చిరంజీవి విశ్వంభర.. ఇంకెప్పుడు మోక్షం? | Megastar Chiranjeevi Fans waiting for Vishwambhara Movie Release date | Sakshi
Sakshi News home page

Vishwambhara Movie: చిరంజీవి విశ్వంభర.. ఇంకెప్పుడు మోక్షం?

Aug 23 2026 1:39 PM | Updated on Aug 23 2026 1:58 PM

Megastar Chiranjeevi Fans waiting for Vishwambhara Movie Release date

మెగాస్టార్ హీరోగా ప్రస్తుతం బాబీతో ఓ మూవీ చేస్తున్నారు. ఈ నెల 22న చిరు బర్త్ డే సందర్భంగా టైటిల్ కూడా రివీల్ చేశారు. ఈ చిత్రానికి కాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. గ్లింప్స్ చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ సినిమా వచ్చే ఏడాదికి సంక్రాంతికి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.

అయితే ఈ మూవీ సంగతి పక్కన పెడితే మెగాస్టార్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో నటించారు. బింబిసార ఫేమ్ వశిష్టతో విశ్వంభర మూవీ చేశారు. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీ టీజర్‌ వీఎఫ్‌ఎక్స్‌పై విమర్శలు రావడంతో సరిదిద్దే పనిలో ఉన్నారు మేకర్స్. మెగాస్టార్ బర్త్ డే రోజైనా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ ‍అలాంటిదేం జరగలేదు.. కేవలం ఓఎస్‌టీ (ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌)తో పాటు ఓ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సారి కూడా ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. 

దీంతో విశ్వంభర మూవీ రిలీజ్ ఇంకెప్పుడా అని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది దసరాకైనా రిలీజ్ చేస్తారా? అని భావిస్తున్నారు. దసరాకు విడుదలైతే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి దీనిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. కాగా.. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ చిత్రంలో త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, అశ్రిత కీలక పాత్రల్లో నటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement