మల్లికా షెరావత్ చెయ్యి పట్టుకున్న లాలూ తనయుడు తేజ్ | Tej Pratap Yadav Flirts With Mallika Sherawat in Reality Show Bhojpuri Bawaal | Sakshi
Sakshi News home page

మల్లికా షెరావత్ చెయ్యి పట్టుకున్న లాలూ తనయుడు తేజ్

Aug 23 2026 1:50 PM | Updated on Aug 23 2026 1:50 PM

Tej Pratap Yadav Flirts With Mallika Sherawat in Reality Show Bhojpuri Bawaal

ముంబై: ‘భోజ్‌పురి బవాల్’ రియాలిటీ షో వేదికగా ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ (తేజూ భయ్యా), ప్రముఖ సినీ నటి మల్లికా షెరావత్ మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మల్లికా షెరావత్‌తో తేజ్ ప్రతాప్ సరదాగా సంభాషిస్తూ ఆమె హస్తసాముద్రికం చూసి భవిష్యత్తు చెప్పారు. షో ప్రోమోలో తేజ్ ప్రతాప్ యాదవ్ మల్లిక చేతిని చూస్తూ.. ‘మీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంది. కానీ ఇతరుల వల్ల మీరు ఎక్కువగా బాధపడతారు’ అని పేర్కొనగా, ఆమె దానికి ఏకీభవించారు.
 

అనంతరం రాశి వివరాలు అడగ్గా మల్లిక ‘తులా రాశి’ అని సమాధానమిచ్చారు. వెంటనే తేజ్ ప్రతాప్ తనది కూడా అదే రాశి అని తెలపడంతో ఇద్దరూ నవ్వులు చిందించారు. ఆపై తన రాశి ప్రకారం ఏ రత్నం ధరించాలని మల్లిక అడగ్గా, తాను ధరించిన పుష్యరాగాన్ని చూపిస్తూ.. ‘ఇది మీ సూర్య బలాన్ని మరింత తేజోవంతం చేస్తుంది’ అని చెప్పారు. దీనికి మల్లిక స్పందిస్తూ.. ‘ఇంకా ఎంత తేజ్ (తేజస్సు) కావాలి తేజ్ గారు?’ అంటూ చమత్కరించడంతో తేజూ భయ్యా గట్టిగా నవ్వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మల్లికా షెరావత్ ప్రస్తుతం ‘ట్రైటర్స్ 2’ రియాలిటీ షోలో కూడా పాల్గొంటున్నారు. ‘భోజ్‌పురి బవాల్’ షో కలర్స్ ఛానల్‌తో పాటు జియో హాట్‌స్టార్ ఓటీటీ వేదికపై ప్రసారమవుతోంది.

ఇది కూడా చదవండి: కటకటాల్లో ‘ఆ పాత మధురాలు’.. భావోద్వేగంలో ఖైదీలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement