breaking news
Talkies
-
ప్రత్యేక పాత్రలో దివ్వెల మాధురి
విశాఖపట్నం: మండలంలోని మత్సవానిపాలెంలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. నాలుగు రోజులుగా పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విలేజ్ టాకీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చీన్ టపాక్ డుం డుం సినిమా షూటింగ్‌ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. రోలుగుంట మండలం శరభవరం గ్రామానికి చెందిన యువ నిర్మాత నాగులపల్లి శ్రీను దీనిని నిర్మిస్తున్నారు.తాతగారి ఊరు కావడంతో మత్సవానిపాలెంలోనే షూటింగ్ ప్రారంభించారు. వై.ఎన్ లోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు. గవిరెడ్డి శ్రీనివాస్ (శుభం ఫేం) హీరోగా, బ్రిగిడా సాగ హీరోయిన్గా నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, అద్యంతం వినోదాత్మక చిత్రంగా చీన్ టపాక్ డుం డుం చిత్రం తెరకిక్కిస్తున్నారు.ఈ సినిమాలో దివ్వెల మాధురి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.ఆమె పై ఆదివారం కొన్ని సన్నివేషాలు చిత్రీకరించారు. ఈ షూటింగ్‌కు స్పాట్‌కు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రావడంతో పలువురు మర్యాద పూర్వకంగా కలిశారు. -
సస్పెన్స్ కథ... సరికొత్త స్క్రీన్‌ప్లే...
హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రుద్ర ప్రొడక్షన్స్ పతాకంపై అరుణ్ రుద్ర నిర్మించిన చిత్రం ‘టాకీస్’. తాన్య ప్రధాన పాత్రలో ఉదయ్‌కుమార్ సీహెచ్ దర్శకత్వం వహించారు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ -‘‘ఇప్పటివరకు వచ్చిన హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రలో రాని స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం సాగుతుంది. ఉదయ్‌కుమార్‌కి ఇది తొలి చిత్రం అయినప్పటికీ అద్భుతంగా తీశాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇందులో పాటలు ఉండవు. సంభాషణలు కథానుసారం ఉంటాయి. ‘హృదయ కాలేయం’ సంగీత దర్శకుడు ఆర్.కె. చేసిన రీ-రికార్డింగ్ బాగుంటుంది. రవికుమార్ నీర్ల కెమెరా పనితనం చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. కచ్చితంగా మా ‘టాకీస్’ అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: రుద్ర భాస్కర్.


