రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Mar 13 2026 7:51 AM | Updated on Mar 13 2026 7:51 AM

చింతపల్లి: మండల కేంద్రమైన చింతపల్లిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. గూడెంకొత్తవీధి మండలం, దామనాపల్లి శివారు దొండుగొండ గ్రామానికి చెందిన గెమ్మిలి సత్తిబాబు (26), చింతపల్లి మండలం చౌడుపల్లి శివారు గెంజిగెడ్డకు చెందిన మామిడి హరిచంద్రప్రసాద్‌ ద్విచక్రవాహనంపై చింతపల్లి వైపు బయలుదేరారు. అంతర్ల వాటర్‌ సర్వీసింగ్‌ వద్ద మలుపు తిరుగుతున్న వాటర్‌ ట్యాంకర్‌ను వీరు బలంగా ఢీ కొట్టారు. దీంతో సత్తిబాబు అక్కడక్కడే మృతి చెందాడు. హరిచంద్రప్రసాద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వ్యవసాయదారుడైన మృతుడు సత్తిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement