండి: ఓటీటీ తర్వాత థియేటర్‌లో.. కానీ ఎక్కడ తేడా కొట్టింది?)
వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్రబృందం ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ ఈవెంట్‌కి హీరోతో పాటు మిగతా నటీనటులంతా హాజరయ్యారు. కానీ హీరోయిన్‌గా నటించిన అమ్ము అభిరామి మాత్రం..ఈవెంట్‌కి రాలేదు. దర్శకుడితో గొడవ జరిగిందని.. అందుకే ఆమె ప్రమోషన్స్‌కి దూరం ఉందనే పుకార్లు కూడా ఉన్నాయి.
అయితే దర్శకుడు మాత్రం తనతో ఎలాంటి గొడవ జరగలేదనే క్లారిటీ ఇచ్చాడు. తనకు ఇంకొంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉందని..అందుకే రాలేదని చెప్పాడు. అయితే హీరో మాత్రం మరోలా చెప్పాడు. తను వేరే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉందని.. అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్‌కి హాజరకాలేదని చెప్పాడు. అసలు కారణం ఏదో తెలియదు కానీ..ప్రమోషన్స్‌కి హీరోయిన్ రాకపోవడం మాత్రం సినిమాకు ఎంతో కొంత మైనస్ అనే చెప్పాలి.


