breaking news
Indian actor
-
కాన్స్‌లో భారతీయత
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినీ నటీనటుల సందడి మొదలైంది. సత్యజిత్ రే దర్శకత్వంలో సౌమిత్రా ఛటర్జీ, శుభేందు ఛటర్జీ, సమిత్ బంజా, అపర్ణా సేన్ , షర్మిలా ఠాగూర్, సిమి గరేవాల్ ప్రధాన పాత్రల్లో నటించిన బెంగాలీ చిత్రం ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ (ఇంగ్లిష్‌లో ‘డేస్ అండ్ నైట్స్ ఇన్ ది ఫారెస్ట్’). 1970లో విడుదలైన ఈ సినిమాను ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘కాన్స్ క్లాసిక్స్’ విభాగంలో ప్రదర్శించారు. ది ఫిల్మ్ ఫౌండేషన్స్ వరల్డ్ సినిమా ప్రాజెక్ట్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ , గోల్డెన్ గ్లోబ్ ఫౌండేషన్ సంస్థల నేతృత్వంలో ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ సినిమా 4కే వెర్షన్ రీ స్టోర్ చేయబడింది.ఈ వెర్షన్ చేసిన తర్వాత తొలిసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ షోకి షర్మిలా ఠాగూర్, సిమి గరేవాల్‌తో పాటుగా ఈ సినిమాని 4కే వెర్షన్ ను రీ స్టోర్ చేయడంలో కీలక పాత్ర వహించినవారు కూడా హాజరై, రెడ్ కార్పెట్‌పై నడిచారు. అలాగే షర్మిలా ఠాగూర్ కుమార్తె, జ్యువెలరీ డిజైనర్ సబ అలీఖాన్ కూడా ఈ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ‘‘ఈ సినిమాకు సంబంధించి నేను, సిమి మాత్రమే ఇంకా జీవించి ఉన్నాం’’ అన్నారు షర్మిలా ఠాగూర్.స్పెషల్ నెక్లెస్భారతీయ నటి, మోడల్ రుచి గుజ్జర్ తొలిసారిగా కాన్స్ రెడ్ కార్పెట్‌పై నడిచారు. ఆమె ధరించిన నెక్లెస్ ఈ ఫెస్టివల్లో హాట్‌టాపిక్‌గా అయింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది బొమ్మలు ఉన్న నెక్లెస్‌ను ఆమె ధరించడం చర్చనీయాంశం అయింది. మరోవైపు తన నెక్లెస్‌పై ఆమె మోది బొమ్మను డిజైన్ చేయించుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.డెంజల్ వాషింగ్టన్ కి జీవిత సాఫల్య పురస్కారంఅమెరికన్ నటి, గాయని స్కార్లెట్ జోహన్సన్ ‘ఎలియనోర్ ది గ్రేట్’ సినిమాతో దర్శకురాలిగా మారారు. ఈ సినిమాని కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా ఐదు నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ దక్కింది. అలాగే ప్రముఖ ఇండియన్ ఫిల్మ్‌మేకర్ శేఖర్ కపూర్‌తో స్కార్లెట్ కొంతసేపు మాట్లాడారు. అలాగే స్పైక్ లీ దర్శకత్వం వహించిన ‘హయ్యస్ట్ 2 లోయెస్ట్’ మూవీని ప్రదర్శించారు. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన అమెరికన్ నటుడు, దర్శక–నిర్మాత డెంజల్ వాషింగ్టన్ కు ‘పామ్ డీ ఓర్’ జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. ఈ పురస్కారం దక్కడం తనకు చాలా సర్ప్రైజింగ్గా ఉందని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు డెంజల్ వాషింగ్టన్ . ఇంకా జూలియా డుకోర్నౌస్ దర్శకత్వం వహించిన ఫ్రెంచ్ మూవీ ‘ఆల్ఫా’ ప్రీమియర్ అయ్యింది. ఈ చిత్రానికి 12 నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ దక్కింది.కాన్స్‌లో తెలుగు చిత్రం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు సినిమా ‘ఎమ్ 4 ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్) స్క్రీనింగ్ జరిగినట్లు యూనిట్ పేర్కొంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో జో శర్మ ప్రధాన పాత్ర పోషించారు. వడ్లపట్ల మోహన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జో శర్మ, వడ్లపట్ల మోహన్ కాన్స్‌లో పాల్గొన్నారు. ‘ఎమ్ 4 ఎమ్’ త్వరలో విడుదల కానుంది. -
ఈ శతాబ్దపు ఉత్తమ నటీనటులు వీళ్లే.. ఇండియా నుంచి ఓకే ఒక్కడు!
ఈ శతాబ్దపు ఉత్తమ నటీనటుల జాబితాను ప్రముఖ ఆంగ్ల పత్రిక ది ఇండిపెండెంట్ వెల్లడించింది. 21 వ శతాబ్దంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దాదాపు 60 మందితో కూడిన సినీ నటుల పేర్లను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటీనటుల పేర్లను ఇందులో చేర్చింది. అయితే భారత్ నుంచి ఏ ఒక్క స్టార్ హీరో లేకపోవడం గమనార్హం. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కూడా ఈ లిస్ట్‌లో చోటు లభించలేదు.అయితే ఈ 60 ఉత్తమ నటీనటుల జాబితాలో ఇండియా నుంచి ఒక్క నటుడు మాత్రం స్థానం దక్కించుకున్నాడు. అతను మరెవరో కాదు.. విభిన్నమైన పాత్రలతో మెప్పించిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మాత్రమే ఈ జాబితాలో నిలిచాడు. అయితే ప్రస్తుతం ఆయన ఈ ప్రపంచంలో లేరు. 2020లో ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు. ఆయన చనిపోయాక అరుదైన జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.ఇర్ఫాన్ ఖాన్ సినీ ప్రయాణం..రాజస్థాన్‌లోని పఠాన్ ముస్లిం కుటుంబంలో జన్మించారు ఇర్ఫాన్ ఖాన్. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి నటన నేర్చుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ముంబయికి వెళ్లిపోయారు. ఇర్ఫాన్ ఖాన్ తన కెరీర్లో లైఫ్ ఇన్ ఎ మెట్రో, ది డార్జిలింగ్ లిమిటెడ్, స్లమ్‌డాగ్ మిలియనీర్, పాన్ సింగ్ తోమర్, లైఫ్ ఆఫ్ పై, ది లంచ్‌బాక్స్, కిస్సా, హైదర్, పికు, తల్వార్, హిందీ మీడియం, ది సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్, ఖరీబ్ ఖరీబ్ సింగ్లే, కార్వాన్, ఆంగ్రేజీ మీడియం లాంటి సినిమాల్లో తనదైన నటనతో మెప్పించారు. తను చివరగా నటించిన ‘అంగ్రేజీ మీడియం’ షూటింగ్‌లోనూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో కొన్నాళ్లపాటు విరామం తీసుకుని మళ్లీ చిత్రీకరణ పూర్తి చేశారు.టాప్ 10 నటులు వీళ్లే..2014లో మరణించిన మరో దివంగత నటుడు ఫిలిప్ సేమౌర్ హాఫ్మన్ 21వ శతాబ్దపు ఉత్తమ నటుడిగా నిలిచారు. నటీమణుల్లో ఎమ్మా స్టోన్ 2వ స్థానం దక్కించుకుంది. క్రేజీ, స్టుపిడ్, లవ్, లా లా ల్యాండ్, ది ఫేవరెట్, పూర్ థింగ్స్ లాంటి చిత్రాల్లో నటనకు ఆమె ప్రశంసలు అందుకుంది. 2016లో రిటైర్మెంట్ ప్రకటించిన డేనియల్ డే-లూయిస్ 3 స్థానంలో నిలిచాడు. ది గ్లాడియేటర్ II నటుడు డెంజెల్ వాషింగ్టన్ 4వ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత నికోల్ కిడ్మాన్, డేనియల్ కలుయుయా, సాంగ్ కాంగ్ హో, కేట్ బ్లాంచెట్, కోలిన్ ఫారెల్, ఫ్లోరెన్స్ పగ్ వరుసగా స్థానాల్లో నిలిచారు. ఇండియా నుంచి కేవలం ఇర్ఫాన్ ఖాన్‌కు మాత్రమే ప్లేస్ దక్కింది. -
రాజ్‌కపూర్ శతజయంతి : జీనా ఇసీకా నామ్ హై!
జన్మించి నూరేళ్లు. మరణించి ముప్పై ఆరేళ్లు. మొదటి సినిమా ‘ఆగ్’ వచ్చి 75 ఏళ్లు. ఇవాళ్టికీ రష్యా వెళితే వినిపించే పాట ‘ఆవారా హూ’... చైనాలో పలికే భారతీయ నటుడి పేరు రాజ్ కపూర్. ‘ది గ్రేటెస్ట్ షో మేన్ ఆఫ్ ఇండియా’. మేరా జూతా హై జపానీ పంట్లూన్ ఇంగ్లిస్తానీ... కాని మనసు? ‘ఫిర్ భి దిల్ హై హిందూస్తానీ’. ఉత్సవంలా బతికి ఉత్సవంలా మరణించినవాడు రాజ్ కపూర్. ‘జీనా యహా.. మర్నా యహా’ సినిమాను ప్రేమించి పులకించినవాడు. అతనికి నివాళి. ఘన స్మరణ.మే 2, 1988.న్యూదిల్లీ సిరిఫోర్ట్ ఆడిటోరియమ్... జాతీయ పురస్కారాల ప్రదానం. హాలు కిక్కిరిసి ఉంది. ప్రభుత్వ, సినీ రంగ పెద్దలు ఆసీనులై ఉన్నారు. వేదిక మీద రాష్ట్రపతి ఒక్కొక్కరి పేరు పిలిచి పురస్కారాలు అందిస్తున్నారు. ‘ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార బహూకరణ. గ్రహీత– రాజ్ కపూర్’. ఆ పేరు వినగానే ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది. అందరూ వేదిక మీదకు రాబోతున్న రాజ్ కపూర్ కోసం చూస్తున్నారు. కాని ముందు వరుసలో ఉన్న రాజ్ కపూర్ కుర్చీలో నుంచి లేవలేకపోతున్నారు. కొన్ని నిముషాల ముందే ఆయనకు ఆస్తమా అటాక్ వచ్చింది. అలా రాకూడదని రెండు గంటల ముందు హోటల్లో ఇంజెక్షన్ చేసుకొని వచ్చారు. అయినా వచ్చింది. సభలో ఉన్నవారి ఎదురు చూపు. లేవలేని తన అశక్తత. మాట పెగలట్లేదు. కాని కళ్లు పని చేస్తున్నాయి. కళాకారుడి కళ్లు అవి. ‘నేను వేదిక మీదకు రాలేను రాష్ట్రపతి గారూ’... కళ్లతోనే మొర పెట్టుకున్నారు రాజ్ కపూర్. వేదిక మీద ఉన్న రాష్ట్రపతి కె.వెంకట్రామన్ ఆ కళ్లలోకి చూసి సంగతి గ్రహించారు. ప్రొటోకాల్ పట్టించుకోకుండా స్వయంగా తానే వేదిక దిగి రాజ్ కపూర్ వైపు కదిలారు. ఆయన వస్తుంటే శక్తినంతా కూడగట్టుకుని రాజ్‌కపూర్ లేచి నిలబడ్డారు. ‘దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం’ సగౌరవంగా ఆయనకు దక్కింది. రాష్ట్రపతిని స్జేజ్ మీద నుంచి కిందకు వచ్చేలా చేసిన సంఘటన మరొకటి లేదు. రాజ్ కపూర్ మాత్రం? అలాంటి వాడు మరొకడున్నాడా ఏమిటి?1955.జవహర్లాల్ నెహ్రూ ‘సోవియెట్ యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ రష్యా’ను ప్రధాని హోదాలో సందర్శించారు. ఇరు దేశాల మధ్య స్నేహం వెల్లివిరుస్తున్న సమయం. రష్యన్లను, స్థానిక భారతీయులను ఉద్దేశించి ఇరు దేశాల ప్రధానులు మాట్లాడే సభ. ముందు నెహ్రూ మాట్లాడి జనాన్ని ఉత్సాహ పరిచి కూచున్నారు. నెహ్రూ గొప్ప వక్త. రష్యా ప్రధాని నికొలాయ్ బల్గనిన్కు నెహ్రూని మించి సభను రక్తి కట్టించాలనిపించింది. తన మంత్రులకు సైగ చేశారు. వాళ్లంతా వచ్చి బల్గనిన్ ఇరు పక్కలా నిలుచున్నారు. నెహ్రూకు ఏం అర్థం కాలేదు. ఒక్కసారిగా రష్యా ప్రధాని, మంత్రులు పాట అందుకున్నారు.ఆవారా హూ... ఆవారా హూ..యా గర్దిష్ మే హూ ఆస్మాన్కా తారాహూ ఆవారాహూ...జనం కేరింతలు. నెహ్రూ ఉన్న సభ అది. మార్మోగుతున్నది రాజ్ కపూర్ పేరు. ‘ఉదయాన్నే తెల్లబట్టలు వేసుకొని వెళ్లాలి. సాయంత్రానికి దుమ్ము కొట్టుకుపోయి రావాలి’ అని చెప్పాడు పృథ్వీరాజ్ కపూర్ తన పెద్ద కొడుకు రాజ్ కపూర్‌ని రంజిత్ స్టూడియోలో పనిలో పెట్టి. మెట్రిక్యులేషన్ తర్వాత ‘ఇక చదవను సినిమాల్లో పని చేస్తా’ అని రాజ్ కపూర్ కోరడంతో సినిమా తీయాలంటే అన్ని పనులు తెలియాలి అని స్టూడియో పనిలో పెట్టి పృథ్వీరాజ్ కపూర్ అన్న మాట అది. అప్పటికే ప్రాభవంలో ఉన్న నటుడి కొడుకైనప్పటికీ రాజ్ కపూర్ ఒక ఆర్డినరీ క్లాప్ బాయ్‌లానే జీవితాన్ని మొదలుపెట్టాడు. రంజిత్ స్టూడియో, బాంబే టాకిస్, ఫిల్మ్స్థాన్... వీటన్నింటిలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి చివరకు తండ్రి దగ్గరే పృథ్వీ థియేటర్లో చేరితే పది రూపాయల జీతం, రెండు జతల బట్టలు, వానాకాలంలో ఉచితంగా వాడుకోవడానికి రైన్ కోట్, టోపీ దక్కాయి. రాజ్ కపూర్ అలా రాజ్ కపూర్ అయ్యాడు. తెల్లబట్టలు నల్లగా పీలికలయ్యేంతగా కష్టపడ్డాడు. కష్టం చేసేవాడిని అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. ఈ నీలికళ్ల అందగాడిలో ఏదో ఉంది అని దర్శకుడు కేదార్ శర్మ రాజ్ కపూర్‌తో హీరోగా అతని మొదటి సినిమా ‘నీల్ కమల్’ తీశాడు. హీరోయిన్ పదమూడేళ్ల మధుబాల. ఆడలేదు. అయితే సినిమాల్లో ఫస్ట్ టేక్ ఓకే కాకపోతే రీటేక్ చేయొచ్చు. రీటేక్ కోసం మరింత కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. తెచ్చుకోనివాడు పోతాడు. రాజ్ కపూర్ పడి లేవడం తెలిసినవాడు.రాజ్ కపూర్‌కు పెళ్లయ్యింది (1946). ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడకూడదని తానే ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా ‘ఆగ్’ (1947) తీశాడు. ఏంటి... మూతి మీద సరిగా మీసాలు కూడా రాని కుర్రాడు సినిమా తీయడమా.. ‘ఆగ్’ (మంట) అని టైటిలా? సీనియర్ డిస్ట్రిబ్యూటర్లకు ఒళ్లు మండింది. రాజ్ కపూర్ కనపడితే ‘ఏమయ్యా రాజ్. అన్నీ నువ్వే అయ్యి సినిమా తీస్తున్నావ్. సినిమా హాలు కూడా కట్టుకోరాదూ?’ అన్నారు. ‘హాలెందుకు?’ అనడిగాడు రాజ్ కపూర్. ‘ఎందుకేంటయ్యా. మంట అంటుకుంటే నీ హాలు బూడిదైతే చాలదా? మావన్నీ ఎందుకు?’ అన్నారు. హేళన అలా ఉంటుంది. ‘ఆగ్’ విడుదలైంది. ఓ మోస్తరుగా ఆడింది. నవ్వులు ఆగాయి. రాజ్‌కు తెలుసు... ఈ ప్రయత్నాలన్నీ అడ్డ పెడలు వేసి సైకిలు తొక్కడమేనని. సీటెక్కి తొక్కే సమయానికి తోటి కుర్రాళ్లు తోడవుతారని. అయ్యారు. కె.ఏ. అబ్బాస్ (రచయిత), శంకర్ జైకిషన్ (సంగీత దర్శకులు), ముకేష్ (గాయకుడు), శైలేంద్ర– హస్రత్ జైపూరి (గీత కర్తలు)... వీళ్ల తోడుగా రాజ్ కపూర్ మరో సినిమా తీశాడు. విడుదలైంది.బర్సాత్ (1949). భారీ హిట్. రాజ్ కపూర్ అట... నర్గిస్ అట... పదండి హాళ్లకు... కలుద్దాం వీళ్లను... థియేటర్లలో మంట అంటుకుంది... కలెక్షన్ల మంట... కాసుల మంట.... అగ్గితో కురిసే కుంభవృష్టి.రాజ్‌కపూర్ టీమ్‌కు ఇద్దరు ముఖ్యమైన స్త్రీలు తోడయ్యారు. నర్గిస్, లతా మంగేష్కర్. ‘బర్సాత్’ లో నర్గిస్, రాజ్ కపూర్. ఒక దాని వెంట ఒకటిగా సినిమాలు చేశారు. ఆవారా, ఆహ్, శ్రీ 420, చోరి చోరి.... కేవలం వినోదం రాజ్ కపూర్ ఉద్దేశం కాదు. కథ ఉంటుంది. జనం తమ కథే అనుకునే కథ. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆనాటి రోజుల్లో అగమ్యంగా ఉన్న పేదవాళ్లు, ఎవరికీ పట్టని బీదలకు ప్రతినిధిగా కథానాయకుణ్ణి పెట్టి ‘ఆవారా’ తీశాడు. పని దొరక్క ఉపాధి కోసం వలసకు బయలుదేరి గ్రామీణ నిష్కల్మషం నుంచి నగర పతనాలకు ప్రయాణిస్తూ నైతిక ఘర్షణను ఎదుర్కుంటున్న యువకులకు ప్రతినిధిగా హీరోని పెట్టి ‘శ్రీ420’ తీశాడు. చార్లి చాప్లిన్‌ను పోలిన ఆహార్యం, చలాకీతనం, అమాయకత్వం.. తోడుగా వ్యక్తిత్వం ఉన్న పాత్రల్లో నర్గిస్... ఆ జంట పండింది. క్లాసిక్స్ అందరూ తీస్తారు. కాని కొందరు వాటితో అందరినీ తాకుతారు. సాంస్కృతిక ఆదాన ప్రదానాలలో భాగంగా రష్యాలో సినిమాల విడుదలకు మన దేశం అనుమతించింది. వాటిలో ప్రధానమైనవి రెండు: ‘దో భిగా జమీన్’ (బిమల్ రాయ్ – 1953), ఆవారా (1951). మాస్కోలో మన ప్రభుత్వం పూనికతో ‘దో భిగా జమీన్’ పోస్టర్లు ఎక్కువ పడ్డాయి. ఎందుకంటే రష్యన్లు అలాంటి సినిమాలను మెచ్చుతారని. ఒక్కరోజు. రష్యన్లు దో భిగా జమీన్, ఆవారా రెండూ చూశారు. రాత్రికి రాత్రి అంతా మారిపోయింది. మాస్కో అంతా ఎక్కడ చూసినా ఆవారా పోస్టర్లే. 4 రోజుల్లో 15 లక్షల మంది మూడు నగరాల్లో చూశారు. అదీ రాజ్‌కపూర్. రాజ్ కపూర్ ఏది చేసినా పెద్దగా ఆలోచించి చేసేవాడు. అతడు సన్నివేశాన్ని ముందు సంగీతంతో ఊహిస్తాడని అంటారు. సంగీతం ఇలా ఉంటే సన్నివేశం అలా తీయొచ్చు అనుకుంటాడట. ‘ఆవారా’లో డ్రీమ్ సీక్వెన్సు, ‘శ్రీ 420’లో ‘΄్యార్ హువా ఇక్రార్ హువా’ పాటకు వేసిన సెట్.. సినిమా అంటే విజువల్స్... మ్యూజిక్.... ఇవి రెండు బెస్ట్‌గా ఉంటే సినిమా హిట్. ‘సంగం’కు ఇంకో ఆకర్షణ అమర్చాడు– లొకేషన్స్. విదేశీ లొకేషన్లలో తీసిన మొదటి హిందీ సినిమా అది. భారీ హిట్. ఆ తర్వాతి రోజుల్లో యశ్ చోప్రా ఫార్ములాను స్థిరపరిచాడు. రాజ్‌కపూర్ గొప్పగా కలగని... కాలం కంటే ముందుకెళ్లి రెండు ఇంటర్వెల్స్తో తీసిన ‘మేరా నామ్ జోకర్’ దెబ్బ కొట్టింది. ఇప్పుడు క్లాసిక్‌గా నిలిచింది. ఆ సినిమాలో మూడు ఎపిసోడ్స్ ఉంటాయి. కౌమార స్థితిలోని రిషి కపూర్, అతని టీచర్‌గా సిమి గెరెవాల్... వీరి ఎపిసోడ్ ఫ్రెంచ్ సినిమాకు తగ్గదని విమర్శకులు మెచ్చుకున్నారు. ఆ ఎపిసోడ్‌ను కొనసాగిస్తూ, ‘మేరా నామ్ జోకర్’ను ఫ్లాప్ చేసినందుకు ప్రేక్షకుల మీద ప్రతీకారం తీర్చుకుంటూ రాజ్ కపూర్ తీసిన సినిమాయే ‘బాబీ’. ఈ టీనేజ్ లవ్ స్టోరీ నేటికీ వందల భారతీయ సినిమాలకు కథను అందిస్తూనే ఉంది. రాజ్ కపూర్ ప్రకృతిలోని, మగాడిలోని, స్త్రీలోని స్త్రీత్వాన్ని గొప్పగా పట్టించుకున్న దర్శకుడు. స్త్రీ పురుషుల భావోద్వేగాలను, వీటిని ప్రేరేపించే లేదా నియంత్రించే సాంఘిక పరిమితులు, నియంత్రణలు... వీటినే అతడు ఎక్కువగా కథాంశాలు తీశాడు. అయితే మార్పు గురించి తన తాపత్రయం ఒదులుకోలేదు. ‘జాగ్తే రహో’, ‘బూట్ పాలిష్’, ‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’, ‘దిల్లీ దూర్ నహీ’, ‘సత్యం శివమ్ సుందరం’, ‘ఈ దేశంలో బీదవాళ్లు ఎక్కువ. వారు బాగు పడితే దేశం బాగు పడినట్టే’ అని రాజ్ కపూర్ అంటారు.ఉజ్వలమైన కాలాన్ని చరిత్రలో నుంచి తుడిచి పెట్టడం అసాధ్యం. జనులు మెచ్చిన కళాకారుణ్ణి సాంస్కృతిక పుటల్లో నుంచి చెరిపివేయడం దుస్సాధ్యం. దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్ అతని సరిజోడిగా గొప్ప ప్రతిభ చాటారు. కాని రాజ్ కపూర్ సినిమానే తన జీవితం చేసుకున్నాడు. సినిమా నుంచి పొందాడు. సినిమాకు ఇచ్చాడు. నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, గొప్ప సంగీత సాహిత్యాలకు వారధిగా... దేదీప్యంగా నిలిచిన స్ఫూర్తిగా... ఇలా మరొకరు లేరు.అందుకే రాజ్ కపూర్ శత జయంతి ముగింపును దేశమంతా సగౌరవంగా జరుపుకుంటోంది. రాజ్ కపూర్‌ను గుర్తు చేసుకోవడం ద్వారా తన సినీ సౌందర్యాన్నీ, సినీ రసాత్మకతను గుర్తు చేసుకుంటోంది. ఒక పూట వెచ్చించి రాజ్ కపూర్ సినిమాలు చూసినా, పాటలు విన్నా జీవిత కాలం అంటిపెట్టుకొని పోయే ప్రియమైన కళాకారుడతడు. మళ్లీ మళ్లీ పుట్టడు. అతని కాలంలో మనం ఉన్నాం. అతని శత జయంతి ముగింపులోనూ ఉన్నాం. ఎంత సంతోషం. ఈ ఘనత కొనసాగాలి. ది షో మస్ట్ గో ఆన్.జీనా యహా మర్నా యహా ఇస్కే సివా జనా కహా. -
వాళ్లను బాధపెట్టకూడదనే నేను పెళ్లి చేసుకోలేదు క్లారిటీ ఇఛ్చిన ప్రభాస్
-
అన్ని ఈవెంట్లు ఒక లెక్క బుజ్జి ఈవెంట్ మరో లెక్క ఇది ప్రభాస్ రేంజ్
-
రికార్డు రెమ్యూనరేషన్: ఈ రికార్డ్ సాధించిన తొలి హీరో ఎవరో తెలుసా?
ప్రపంచంలో అత్యంత లాభదాయకమైనచలనచిత్ర పరిశ్రమగా ఇండియన్ సినిమాలు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మనసు దోచుకుంటూ, బాక్సీఫీసు వద్ద వేల కోట్ల రాబడులను సాధిస్తున్నాయి. ఇటివల కొన్ని దశాబ్దాలుగా సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రాంచరణ్, మహేష్ బాబు, విజయ్, రజనీకాంత్ లాంటి హీరోలు సినిమాకు వన్నెతెచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రేక్షకుల్లో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ ఫీజు కొన్నిసార్లు సినిమా మొత్తం బడ్జెట్‌ను మించిపోతోందంటే వీరి క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే బాలీవుడ్లో సౌత్ ఇండియాలో సినిమాకు 100కోట్ల రూపాయలకుపైగా వసూలు చేస్తున్న టాప్ స్లార్లు చాలామందే ఉన్నారు. ఆశ్చర్యకరంగా బాలీవుడ్ బిగ్ స్టార్ల కంటే ఎక్కువ వసూలు చేస్తున్న నటుడు ఎవరో తెలుసా? సల్మాన్, షారూఖ్, అక్షయ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ కాకుండా సినిమాకి 200 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ యాక్టర్‌గా కోలీవుడ్ స్టార్ హీరో రికార్డ్ క్రియేట్ చేశాడని టాక్. (అపుడు తప్పింది..ఇపుడు మింగేసింది: పాకిస్తాన్ టైకూన్ విషాద గాథ) తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి ఇప్పుడు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో. తాజా నివేదికల ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ లియో సినిమాకు రూ. 200 కోట్లు వసూలు చేశాడట. దీనిపై ఇంకా పూర్తి ధృవీకరణ రానప్పటికీ హైయ్యస్ట్ పెయిడ్ హీరో అని టాక్ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. విజయ్ 2021లో వచ్చిన 'మాస్టర్' సినిమాకు 80 కోట్లు, బీస్ట్, వారసుడు సినిమాలకు 100 కోట్లు వసూలు చేశాడని టాక్. తాజాగా దీన్ని రెట్టింపు చేశాడన్నట్టు. 48 ఏళ్ల విజయ్ 27 సంవత్సరాల క్రితం తన నటుడిగా పరిచయం అయ్యాడు. సుమారు 66 చిత్రాలలో ప్రధాన పాత్రల్లో అభిమానులను అలరించాడు స్నేహితులు, కుటుంబ సభ్యులు ప్రేమగా 'జో' అని పిలుచుకునే విజయ్ దళపతి స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. (రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్) విజయ్ ప్రస్తుతం ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న లియో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్-థ్రిల్లర్ మూవీ లియోలో విజయ్ సరసరన త్రిష కృష్ణన్ నటిస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇంకా ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్ తదితరులు నటిస్తున్నారు. 49వ పుట్టినరోజు సందర్భంగా లియో టీమ్ విజయ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో దళపతి విజయ్ నటిస్తున్న లియో మూవీ ఫస్ట్ లుక్ అదిరి పోవడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. అలాగే 'దళపతి 68'లో వెంకట్ ప్రభుతో కలిసి వర్క్ చేస్తున్నాడు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై పూర్తి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. -
స్పేస్ ఎక్స్ ‘చంద్రయాన్’లో భారత నటుడు దీప్ జోషి
వాషింగ్టన్: ‘డియర్ మూన్’ పేరుతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అంతరిక్ష యాత్రకు వెళ్లే బృందంలో బాల్వీర్ టీవీ షోతో దేశవ్యాప్త క్రేజ్ సాధించిన భారత నటుడు దీప్ జోషి చోటు దక్కించుకున్నారు! చంద్రుని సమీపానికి స్పేస్ ఎక్స్ చేపడుతున్న తొలి వాణిజ్య అంతరిక్ష యాత్ర డియర్ మూన్. దాంట్లో అందుబాటులో ఉన్న టికెట్లన్నింటినీ జపాన్ కుబేరుడు యసాకు మజావా కొనుగోలు చేశారు. తన వెంట పలు రంగాల నుంచి 8 మంది ప్రఖ్యాత కళాకారులను తీసుకెళ్లాలని తొలుత భావించినా చివరికి వారిని ఇంటర్వ్యూల ద్వారా ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 10 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఏడాదిన్నర పాటు అనేకానేక వడపోతల అనంతరం జోషితో పాటు ప్రఖ్యాత బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ కరీం ఇలియా, అమెరికా నుంచి ప్రముఖ డీజే, నిర్మాత స్టీవ్ అవోకీ, సినీ దర్శకుడు బ్రెండన్ హాల్, యూట్యూబర్ టిమ్ డాడ్, దక్షిణ కొరియాకు చెందిన కె–పాప్ మ్యుజీషియన్ షొయ్ సెయంగ్ హుయాన్ (టాప్) విజేతలుగా నిలిచారు. వీరంతా వచ్చే ఏడాది స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ వెహికిల్‌లో మజావాతో పాటు 8 రోజుల పాటు అంతరిక్షంలో విహరిస్తారు. 3 రోజులు చంద్రుని చుట్టూ తిరుగుతారు. 22 ఏళ్ల జోషి ఈ బృందంలో అత్యంత పిన్న వయస్కుడు. 2000 నవంబర్‌లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పుట్టారు. పలు గుజరాతీ సినిమాల్లో నటించారు. ‘‘దేవ్ యువోత్సాహం తమకెంతో స్ఫూర్తినిస్తుంది. అందుకే ఆయన్ను ఎంపిక చేసుకున్నాం’’ అని మజావా పేర్కొన్నారు. -
ఆడా ఉంటా.. ఈడా ఉంటా!
‘‘కళను, కళాకారులను ఒక భాషకి, ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు అంటారు. నిజమే.. కళాకారులకు ఎల్లలు ఉండవు. ఆర్టిస్ట్‌గా నేను ఏ ఒక్క ప్రాంతానికో, భాషకో పరిమితం కావాలనుకోవడంలేదు’’ అంటున్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారామె. తెలుగులో ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్ (ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు) అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, హిందీలో సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’, రణ్వీర్ సింగ్‌తో ‘సర్కస్’ చేస్తున్నారు. ఇలా రెండు భాషల్లో బిజీబిజీగా ఉండటం గురించి పూజా మాట్లాడుతూ – ‘‘తెలుగు ప్రేక్షకులు నా మీద చాలా ప్రేమను చూపిస్తున్నారు. ఇప్పటివరకూ చేసిన సినిమాల ద్వారా నన్ను ఎంతగానో ఆదరించారు. చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తున్నా. ఒకేసారి రకారకాల భాషల సినిమాల్లో, వివిధ ప్రాంతాల్లో షూట్ చేయడం మంచి అనుభవం. సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటే. నేను ఏదో ఒక భాషకు చెందిన నటిగా కంటే ఇండియన్ యాక్టర్ అనిపించుకోవాలనుకుంటున్నాను. అదే నాకిష్టం’’ అన్నారు. ప్రస్తుతం చేస్తున్న తెలుగు సినిమాల షెడ్యూల్స్ గురించి చెబుతూ – ‘‘ఈ 25 వరకూ ‘రాధేశ్యామ్’ షూట్లో పాల్గొని, ఆ తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ షూట్లో జాయిన్ అవుతా. జనవరి నుంచి మళ్లీ ‘రాధే శ్యామ్’ సెట్లో ఉంటా’’ అన్నారు పూజా. సో.. పూజా ఆడా ఉంటా.. ఈడా.. ఉంటా అంటున్నారన్న మాట. మంచిదేగా!