సైగల భాష నేర్చుకోవాలనుకుంటున్నా : నిత్యామీనన్‌ | Nithya Menon Shares She Plans To Learn Sign Language | Sakshi
Sakshi News home page

సైగల భాష నేర్చుకోవాలనుకుంటున్నా : నిత్యామీనన్‌

Nov 29 2026 11:48 AM | Updated on Nov 29 2026 11:48 AM

Nithya Menon Shares She Plans To Learn Sign Language

 సినిమా ఎల్లలు దాటుతోంది.  తారలు భాషా భేదం లేకుండా నటించే స్తున్నారు.అయినప్పటికీ చాలా మంది నటీనటులకు .ఇతర భాషల్లో మాట్లాడటం ఇప్పటికీ రాదు. అయితే నటి నిత్యామీనన్‌ ఇందుకు అతీతం. ఈ మలయాళీ భామ మాతృభాషతో పాటు తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీష్‌ మొదలగు ఆరు భాషల్లో స్పష్టంగా మాట్లాడగలుగుతారట. ఈ భాషన్నింటిలోనూ ఈమె నటిస్తూ పాన్‌ ఇండియా కథానాయికిగా రాణిస్తున్నారు. ముఖ్యంగా తమిళంలో  ఓ కాదల్‌ కణ్మణి, 24, మెర్సల్, తిరుచిట్రంబళం, ఇడ్లీ కడై, తలైవన్‌ తలైవి వంటి హిట్‌ చిత్రాల్లో నటించారు.

సహజమైన నటనతో అభిమానులను అలరిస్తున్న  నిత్యామీనన్‌ తిరుచిట్రంబళం చిత్రంలో  నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. కాగా ఈమె నటిగానే కాకుండా సంగీతంపైనా ఆసక్తి చూపుతున్నారు. పలు చిత్రాల్లో పాటలు పాడిన నిత్యామీనన్‌ తాజాగా చిత్ర నిర్మాణంలోకీ ఎంటర్‌ అవుతున్నారు. క్యూరీ ప్రొడక్షన్స్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ  నాకు భాషలు నేర్చుకోవడం అంటే చాలా ఆసక్తి. ఇప్పటికే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ, ఇంగ్లీష్‌ మొదలగు ఆరు భాషల్లో సరళంగా మాట్లాడగలను. తాజాగా సైగల భాషాను నేర్చుకోవాలని ఆశపడుతున్నాను అని పేర్కొన్నారు. కాగా ఈమె తను నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఏదేమైనా నిత్యామీనన్‌ నిర్మిస్తున్న చిత్రం పలు భాషల్లో విడుదల అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నారు.కాగా ఈమె తాజాగా హిందీలో నటిస్తున్న మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ చిత్రం షూటింగ్‌ ను పూర్తి చేసుకున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement