మహబూబాబాద్ : బంజారా యువతులు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. తీజ్ అంటే గోధుమ నారు. ప్రకృతి శ్రావణంలో వర్షాలు కురిసి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.
ఈ సీజన్‌లో కనిపించే ఎర్రని వర్ణం గల ఆరుద్ర పురుగులను కూడా తీజ్ అని పిలుస్తారు.
ఈనేపథ్యంలో గోధుమలు బుట్టల్లో అలికి రోజూ నీళ్లు పోస్తే ఆరుద్ర పురుగులాంటి అందం, మంచి నడవడిక, బుద్ధి, సంపదలతో కూడిన వరుడు దొరుకుతాడని గిరిజనులు నమ్ముతారు.
ఈనమ్మకం వందల ఏళ్ల కిందట మొదలై రోజురోజుకూ ఆధునిక హంగులు అద్దుకుంటోంది.


