breaking news
Aishwarya Lekshmi
-
ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి మరీ వెక్కిరించాడు..చాలా బాధపడ్డా: ఐశ్వర్య లక్ష్మి
సినీ తారలపై ట్రోల్స్ రావడం కామన్. అయితే కొన్ని సందర్భాల్లో ఆ ట్రోల్స్ వారి కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అవకాశాలు చేజారేలా చేస్తాయి. నటి ఐశ్వర్య లక్ష్మి విషయంలోనూ ఇదే జరిగిందట. ‘కింగ్ ఆఫ్ కోథా’ సినిమా తర్వాత తనపై వచ్చిన ట్రోల్స్, విమర్శలు తనను ఎంతగానో ఇబ్బంది పెట్టాయని.. చివరకు కొన్ని అవకాశాలను కూడా వదులుకోవాల్సి వచ్చిందని ఆమె తాజాగా వెల్లడించారు.దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘కింగ్ ఆఫ్ కోథా’లో ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలో కనిపించారు. అభిలాష్ జోషి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2023లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమాతో పాటు నటీనటులపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. ‘కింగ్ ఆఫ్ కోథా’ పరాజయం తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. సినిమా విడుదల తర్వాత మలయాళ చిత్రపరిశ్రమలో తనకు అవకాశాలు ఇవ్వడానికి కొందరు భయపడినట్లు అనిపించిందని చెప్పారు.‘2023లో భారీ అంచనాల మధ్య ‘కింగ్ ఆఫ్ కోథా’ విడుదలైంది. కానీ సినిమా తర్వాత మలయాళ చిత్రపరిశ్రమ నాకు అవకాశాలు ఇవ్వడానికి భయపడినట్లు అనిపించింది. కేవలం నన్ను మాత్రమే కాదు.. దుల్కర్‌తో పాటు చిత్ర బృందం మొత్తాన్ని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. నా నటన, డైలాగ్ డెలివరీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కొన్నిసార్లు వారు చెప్పింది నిజమేనేమో అని నాకూ అనిపించేది.సినిమాలో తాను దుల్కర్‌ను ‘రాజువెట్టా’ అని పిలిచిన విధానాన్ని కూడా నెటిజన్లు ట్రోల్ చేశారని ఆమె గుర్తుచేసుకున్నారు. ‘హలో మమ్మీ’ సినిమా షూటింగ్ సమయంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా తనను పిలిచి ఆ విషయాన్ని వెక్కిరించారని, అప్పుడు చాలా బాధపడ్డానని చెప్పారు. అంతేకాదు.. ట్రోలింగ్ ప్రభావం తనకు వచ్చిన అవకాశాలపైనా పడిందని ఐశ్వర్య లక్ష్మి తెలిపారు. దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశం వచ్చినప్పటికీ.. విమర్శలకు భయపడి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు.‘‘దుల్కర్‌తో కలిసి ఓ కమర్షియల్ యాడ్‌లో నటించే అవకాశం వచ్చింది. కానీ ట్రోలింగ్ దెబ్బకు భయపడి ఆ అవకాశాన్ని వదులుకున్నాను. నేను నటిస్తే దారుణంగా విమర్శలు వస్తాయని.. అది చివరకు మీకే సమస్య కావచ్చని చెప్పి ఆ ప్రాజెక్ట్‌ను తిరస్కరించాను. ‘కింగ్ ఆఫ్ కోథా’ ట్రోల్స్ నన్ను అంతగా ప్రభావితం చేశాయి’ అని ఐశ్వర్య లక్ష్మి పేర్కొన్నారు.సినిమా ఫలితం, తనపై వచ్చిన విమర్శలు తన మానసిక ధైర్యాన్ని కూడా దెబ్బతీశాయని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. -
అల్లు అర్జున్ రాకా.. మరో భామ రాక..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న మూవీ రాకా. ఈ మూవీకి అట్లీ దర్శకత్వంలో వహిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె మెయిన్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మికా మందన్నా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారని సమాచారం. వీటిలో ఓ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఇటీవలే మంచు లక్ష్మీ సైతం రాకా షూటింగ్ సెట్ అద్భుతంగా ఉందంటూ కొనియాడింది.ఈ నేపథ్యంలో రాకాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ మూవీలో నలుగురు భామలు కనిపించనున్నారు. తాజాగా మరో ముద్దుగుమ్మ ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కానుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ఐశ్వర్య లక్ష్మీ సైతం నటించనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమె కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. లేడీ విలన్ పాత్ర పోషించనుందని లేటేస్ట్ టాక్. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. దీనిపై రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.ప్రస్తుతం ముంబయిలో వేసిన ఓ భారీ సెట్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో సెట్‌ను రెడీ చేయిస్తున్నారని సమాచారం. ఈ సెట్ వర్క్ పూర్తయ్యాక అక్కడ చిత్రీకరణ ఆరంభిస్తారని సమాచారం. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగిబాబు, జిమ్ సర్భ్, ఫెమినా జార్జ్, నైలా గ్రేవాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నారు. -
ఇష్టపడి డాక్టర్ అయ్యాను..!
మనకు జీవితంపై ఎన్నో ఆశలు, ఆశయాలు, కోరికలు ఉంటాయి. వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమిస్తాం. అయితే విధి అనేది ఒకటి ఉంటుంది కదా. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేదు. ఎవరు ఏమి అనుకున్నా దాని రీతిలోనే నడవాల్సి ఉంటుంది. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మచ్చుకు నటి ఐశ్వర్య లక్ష్మినే తీసుకుంటే. ఈమె ఇప్పుడు మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ పాపులర్ కథానాయకిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విష్ణు విశాల్‌కు జంటగా ఐశ్వర్య లక్ష్మి నటించిన కట్టా కుస్తీ –2 చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అంతకు ముందు సూరి సరసన నటించిన మామన్ చిత్రం సక్సెస్ అయ్యింది. ఇకపోతే మూడు పదుల వయసు దాటినా ఈ భామ అవివాహితగానే జీవిస్తున్నారు. వివాహ బంధంపై పెద్దగా నమ్మకం లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు. ఐశ్వర్య లక్ష్మి కేరళాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగ దంపతుల ఎకైక సంతానం. వారు తమ కూతురు బాగా చదువుకుని డాక్టర్లు కావాలని, పెళ్లి చేసుకుని ఒక మంచి వైద్యుడిని పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఆనందంగా జీవించాలని ఆశపడ్డారు. వారి ఆశలకు తగ్గట్టుగానే ఐశ్వర్య లక్ష్మి చదువును చాలా ఇష్టంగా మనసు పెట్టి చదువుకున్నారు. తల్లి తండ్రుల కోరిక ప్రకారమే వైద్య విద్యలో ఉత్తీర్ణురాలై, హౌస్ సర్జరీ కూడా చేశారు. దీంతో ఆమె తల్లి దండ్రులు చాలా సంతోషిచారు. అలాంటిది అనూహ్యంగా ఐశ్వర్య లక్ష్మి మోడలింగ్ రంగంలో ప్రవేశించారు. ఆ తరువాత సినీ రంగం ప్రవేశం చేశారు. ఐశ్వర్య లక్ష్మి సినిమాల్లో నటించడం ఆమె తల్లిదండ్రులు తట్టుకోలేక పోయారు. తమ ఆశలు పూర్తిగా అడియాశలు అయ్యాయని ఎంతో బాధపడ్డారని దర్శకుడు అలెప్పి అష్రాప్ ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. మనం అనుకున్నవి అన్నీ జరగవు అనడానికి నటి ఐశ్వర్య లక్ష్మి జీవితం చిన్న ఉదాహరణ అంతే. -
ఓటీటీలో ట్రెండింగ్ సినిమా.. త్వరలో మూడో పార్ట్?
ఓ సినిమాకు సీక్వెల్ తీయాలా వద్దా అనేది మొదటి భాగం సక్సెస్ బట్టి ఉంటుంది. అలాంటి రీసెంట్ టైంలో వచ్చిన సీక్వెల్ సినిమా 'గట్ట కుస్తీ 2'. చెల్లా అయ్యావు దర్శకత్వంలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా వీటిని తెరకెక్కించారు. రెండో పార్ట్ అద్భుతమైన హిట్ అయ్యేసరికి కొనసాగింపుగా మూడో భాగం ఉంటుందా అనే ప్రశ్న వచ్చింది. దీనికి దర్శకుడు సెల్లా అయ్యావు బదిలిస్తూ ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడమే దానికి సీక్వెల్ తీయడానికి కారణం అని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)సాధారణంగా పార్ట్ 2 తీస్తున్నప్పుడు దానిపై అంచనాలు ఎక్కువగా ఉంటాయని, ఇదే విషయాన్ని విష్ణు విశాల్‌తో చెప్పాను. అయితే పేరు కోసం పార్ట్ చేయొద్దని, మంచి కథ కుదిరితేనే చేద్దామని చెప్పారు. దీంతో ఆరు నెలల పాటు కష్టపడి కథ సిద్ధం చేసుకుని అది అందరికీ నచ్చిన తర్వాతే గట్ట కుస్తీ 2 ప్రారంభించాను. మొదటి భాగం కంటే రెండో భాగం ఎక్కువగా ఆదరణ పొందటం సంతోషం. తదుపరి చిత్రాలు చేస్తున్నప్పుడు సక్సెస్ అయిన చిత్రాల పేర్లతో మాత్రమే చేయకూడదని భావించాను. అలానే కథకు కొనసాగింపు ఉండాలని భావించాను. అలాంటి కథ సెట్ అయ్యేసరికి గట్ట కుస్తీ చిత్రాన్ని రెండు భాగాలు రూపొందించినట్లు చెప్పారు.మంచి కథ కుదిరితే గట్ట కుస్తీ 3 తీస్తానని దర్శకుడు చెల్లా అయ్యావు చెప్పారు. ప్రస్తుతం కెన్ కరుణాస్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. ఇది ప్రేమ, వినోదంతో కూడిన కుటుంబ సమేతంగా చూసి ఆనందించే కథా చిత్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 'గట్ట కుస్తీ 2' ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో ఏఆర్ రెహమాన్ కొడుకు) -
ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
సాధారణంగా హిట్ అయిన సినిమాలకు సీక్వెల్ తీస్తుంటారు. కానీ నాలుగేళ్ల క్రితం థియేటర్లలో రిలీజై పెద్దగా ఆడని చిత్రానికి రెండో భాగాన్ని తీశారు. అదే 'గట్ట కుస్తీ 2'. గత నెలలో తమిళంలో విడుదలై ఊహించని సక్సెస్ అందుకుంది. రూ.50 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. రెండు రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి అఖిల్ 'లెనిన్'.. అధికారిక ప్రకటన)కథేంటి?తన భార్య కీర్తి(ఐశ్వర్య లక్ష్మి)ని రెజ్లింగ్ ఛాంపియన్ చేస్తానని మాట ఇచ్చిన వీర(విష్ణు విశాల్) దాన్ని నిలబెట్టుకుంటాడు. రైల్వేలో ఆమె ఉద్యోగం చేస్తుండటంతో వీర, హౌస్ హజ్బెండ్‌గా మారి ఇంటి పనులన్నీ చూసుకుంటూ ఉంటాడు. కూతురు మది(జారా)కి స్నానం చేయించడం, స్కూల్లో దిగబెట్టడం, మళ్లీ తీసుకురావడం లాంటివన్నీ చేస్తుంటాడు. ఇలా ఎంతో అన్యోన్యంగా ఉన్న వీళ్ల సంసారంలో రెజ్లింగ్ కోచ్(తారక్ పొన్నప్ప) కారణంగా మనస్పర్థలు వస్తాయి. కీర్తి-వీర విడివిడిగా ఉండాల్సి వస్తుంది. అసలేమైంది? చివరకు భార్యభర్తలిద్దరూ ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?భార్యభర్తల నేపథ్యంగా సాగే కామెడీ సినిమాలకు పెద్దగా కథ అవసరం లేదు. కుటుంబ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా గిల్లికజ్జాలు, హాస్యం, ఎమోషన్స్, గ్లామర్ టచ్ ఇస్తే చాలు. 'గట్ట కుస్తీ 2' విషయంలో అలానే చేశారు. నాలుగేళ్ల క్రితం వచ్చిన తొలి పార్ట్ ఓ మాదిరిగా ఆడింది. అయితే అందులో ఉన్నట్లే ఇందులోనూ భార్యభర్తల కామెడీ చూపిస్తూ రెండున్నర గంటలు ఎంటర్టైన్ చేసేశారు.వీర తన ఇంటి బాధ్యతల్ని చూసుకోవడంతో సినిమా మొదలవుతుంది. ఓవైపు కీర్తి రెజ్లింగ్‌లో రోజురోజుకు ఎదుగుతుండగా.. మరోవైపు వీర డైలీ రొటీన్ సాగుతూ ఉంటుంది. అయితే తన భర్త.. కూతురి స్కూల్ టీచర్ వైపు ఆకర్షితుడవుతున్నాడని తెలిసి రుసరుసలు మొదలవుతాయి. అలా సరదాసరదాగా ఫస్టాప్ సాగిపోతుంది. ఎప్పుడైతే వీర అనుకోకుండా చేసిన ఓ పనివల్ల కీర్తి ఓ మ్యాచ్‌లో ఓడిపోతుందో కథలో సంఘర్షణ మొదలవుతుంది.ఫస్టాప్ అంతా కామెడీగా సాగతుంది. ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఎమోషనల్, కామెడీ, కోర్టు, లాయర్ తదితర సన్నివేశాలు మరింతగా ఎంటర్టైన్ చేస్తాయి. ముఖ్యంగా తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే సీన్స్, స్కూల్ టీచర్‌తో వీర చేసే డ్యాన్స్, హంగామా నవ్విస్తుంది. స్టోరీ అంతా కామెడీగా చూపిస్తున్నప్పటికీ ప్రస్తుత సమాజంలో మహిళలు ఎలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నారు. తమని తాము కాపాడుకునేందుకు చిన్నప్పటి నుంచే వాళ్లకు ఆత్మరక్షణ ఎందుకు అవసరం? లాంటి విషయాల్లో ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంది.విడాకుల కోసం నిర్వహించే కుస్తీ పోటీని క్లైమాక్స్‌లో రొమాంటిక్‌గా డిజైన్ చేయడం మంచి వినోదాన్ని పంచుతూనే మాస్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుంది. భార్య లేదా భర్త గెలిస్తే కథలో మజాపోయే అవకాశముంటుంది. అందుకే ఇద్దరికీ సమప్రాధాన్యం ఇచ్చేలా చేయడం ఆసక్తికరంగా అనిపించింది. అయితే భార్యభర్తల గొడవలోకి మూడో వ్యక్తి రాకూడదనే సందేశాన్ని చివరలో చూపించడం బాగుంది. తర్వాత ఏం జరుగతుందో ఊహించేలా ఉండటం ఈ మూవీకి మైసన్.వీరగా విష్ణు విశాల్ ఆకట్టుకున్నాడు. చెప్పాలంటే ఇతడి కంటే కీర్తి పాత్ర చేసిన ఐశ్వర్య లక్ష్మిని బాగా చూపించారు. గ్లామర్ పరంగా చీరలో ఈమెని, స్కూల్ టీచర్‌గా చేసిన మోక్షని భలే గ్లామరస్‌గా చూపించారు. వీళ్ల తర్వాత వీర-కీర్తి కూతురిగా చేసిన జారా క్యూట్‌గా అదరగొట్టేసింది. మూవీ మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ల ముగ్గురితో ప్రేమలో పడిపోతాం. మిగిలిన వాళ్లలో కరుణాస్, మునిష్కాంత్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు సందర్భానికి తగ్గట్లు సాగిపోయాయి. తెలుగు డబ్బింగ్ సరిగ్గా సరిపోయింది. ఓవరాల్‌గా చెప్పుకొంటే మంచి టైమ్ పాస్ మూవీ ఇది. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ) -
ఓటీటీకి లేటేస్ట్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన స్పోర్ట్స్ కామెడీ చిత్రం గట్ట కుస్తీ-2. ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో విడుదలైంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సినీ ప్రియులను మెప్పించింది. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, యోగి బాబు, కరుణాస్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ నెల 31 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. గతంలో వచ్చిన మట్టి కుస్తీకి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో కేవలం తమిళంలోనే విడుదల చేశారు. అయితే ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. Biggest Blockbuster of the season 🔥 #GattaKusthi2 (Tamil)Streaming from July 31 on Netflix in Tamil, Telugu, Kannada, Malayalam Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/EIPUelKlU8— OTT Trackers (@OTT_Trackers) July 28, 2026 -
రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా ఆ పనిచేయను
ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు చేతిలో ఫోన్, అందులో సోషల్ మీడియా అకౌంట్స్ ఆన్‌లో ఉండాల్సిందే. సామాన్యుడు, సెలబ్రిటీ అనే తేడా లేదు. అంతా ఇదే చేస్తున్నారు. చాలా తక్కువమంది నటీనటులు మాత్రమే దీనికి దూరంగా ఉంటున్నారు. అలాంటి వాళ్లలో మలయాళ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఒకరు. రూ.100 కోట్లు ఇచ్చినా గానీ సోషల్ మీడియాలోకి రానని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. అందుకు గల కారణాన్ని వెల్లడించింది.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన 'బిగ్‌బాస్' శుభశ్రీ)'నావి మార్ఫింగ్, డీగ్రేడింగ్ చేసిన ఫొటోలు చూసి షాకయ్యాను. దాని నుంచి తేరుకోవడానికి చాలా టైమ్ పట్టింది. రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా నేను సోషల్ మీడియాకు దూరంగానే ఉంటాను. నా సినిమాల గురించి వచ్చే వార్తలు, ప్రేక్షకుల స్పందన తెలుసుకోవడానికి మాత్రం నా పెంపుడు కుక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ని ఉపయోగిస్తాను. ప్రస్తుతం నేను కొత్త వ్యక్తులని కలవడంలో నిజమైన ఆనందాన్ని పొందుతున్నాను' అని హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి చెప్పుకొచ్చింది.ఈమె నటించిన తమిళ మూవీ 'గట్ట కుస్తీ 2' రెండు వారాల క్రితం థియేటర్లలోకి వచ్చింది. స్పోర్ట్స్ కామెడీ జానర్లో తెరెకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులో గాడ్సే, అమ్ము తదితర చిత్రాలు చేసింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు'లో నటిస్తోంది. మరోవైపు పీరియడ్ తమిళ మూవీతో పాటు '#లవ్', 'తీవినై పోట్రు' అనే వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. (ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా)#AishwaryaLekshmi: "Even if I'm offered ₹100 crore, I will never return to social media."She revealed that morphed and degrading photos deeply affected her, adding that leaving social media finally gave her peace of mind. pic.twitter.com/tQn2LHhAfT— Filmyscoops (@Filmyscoopss) July 21, 2026


