విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా | School bus overturns on Kailasagiri in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా

Nov 28 2026 3:54 PM | Updated on Nov 28 2026 4:02 PM

School bus overturns on Kailasagiri in Visakhapatnam

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కైలాసగిరిపై స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. కొండపై నుంచి లోయలోకి బస్సు బోల్తా పడటంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పిఠాపురం నుంచి విద్యార్థులు పిక్నిక్ కోసం విశాఖపట్నానికి వచ్చారు. ఈ క్రమంలో కైలాసగిరిపైకి వెళ్లిన స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడి లోయలోకి జారిపోయింది. కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: డీలిమిటేషన్‌ బిల్లుకు బీఆర్‌ఎస్‌ మద్దతు: కేటీఆర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement