‘కల్చర్‌ అనేది వేసుకునే దుస్తుల్లో లేదు’ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. | Aishwarya Lekshmi Delivers A Strong Counter To Trolling Her Outfits Makes Comments | Sakshi
Sakshi News home page

Aishwarya Lekshmi: డ్రస్‌పై ట్రోల్స్‌.. ఐశ్వర్యలక్ష్మి షాకింగ్‌ కామెంట్స్‌

Sep 14 2026 2:21 PM | Updated on Sep 14 2026 2:43 PM

Aishwarya Lekshmi Delivers A Strong Counter To Trolling Her Outfits Makes Comments

మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌లో ఆమె వేసుకున్న దుస్తులపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తన విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై ఐశ్వర్య స్పందించారు. తన దుస్తుల వల్ల తాను ఇబ్బందిగా ఫీల్‌ కాలేదని.. ఫొటోగ్రాఫర్లు వ్యవహరించిన తీరు తనకు ఇబ్బందికి గురిచేసిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 
ఈవెంట్‌లో ఫొటోగ్రాఫర్లు తన ముఖంపై కాకుండా అభ్యంతరకమైన కోణాల్లో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారని తెలిపారు. దీంతో తన వ్యక్తిగత హద్దులు ఉల్లంఘించినట్లు అనిపించిందన్నారు.
ఇదీ చదవండి: అడుగుపెట్టగానే ఫేమస్‌.. ఈ బిగ్‌బాస్‌ బ్యూటీ ఎవరో తెలుసా?

‘ఆ సమయంలో అసౌకర్యంగా ఫీల్‌ అయ్యాను. అలా అనిపించినప్పుడు మన బాడీ లాంగ్వేజ్‌ కూడా మారుతుంది. అయితే అక్కడి నెటిజన్లు నేను వేసుకున్న దుస్తుల వల్లే అలా ఇబ్బంది పడుతున్నానని అనుకున్నారు. అలా అసౌకర్యంగా ఫీల్‌ అవ్వడం ఎందుకు? అలాంటి డ్రెస్‌ ఎవరు వేసుకోమన్నారు? అంటూ నెటిజన్లు చేసిన కామెంట్స్‌ని ఆ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా కల్చర్‌ అంటే వేసుకునే డ్రెస్‌లు మాత్రమే కాదని ఇతరులను గౌరవించడం కూడా ఒక భాగమేనని స్పష్టం చేశారు. ఇప్పుడీ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

ఇవరీ ఐశ్వర్య లక్ష్మి
ఐశ్వర్య లక్షి మొదట వైద్య వృత్తిలో కొనసాగాలని భావించినప్పటికీ.. నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు. 2017లో మలయాళి చిత్ర సీమలో అడుగుపెట్టారు. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్‌ సిల్వన్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ‍ప్రస్తుతం ఆమె మలియాళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement