breaking news
Eswar Sai
-
'పండు ఐ లవ్ యూ రా.. నేను వెళ్లిపోతున్నా'
ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈశ్వర్ సాయి మోసం చేశాడని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫోక్ డ్యాన్సర్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అందరికీ సారీ.. నాకు ఇక బతకాలని లేదంటూ తన లేఖలో పేర్కొంది. పండు ఐ లవ్ యూ రా.. పిల్లలందరికీ సారీ రా అంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. నేను తప్పు చేశానని.. నా చావుకు నేనే కారణమంటూ అంటూ రాసుకొచ్చింది. నేను తప్పు చేశా.. అందుకే చనిపోవాలనుకుంటున్నానని మాధురి రాథోడ్ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. కాపాడిన కుటుంబ సభ్యులు.. ఈశ్వర్ సాయి- మాధురి రాథోడ్ ఎపిపోడ్ వివాదంలో మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులు మాధురిని కాపాడారు. ఈశ్వర్ సాయిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంటున్న మాధురిని కుటుంబ సభ్యులు కాపాడారు. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతోనే మాధురి రాథోడ్ సూసైడ్ చేసుకునేందుకు యత్నించింది. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయకుండా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని మాధురి రాథోడ్ ఆరోపిస్తోంది. -
ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయిపై కేసు
హైదరాబాద్: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయనపై డ్యాన్సర్ రమావత్ మాధురి రాథోడ్ ఫిర్యాదు చేయటంతో ఆగస్టు 22న కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈశ్వర్‌సాయి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ‘బాసింగ బలాలే’ జానపద నృత్యంలో నటించి ఈశ్వర్‌సాయి పాపులర్ అయ్యారు. ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పరారీలో 'బాసింగ బలాలే' డ్యాన్సర్ ఈశ్వర్ సాయి
'బాసింగ బలాలే' అనే ఫోక్ సాంగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ ఈశ్వర్ సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇతడి కోసం పోలీసు గాలిస్తున్నారు. తోటి డ్యాన్సర్ మాధురి రాథోడ్ కేసు పెట్టడమే దీనంతటికి కారణం. పెళ్లి పేరుతో తనని శారీరకంగా ఉపయోగించుకుని మోసం చేశాడని మాధురి కొన్నిరోజుల క్రితం నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈశ్వర్ సాయి కోసం వెతుకుతున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప'లో చీర కట్టుకోవడం.. నేను చేసిన పెద్ద 'ఆల్ఫా' పని: అల్లు అర్జున్)స్వతహగా డ్యాన్సర్ అయిన ఈశ్వర్ సాయి, మాధురి కలిసి పలు ఆల్బమ్ సాంగ్స్ చేశారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్య బంధం బలపడినట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం ఓ రోజు రాత్రి, వేములవాడలోని రెడ్డి భవన్లో మాధురితో ఏకాంతంగా ఉన్నప్పుడు ఈశ్వర్ సాయిని ఇతడి భార్య రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. తర్వాత ఈశ్వర్ సాయి, మాధురి ఎవరికి వాళ్లు సోషల్ మీడియాలో తన వెర్షన్స్‌ని చెప్పుకొచ్చారు.అయితే ఈ తతంగం జరిగిన తర్వాత ఈశ్వర్ సాయి భార్య శరణ్య మాట్లాడుతూ.. తన భర్త తప్పేం లేదని మొత్తం మాధురినే దీనికి కారణమన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఈశ్వర్ సాయి తప్పు చేస్తే తనని కొట్టి పరువు తీశారని మాధురి ఆవేదన వ్యక్తం చేసింది. తన ఫోన్లో ఉన్న వీడియోలతో ఏఐ వీడియోలు సృష్టించి పరువు తీశారని, తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఏఐ వీడియోలు సృష్టించారని ఫిర్యాదు చేసింది. మాధురి ఫిర్యాదుతో 69 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం అతడి కోసం వెతుకుతున్నారు.(ఇదీ చదవండి: రవితేజ ఇంటి నుంచి కొత్త హీరో.. ట్రైలర్ రిలీజ్) -
ఫుల్ ఎంటర్టైన్మెంట్ కదా?.. మాధురి రాథోడ్ రియాక్షన్ ఇదే
టాలీవుడ్లో ఇప్పుడు ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి- మాధురి రాథోడ్ ఎపిసోడ్ నడుస్తోంది. గత రెండు రోజులుగా వీరిద్దరి పేర్లే హాట్ టాపిక్‌గా మారాయి. దీనికి కారణం ఈశ్వర్ సాయి, మాధురి ఓకే రూమ్‌లో కనిపించడంతో ఈ వివాదం మొదలైంది. అదే సమయంలో ఈశ్వర్ సాయి భార్య అక్కడికి వెళ్లి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరలైంది. ఆ తర్వాత ఈ టాపిక్ పెద్ద చర్చనీయాంశంగా మారింది.తాజాగా ఈ వివాదంపై ఈశ్వర్ సాయి క్లారిటీ ఇచ్చారు. ఆ రోజు తాను ఎందుకు ఆమె గదికి వెళ్లాల్సి వచ్చిందో తెలిపారు. కేవలం తాను మాధురి రాథోడ్ వాష్‌రూమ్ వాడుకోవడానికి మాత్రమే వెళ్లానని స్పష్టం చేశాడు. అదే సమయంలో ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో నా భార్య అక్కడకు వచ్చిందని.. అప్పుడు నేను చెప్తే వినే ఆమె లేదన్నారు. నేను, మాధురి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం కానీ.. మా మధ్య అంత వరకు వెళ్లే సీన్ లేదని వివరించారు.తాజగా ఈ వివాదంపై మాధురి రాథోడ్ కూడా స్పందించారు. ప్రజలకు ఇలాంటి విషయాలపైనే ఎక్కువ ఆసక్తి ఉంటుందని ఆమె అన్నారు. మంచి మంచి వీడియోలు చేస్తే వాటిని ఆదరించరని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి గొడవలు, వివాదాలపైనా అయితే మీకు చాలా ఇంట్రెస్ట్ వస్తుందని మాధురి అన్నారు. తాను 30 రోజుల మినీ వ్లాగ్ ఛాలెంజ్ చేస్తున్నానని.. ఉపయోగకరమైన కంటెంట్ అందిస్తున్నప్పటికీ వాటికంటే వివాదాలకే ఎక్కువ ఆదరణ వస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ గొడవ చూస్తుంటే మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కదా అంటూ మాధురి మాట్లాడారు.మాధురి రాథోడ్‌పై వైరల్ ప్రచారం.. ఆమె స్పందన ఇదే..ఈశ్వర్ సాయితో మాధురి రాథోడ్ గదిలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనపై ఆమె తాజా స్పందనలో వైరల్ గొడవలు, వివాదాలపై ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి ఉంటోందని వ్యాఖ్యానించారు.తాను 30 రోజుల మినీ వ్లాగ్… pic.twitter.com/W5JpJ2gxky— Telugu Stride (@TeluguStride) August 24, 2026 -
హోటల్లో ఏం జరిగిందో మీకు 90% తెలియదు: ఈశ్వర్ సాయి
గత కొన్నిరోజుల నుంచి 'బాసింగ బలాలే' ఫేమ్ ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి-మాధురీ రాథోడ్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. వీళ్లిద్దరూ ఒక గదిలో ఉన్నప్పుడు ఈశ్వర్ సాయి భార్య అక్కడికి వెళ్లడం, రాద్ధాంతం చేయడం లాంటివి జరిగాయి. ఈ విషయంలో ఇప్పటికే ఓ వీడియో పోస్ట్ చేసిన ఈశ్వర్ సాయి.. ఇప్పుడు మరో వీడియో రిలీజ్ చేసి అసలేం జరిగిందో చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాని కోరుతూ మాధురీకి సారీ చెప్పాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)హోటల్లో ఏం జరిగిందో మీకు తెలిసింది 10% మాత్రమే.. 90% మీకు తెలియదు. ఉదయం 4 గంటలకు లేచేసరికి నా గదిలోని బాత్రూంని అసిస్టెంట్ ఉపయోగిస్తున్నాడు. దీంతో మాధురి రాథోడ్ వాష్‌రూం వాడుకోవడానికి వెళ్లాను. అదే సమయంలో ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో నా భార్య అక్కడకు వచ్చింది. ఆ సమయంలో నేను చెప్తే వినే పరిస్థితిలో ఆమె లేదు. నేను, మాధురి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం కానీ మా మధ్య అంత వరకు వెళ్లే ర్యాపో రాలేదు. నా భార్యకు నాపై ఇంతకుముందే చాలా అనుమానం ఉంది. విశాల్ ఎవరో నాకూ తెలీదు. ఇంత జరిగినందుకు మాధురి రాథోడ్‌కు నా తరపున సారీ.. ఇంక ఇంతటితో ఆపేయండి ప్లీజ్' అని ఈశ్వర్ సాయి చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: సంక్రాంతి బరిలో 'మహాకాళి'.. వర్మ ఈసారి ఏం చేస్తాడో?) -
నేను చేసింది తప్పే.. ఆమె చాలా మంచిది : ఈశ్వర్ సాయి
ఫోక్ సాంగ్స్ యాక్టర్ ఈశ్వర్ సాయి ఇటీవల ఓ అమ్మాయితో గదిలో ఉండగా.. అతని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈశ్వర్ సాయి పేరు నెట్టింట వైరల్ అవుతుంది. పలువురు నెటిజన్స్ అతన్ని ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఈశ్వర్ సాయి స్పందించాడు. తాను చేసింది తప్పేనని..ఒత్తిడితో అలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. అందుకే మాధురికి కనెక్ట్ అయ్యా.. గత కొన్నాళ్లుగా నేను ఒత్తిడిలో ఉన్నా. ఇంట్లో భార్యతో గొడవలు జరిగాయి. చాలా ప్రెజర్ ఉంది. అప్పుడే నాకు మాధురి కనెక్ట్ అయింది. నాకున్న ప్రెజర్‌కి..ఆమె చూపించిన కేరింగ్‌కి అట్రాక్ట్ అయ్యా. నాకు చాలా నచ్చింది. ఆమెతో నాకు ఐదేళ్లుగా పరిచయం ఉంది. కానీ మేమిద్దరం రిలేషన్ స్టార్ట్ చేసింది మాత్రం రెండున్నర నెలల క్రితమే. ఆమెతో ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అయ్యాను.చేసింది తప్పే.. నేను చేసింది తప్పే. నేను ఉన్న ప్రేజర్లో ఆ తప్పు చేశా. ఆ సమయంలో మాధురితో కనెక్ట్ అవ్వడం కరెక్టే అనిపించింది. మ్యూచల్గానే మా ఇద్దరి మధ్యన రిలేషన్ నడిచింది. ఇది ఒప్పుకుంటున్నా. ఇలా చేయడం తప్పే కానీ..నా భార్య ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం 200 శాతం తప్పు. కూర్చొబెట్టి మాట్లాడితే అందరి జీవితాలు బాగుండేవి. ఈ వీడియో పెట్టేసరికి ..ఇప్పుడు నేను బయటకు రాలేని పరిస్థితి. నాతో పాటు నా భార్య జీవితం కూడా నాశనం అయినట్లే కదా. ప్రస్తుతం నా మైండ్ పని చేయట్లేదు. అమ్మనాన్నలతో పాటు అత్తమామలను కూడా ఫేస్ చేయలేకపోతున్నా. నా భార్యను అయితే అసలే ఫేస్ చేయలేదు.అందుకే నేనొక్కడినే వేరే చోటుకి వచ్చేశా. ఇప్పుడు నేను సోషల్ మీడియాకు ఎంటర్టైనర్గా మారిపోయా. నాతో పాటు నా భార్య, మాధురి జీవితాలు కూడా నాశయం అయ్యాయి.మాధురికి చేతులెత్తి క్షమాపణలు చెబుతున్నా.. మాధురి చాలా మంచి అమ్మాయి. నా వల్ల ఆమె జీవితం చాలా ఎఫెక్ట్ అయింది. ఫ్యామిలీ మొత్తం ఆమె మీదనే ఆధారపడి ఉంది. తమ్ముడిని చదివించడంతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలన్నీ ఆమెనే చూసుకుంటుంది. ఇప్పుడు ఈ వీడియో వల్ల ఆమె కెరీర్ నాశనం అయింది. ఆమెకు చేతులెత్తి క్షమాపణలు చెబుతున్నా. నా భార్య తరపున కూడా ఆమెకు సారీ చెబుతున్నా. అంతకు మించి నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నా. ఒక్క చిన్న తప్పు చేసినంత మాత్రనా..మా క్యారెక్టర్‌నే ప్రశ్నిస్తున్నారు. నా గురించి తెలియని వాళ్లు కూడా నాపై నెగెటివ్‌గా మాట్లాడుతున్నాను. మీరు చూసింది కేవలం 10 శాతం మాత్రమే. చూడనిది 90 శాతం ఉంది. అవన్నీ చెప్పి ఈ ఇష్యూని మరింత పెద్దది చేయాలని లేదు.ఇల్లీగల్ ఎఫైర్ వద్దు.. ఫైనల్‌గా అందరికి చెప్పేది ఒక్కటే. దయచేసి ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోకండి. ఈ రోజు కాకపోతే రేపైనా బయటపడతాయి. జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరు ఇలాంటి తప్పులు చేయొద్దని కోరుకుంటున్నా. చూశారు కదా. మేము చేసిన ఒక తొందరపాటు నిర్ణయం వల్ల ముగ్గురి కెరియర్ నాశనం అయ్యాయి. ఇప్పటివరకు బిల్డ్ చేసుకున్న కెరియర్, లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. జనాల్ని ఫేస్ చేయలేని పరిస్థితిలో ఉన్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రజలందరికీ క్షమాపణలు కోరుతున్నాను’ అంటూ ఈశ్వర్ సాయి ఎమోషన్ అయ్యాడు.


