సస్పెన్స్ కథ... సరికొత్త స్క్రీన్‌ప్లే... | Talkies Horror, suspense thriller movie | Sakshi
Sakshi News home page

సస్పెన్స్ కథ... సరికొత్త స్క్రీన్‌ప్లే...

Apr 9 2015 12:23 AM | Updated on Sep 3 2017 12:02 AM

సస్పెన్స్ కథ... సరికొత్త స్క్రీన్‌ప్లే...

సస్పెన్స్ కథ... సరికొత్త స్క్రీన్‌ప్లే...

హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రుద్ర ప్రొడక్షన్స్ పతాకంపై అరుణ్ రుద్ర నిర్మించిన చిత్రం ‘టాకీస్’.

హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రుద్ర ప్రొడక్షన్స్ పతాకంపై అరుణ్ రుద్ర నిర్మించిన చిత్రం ‘టాకీస్’. తాన్య ప్రధాన పాత్రలో ఉదయ్‌కుమార్ సీహెచ్ దర్శకత్వం వహించారు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ -‘‘ఇప్పటివరకు వచ్చిన హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రలో రాని స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం సాగుతుంది. ఉదయ్‌కుమార్‌కి ఇది తొలి చిత్రం అయినప్పటికీ అద్భుతంగా తీశాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇందులో పాటలు ఉండవు. సంభాషణలు కథానుసారం ఉంటాయి. ‘హృదయ కాలేయం’ సంగీత దర్శకుడు ఆర్.కె. చేసిన రీ-రికార్డింగ్ బాగుంటుంది. రవికుమార్ నీర్ల కెమెరా పనితనం చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. కచ్చితంగా మా ‘టాకీస్’ అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: రుద్ర భాస్కర్.
 

Advertisement
 
Advertisement
Advertisement