పాన్ ఇండియా రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ఏకంగా రూ.2,000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని మ్యూజిక్ డైరెక్టర్ ప్రకటించగా, నిర్మాత దిల్ రాజు కూడా ఇదే మాటను రిపీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం నిజంగా రూ.2,000 కోట్లు సాధించాలంటే ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’ వంటి భారీ పాన్ ఇండియా హిట్ చిత్రాలను మించి సినిమా ఆడాల్సి ఉంటుంది. అయితే ‘టాక్సిక్’పై ఉన్న క్రేజ్ కేవలం సోషల్ మీడియా హైప్ మాత్రమే కాదని అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో యశ్‌కు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు భారీ ప్లస్‌గా మారుతోంది.
అయితే ఈ రూ.2,000 కోట్ల స్టేట్‌మెంట్‌తో టాక్సిక్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరోవైపు హీరో యశ్ మాత్రం ఇలాంటి అతిశయోక్తి వ్యాఖ్యలకు దూరంగా ఉన్నాడు. అయితే ‘టాక్సిక్’తో తన టార్గెట్ ఏంటో మాత్రమే స్పష్టంగా చెబుతున్నాడు. ఇక ఈ భారీ అంచనాలను ‘టాక్సిక్’ నిజం చేస్తుందా? లేక రూ.2,000 కోట్లు కేవలం ప్రచార మాటగానే మిగిలిపోతుందా? అన్నది ఈ చిత్రం బాక్సాఫీస్ రిజల్ట్‌తోనే తేలనుంది.


