సీఎం రేవంత్‌తో మహేశ్‌ బాబు భేటీ | Mahesh Babu Meets Telangana CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌తో మహేశ్‌ బాబు భేటీ

Nov 29 2026 10:23 AM | Updated on Nov 29 2026 10:34 AM

Mahesh Babu Meets Telangana CM Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు భేటి అయ్యారు.శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీఎంతో ఆయన మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తొలుత సీఎంకు మహేశ్ బొకే అందజేశారు. ఆ తరువాత మహేశ్ బాబుకు శాలువాకప్పి సీఎం రేవంత్ సత్కరించారు. ఇద్దరూ ఆప్యాయంగా పలుకరించుకున్నారు. అనంతరం కాసేపు వివిధ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. అయితే, భేటీకి గల కారణాలు, చర్చించిన అంశాలు మాత్రం వెల్లడికాలేదు. 

ఇదీ చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత ఎన్టీఆర్‌.. సీక్వెల్స్‌తో ప్రభాస్‌

ఇక మహేశ్‌ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన ‘వారణాసి’ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్‌ వరల్డ్‌  చిత్రమిది. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేఎల్‌ నారాయణ, ఎస్‌.ఎస్‌ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ వీఎఫ్‌ఎక్స్‌  పనులు పూర్తి చేయడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందట. అందుకే ఈ చిత్రం విడుదల వాయిదా పడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement