14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ | - | Sakshi
Sakshi News home page

14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌

Mar 13 2026 7:51 AM | Updated on Mar 13 2026 7:51 AM

బూరుగుపాలెంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్న ప్రశాంతి

మాకవరపాలెం: ఉచితంగా వేస్తున్న గర్భాశయ ముఖ క్యాన్సర్‌ నివారణ టీకాలను 14 ఏళ్లు నిండిన బాలికలంతా తప్పనిసరిగా వేయించుకోవాలని జిల్లా ప్రోగ్రాం అధికారి ప్రశాంతి కోరారు. మండలంలోని బూరుగుపాలెం పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆమె గురువారం పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఉపయోగాలను తల్లిదండ్రులకు వివరించారు. రక్తహీనత నివారణతోపాటు బాల్య వివాహాలు చేయడం వల్ల కలిగే అనర్థాలను తెలియజేశారు. 14 ఏళ్లు నిండిన, 15 ఏళ్లలోపు బాలికలకు తప్పనిసరిగా ఈ టీకాలను వేయించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు చరిష్మ, సాయిచరణ్‌, ఎంపీహెచ్‌ఈవో రామచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement