Zarna Garg: హాస్యనటికి వింత అనుభవం.. బాత్‌రూమ్‌లోనే గంటపాటు.. | Zarna Garg Locked in Bathroom | Sakshi
Sakshi News home page

Zarna Garg: హాస్యనటికి వింత అనుభవం.. బాత్‌రూమ్‌లోనే గంటపాటు..

Aug 23 2026 3:45 PM | Updated on Aug 23 2026 3:47 PM

 Zarna Garg Locked in Bathroom

 ప్రముఖ హాస్యనటి జర్ణా గార్జ్‌ ప్రస్తుతం తన కామెడీ స్పెషల్‌ ‘ది మిలియన్‌ డాలర్‌ ఎక్స్‌క్యూసెస్‌’ టూర్‌తో ప్రపంచవ్యాపంగా పర్యటిస్తున్నారు. జర్మనీలోని ఓ షోకు వెళ్లిన ఆమెకు ఓ వింత అనుభవం ఎదురైంది. అక్కడి బాత్‌రూమ్‌లోకి వెళ్లి డోర్‌ ఓపెన్‌ కాకపోవడంతో లోపలే చిక్కుకుపోయారు. సుమారు గంట పాటు అందులోనే ఉండిపోయారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. సమయం గడుస్తున్న కొద్ది పరిస్థితి క్లిష్టంగా మారిందని తెలిపారు. ఆ గదిలో చిక్కుకున్నా అక్కడి సిబ్బంది పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు.

 ‘తెరవడానికి, మూయడానికి సాధ్యం కాని పరిస్థితిలో బాత్‌రూమ్‌ డోర్‌ ఉండడం చాలా వ్యగ్యం.  ఇది షేక్స్‌పియర్‌ వివాదంలా ఉంది’ అని జర్ణా ఘాటుగా స్పందించారు.  భారతీయ-అమెరికన్ స్టాండ్-అప్ హాస్యనటి అయిన జర్ణా 'ఎ నైస్ ఇండియన్ బాయ్' అనే అమెరికన్ చిత్రంతో నటిగా అరంగేట్రం చేసింది.  సోషల్‌మీడియాలో ఆమెకు సుమారు 2మిలియన్స్‌కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement