ఫోక్ సాంగ్స్ యాక్టర్ ఈశ్వర్ సాయి ఇటీవల ఓ అమ్మాయితో గదిలో ఉండగా.. అతని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈశ్వర్ సాయి పేరు నెట్టింట వైరల్ అవుతుంది. పలువురు నెటిజన్స్ అతన్ని ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఈశ్వర్ సాయి స్పందించాడు. తాను చేసింది తప్పేనని..ఒత్తిడితో అలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు.
అందుకే మాధురికి కనెక్ట్ అయ్యా..
గత కొన్నాళ్లుగా నేను ఒత్తిడిలో ఉన్నా. ఇంట్లో భార్యతో గొడవలు జరిగాయి. చాలా ప్రెజర్ ఉంది. అప్పుడే నాకు మాధురి కనెక్ట్ అయింది. నాకున్న ప్రెజర్‌కి..ఆమె చూపించిన కేరింగ్‌కి అట్రాక్ట్ అయ్యా. నాకు చాలా నచ్చింది. ఆమెతో నాకు ఐదేళ్లుగా పరిచయం ఉంది. కానీ మేమిద్దరం రిలేషన్ స్టార్ట్ చేసింది మాత్రం రెండున్నర నెలల క్రితమే. ఆమెతో ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అయ్యాను.
చేసింది తప్పే..
నేను చేసింది తప్పే. నేను ఉన్న ప్రేజర్‌లో ఆ తప్పు చేశా. ఆ సమయంలో మాధురితో కనెక్ట్ అవ్వడం కరెక్టే అనిపించింది. మ్యూచల్‌గానే మా ఇద్దరి మధ్యన రిలేషన్ నడిచింది. ఇది ఒప్పుకుంటున్నా. ఇలా చేయడం తప్పే కానీ..నా భార్య ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం 200 శాతం తప్పు. కూర్చొబెట్టి మాట్లాడితే అందరి జీవితాలు బాగుండేవి. ఈ వీడియో పెట్టేసరికి ..ఇప్పుడు నేను బయటకు రాలేని పరిస్థితి. నాతో పాటు నా భార్య జీవితం కూడా నాశనం అయినట్లే కదా.
ప్రస్తుతం నా మైండ్ పని చేయట్లేదు. అమ్మనాన్నలతో పాటు అత్తమామలను కూడా ఫేస్ చేయలేకపోతున్నా. నా భార్యను అయితే అసలే ఫేస్ చేయలేదు.అందుకే నేనొక్కడినే వేరే చోటుకి వచ్చేశా. ఇప్పుడు నేను సోషల్ మీడియాకు ఎంటర్‌టైనర్‌గా మారిపోయా. నాతో పాటు నా భార్య, మాధురి జీవితాలు కూడా నాశయం అయ్యాయి.
మాధురికి చేతులెత్తి క్షమాపణలు చెబుతున్నా..
మాధురి చాలా మంచి అమ్మాయి. నా వల్ల ఆమె జీవితం చాలా ఎఫెక్ట్ అయింది. ఫ్యామిలీ మొత్తం ఆమె మీదనే ఆధారపడి ఉంది. తమ్ముడిని చదివించడంతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలన్నీ ఆమెనే చూసుకుంటుంది. ఇప్పుడు ఈ వీడియో వల్ల ఆమె కెరీర్ నాశనం అయింది. ఆమెకు చేతులెత్తి క్షమాపణలు చెబుతున్నా. నా భార్య తరపున కూడా ఆమెకు సారీ చెబుతున్నా. అంతకు మించి నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నా. ఒక్క చిన్న తప్పు చేసినంత మాత్రనా..మా క్యారెక్టర్‌నే ప్రశ్నిస్తున్నారు. నా గురించి తెలియని వాళ్లు కూడా నాపై నెగెటివ్‌గా మాట్లాడుతున్నాను. మీరు చూసింది కేవలం 10 శాతం మాత్రమే. చూడనిది 90 శాతం ఉంది. అవన్నీ చెప్పి ఈ ఇష్యూని మరింత పెద్దది చేయాలని లేదు.
ఇల్లీగల్ ఎఫైర్ వద్దు..
ఫైనల్‌గా అందరికి చెప్పేది ఒక్కటే. దయచేసి ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకోకండి. ఈ రోజు కాకపోతే రేపైనా బయటపడతాయి. జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరు ఇలాంటి తప్పులు చేయొద్దని కోరుకుంటున్నా. చూశారు కదా. మేము చేసిన ఒక తొందరపాటు నిర్ణయం వల్ల ముగ్గురి కెరియర్ నాశనం అయ్యాయి. ఇప్పటివరకు బిల్డ్ చేసుకున్న కెరియర్, లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. జనాల్ని ఫేస్ చేయలేని పరిస్థితిలో ఉన్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రజలందరికీ క్షమాపణలు కోరుతున్నాను’ అంటూ ఈశ్వర్ సాయి ఎమోషన్ అయ్యాడు.


