విశాఖపట్నం: మండలంలోని మత్సవానిపాలెంలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. నాలుగు రోజులుగా పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విలేజ్ టాకీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చీన్ టపాక్ డుం డుం సినిమా షూటింగ్‌ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. రోలుగుంట మండలం శరభవరం గ్రామానికి చెందిన యువ నిర్మాత నాగులపల్లి శ్రీను దీనిని నిర్మిస్తున్నారు.తాతగారి ఊరు కావడంతో మత్సవానిపాలెంలోనే షూటింగ్ ప్రారంభించారు. వై.ఎన్ లోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు.
గవిరెడ్డి శ్రీనివాస్ (శుభం ఫేం) హీరోగా, బ్రిగిడా సాగ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, అద్యంతం వినోదాత్మక చిత్రంగా చీన్ టపాక్ డుం డుం చిత్రం తెరకిక్కిస్తున్నారు.ఈ సినిమాలో దివ్వెల మాధురి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.ఆమె పై ఆదివారం కొన్ని సన్నివేషాలు చిత్రీకరించారు. ఈ షూటింగ్‌కు స్పాట్‌కు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రావడంతో పలువురు మర్యాద పూర్వకంగా కలిశారు.


