ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న మూవీ రాకా. ఈ మూవీకి అట్లీ దర్శకత్వంలో వహిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె మెయిన్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మికా మందన్నా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారని సమాచారం. వీటిలో ఓ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఇటీవలే మంచు లక్ష్మీ సైతం రాకా షూటింగ్ సెట్ అద్భుతంగా ఉందంటూ కొనియాడింది.
ఈ నేపథ్యంలో రాకాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ మూవీలో నలుగురు భామలు కనిపించనున్నారు. తాజాగా మరో ముద్దుగుమ్మ ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కానుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ఐశ్వర్య లక్ష్మీ సైతం నటించనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమె కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. లేడీ విలన్ పాత్ర పోషించనుందని లేటేస్ట్ టాక్. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. దీనిపై రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం ముంబయిలో వేసిన ఓ భారీ సెట్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో సెట్‌ను రెడీ చేయిస్తున్నారని సమాచారం. ఈ సెట్ వర్క్ పూర్తయ్యాక అక్కడ చిత్రీకరణ ఆరంభిస్తారని సమాచారం. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగిబాబు, జిమ్ సర్భ్, ఫెమినా జార్జ్, నైలా గ్రేవాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నారు.


