పెళ్లికి అడ్డు వస్తోందని ప్రియురాలి హత్య | Woman Incident In Karnataka | Sakshi
Sakshi News home page

పెళ్లికి అడ్డు వస్తోందని ప్రియురాలి హత్య

Nov 29 2026 8:22 AM | Updated on Nov 29 2026 8:22 AM

Woman Incident In Karnataka

కర్ణాటక: అక్రమ సంబంధాల మోజులో పడిన యువకుడు జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ప్రియురాలిని హత్య చేసి జైలు పాలైన ఘటన బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా చిన్యానదడ్డి గ్రామంలో జరిగింది. వివరాలు.. స్థానికురాలు ఐరావతి ఖోత (38)తో ఓ డాబా హోటల్‌లో పనిచేసే సంజయ చవాన్‌ (28)కు పరిచయమైంది. ఇతనిది బాగల్‌కోట జిల్లా కాగా ఉపాధి కోసం వచ్చాడు. గత 9 ఏళ్లు పాటు ఆక్రమ సంబంధం నడుస్తోంది. 

ఇటీవల సంజయ్‌ ఓ యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. నువ్వు పెళ్లి చేసుకోరాదని, చేసుకుంటే నీ బండారం బయటపెడతానని ఐరావతి హెచ్చరించేది. గతంలోనూ 2 సార్లు నిశ్చితార్థమైన ఐరావతి వల్ల అవి చెడిపోవడంతో సంజయ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఈ నెల 14న ఐరావతి తోరణహళ్లిలోని ఆలయానికి వెళ్లి మళ్లీ ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు చిక్కోడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఆమె కాల్‌ డేటా విచారణలో సంజయ్‌ జాడ తెలిసింది.  అతనిని విచారించగా ఐరావతిని తానే హత్య చేసిన్నట్లు ఒప్పుకున్నాడు. ఘటనాస్థలిలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆమె శవాన్ని పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement