ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ కదా?.. మాధురి రాథోడ్ రియాక్షన్ ఇదే | Madhuri Rathod Repsonds On Eswar Sai Episode controversey | Sakshi
Sakshi News home page

Madhuri Rathod: 'గొడవలంటేనే మీకు ఆసక్తి'.. మాధురి రాథోడ్ రియాక్షన్

Aug 24 2026 6:22 PM | Updated on Aug 24 2026 6:51 PM

Madhuri Rathod Repsonds On Eswar Sai Episode controversey

టాలీవుడ్‌లో ఇప్పుడు ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి- మాధురి రాథోడ్ ఎపిసోడ్ నడుస్తోంది. గత రెండు రోజులుగా వీరిద్దరి పేర్లే హాట్ టాపిక్‌గా మారాయి. దీనికి కారణం ఈశ్వర్‌ సాయి, మాధురి ఓకే రూమ్‌లో కనిపించడంతో ఈ వివాదం మొదలైంది. అదే సమయంలో ఈశ్వర్ సాయి భార్య అక్కడికి వెళ్లి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌ పట్టుకోవడంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరలైంది. ఆ తర్వాత ఈ టాపిక్ పెద్ద చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ఈ వివాదంపై ఈశ్వర్ సాయి క్లారిటీ ఇచ్చారు. ఆ రోజు తాను ఎందుకు ఆమె గదికి వెళ్లాల్సి వచ్చిందో తెలిపారు. కేవలం తాను మాధురి రాథోడ్ వాష్‌రూమ్ వాడుకోవడానికి మాత్రమే వెళ్లానని స్పష్టం చేశాడు. అదే సమయంలో ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో నా భార్య అక్కడకు వచ్చిందని.. అప్పుడు నేను చెప్తే వినే ఆమె లేదన్నారు. నేను, మాధురి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం కానీ.. మా మధ్య అంత వరకు వెళ్లే సీన్ లేదని వివరించారు.

తాజగా ఈ వివాదంపై మాధురి రాథోడ్ కూడా స్పందించారు. ప్రజలకు ఇలాంటి విషయాలపైనే ఎక్కువ ఆసక్తి ఉంటుందని ఆమె అన్నారు. మంచి మంచి వీడియోలు చేస్తే వాటిని ఆదరించరని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి గొడవలు,  వివాదాలపైనా అయితే మీకు చాలా ఇంట్రెస్ట్ వస్తుందని మాధురి అన్నారు. తాను 30 రోజుల మినీ వ్లాగ్‌ ఛాలెంజ్‌ చేస్తున్నానని.. ఉపయోగకరమైన కంటెంట్‌ అందిస్తున్నప్పటికీ వాటికంటే వివాదాలకే ఎక్కువ ఆదరణ వస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ గొడవ చూస్తుంటే మీకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ కదా అంటూ మాధురి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement