First Indian Actor To Charge Rs 200 Crore Per Film Check Who, Deets Inside - Sakshi
Sakshi News home page

రికార్డు రెమ్యూనరేషన్‌: ఈ రికార్డ్‌ సాధించిన తొలి హీరో ఎవరో తెలుసా?

Jun 24 2023 12:58 PM | Updated on Jun 24 2023 2:06 PM

First Indian actor to charge Rs 200 crore per film check who - Sakshi

ప్రపంచంలో అత్యంత లాభదాయకమైనచలనచిత్ర పరిశ్రమగా ఇండియన్‌ సినిమాలు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మనసు దోచుకుంటూ, బాక్సీఫీసు వద్ద  వేల కోట్ల రాబడులను సాధిస్తున్నాయి.  ఇటివల కొన్ని దశాబ్దాలుగా  సూపర్‌ స్టార్లు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, ప్రభాస్, జూ.ఎన్టీఆర్‌, రాంచరణ్‌, మహేష్‌ బాబు, విజయ్, రజనీకాంత్ లాంటి హీరోలు సినిమాకు వన్నెతెచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రేక్షకుల్లో భారీ ‍క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకుంటూ అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారు. ఈ ఫీజు కొన్నిసార్లు సినిమా మొత్తం బడ్జెట్‌ను మించిపోతోందంటే వీరి క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. 

ఇప్పటికే బాలీవుడ్‌లో సౌత్‌ ఇండియాలో సినిమాకు 100కోట్ల రూపాయలకుపైగా వసూలు చేస్తున్న టాప్‌ స్లార్లు చాలామందే ఉన్నారు. ఆశ్చర్యకరంగా బాలీవుడ్‌  బిగ్‌ స్టార్ల కంటే  ఎక్కువ వసూలు చేస్తున్న నటుడు ఎవరో తెలుసా? సల్మాన్, షారూఖ్, అక్షయ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ కాకుండా సినిమాకి 200 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ  యాక్టర్‌గా  కోలీవుడ్‌ స్టార్‌ హీరో రికార్డ్‌ క్రియేట్‌ చేశాడని టాక్‌. (అపుడు తప్పింది..ఇపుడు మింగేసింది: పాకిస్తాన్‌ టైకూన్‌ విషాద గాథ)

తమిళ సూపర్ స్టార్  విజయ్ దళపతి ఇప్పుడు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో. తాజా నివేదికల ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ  లియో సినిమాకు రూ. 200 కోట్లు వసూలు చేశాడట. దీనిపై ఇంకా పూర్తి ధృవీకరణ రానప్పటికీ హైయ్యస్ట్‌ పెయిడ్‌ హీరో అని టాక్‌ హాట్‌ టాపిక్‌గా నిలుస్తోంది. విజయ్ 2021లో వచ్చిన 'మాస్టర్' సినిమాకు 80 కోట్లు,  బీస్ట్, వారసుడు సినిమాలకు 100 కోట్లు వసూలు చేశాడని టాక్‌.  తాజాగా  దీన్ని రెట్టింపు చేశాడన్నట్టు.  48 ఏళ్ల విజయ్ 27 సంవత్సరాల క్రితం తన నటుడిగా పరిచయం అయ్యాడు. సుమారు 66 చిత్రాలలో ప్రధాన పాత్రల్లో అభిమానులను అలరించాడు  స్నేహితులు, కుటుంబ సభ్యులు ప్రేమగా 'జో' అని  పిలుచుకునే విజయ్ దళపతి స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు.   (రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్‌)

విజయ్ ప్రస్తుతం ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న లియో సినిమా షూటింగ్‌లో  బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  గ్యాంగ్‌స్టర్-థ్రిల్లర్  మూవీ లియోలో విజయ్‌ సరసరన త్రిష కృష్ణన్ నటిస్తోంది. అంతేకాదు ఈ  చిత్రంలో బాలీవుడ్‌  నటుడు  సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇంకా ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్ తదితరులు నటిస్తున్నారు.  

49వ పుట్టినరోజు సందర్భంగా లియో టీమ్ విజయ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో దళపతి విజయ్ నటిస్తున్న లియో మూవీ ఫస్ట్ లుక్‌ అదిరి పోవడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. అలాగే 'దళపతి 68'లో వెంకట్ ప్రభుతో కలిసి వర్క్‌ చేస్తున్నాడు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో  యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై పూర్తి అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement