పరారీలో 'బాసింగ బలాలే' డ్యాన్సర్ ఈశ్వర్ సాయి | Dancer Madhuri Rathod Files Case On Eswar Sai | Sakshi
Sakshi News home page

Madhuri Rathod: పెళ్లి పేరుతో మోసం చేశాడని మాధురి ఆవేదన

Sep 1 2026 12:13 PM | Updated on Sep 1 2026 12:24 PM

Dancer Madhuri Rathod Files Case On Eswar Sai

'బాసింగ బలాలే' అనే ఫోక్ సాంగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ ఈశ్వర్ సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇతడి కోసం పోలీసు గాలిస్తున్నారు. తోటి డ్యాన్సర్ మాధురి రాథోడ్ కేసు పెట్టడమే దీనంతటికి కారణం. పెళ్లి పేరుతో తనని శారీరకంగా ఉపయోగించుకుని మోసం చేశాడని మాధురి కొన్నిరోజుల క్రితం నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈశ్వర్ సాయి కోసం వెతుకుతున్నారు.

(ఇదీ చదవండి: 'పుష్ప'లో చీర కట్టుకోవడం.. నేను చేసిన పెద్ద 'ఆల్ఫా' పని: అల్లు అర్జున్)

స్వతహగా డ్యాన్సర్ అయిన ఈశ్వర్ సాయి, మాధురి కలిసి పలు ఆల్బమ్ సాంగ్స్ చేశారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్య బంధం బలపడినట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం ఓ రోజు రాత్రి, వేములవాడలోని రెడ్డి భవన్‌లో మాధురితో ఏకాంతంగా ఉన్నప్పుడు ఈశ్వర్ సాయిని ఇతడి భార్య రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. తర్వాత ఈశ్వర్ సాయి, మాధురి ఎవరికి వాళ్లు సోషల్ మీడియాలో తన వెర్షన్స్‌ని చెప్పుకొచ్చారు.

అయితే ఈ తతంగం జరిగిన తర్వాత ఈశ్వర్ సాయి భార్య శరణ్య మాట్లాడుతూ.. తన భర్త తప్పేం లేదని మొత్తం మాధురినే దీనికి కారణమన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఈశ్వర్ సాయి తప్పు చేస్తే తనని కొట్టి పరువు తీశారని మాధురి ఆవేదన వ్యక్తం చేసింది. తన ఫోన్‌లో ఉన్న వీడియోలతో ఏఐ వీడియోలు సృష్టించి పరువు తీశారని, తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఏఐ వీడియోలు సృష్టించారని ఫిర్యాదు చేసింది. మాధురి ఫిర్యాదుతో 69 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం అతడి కోసం వెతుకుతున్నారు.

(ఇదీ చదవండి: రవితేజ ఇంటి నుంచి కొత్త హీరో.. ట్రైలర్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement