కేటీఎం బైకుల ధరలు పెరిగాయ్.. కొత్త రేట్లు ఇవే! | KTM Hikes Prices Of 160 Duke And RC 160 In India, RC 160 Gets Rs.15,000 Increase, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

కేటీఎం బైకుల ధరలు పెరిగాయ్.. కొత్త రేట్లు ఇవే!

Aug 9 2026 7:46 PM | Updated on Aug 10 2026 9:24 AM

KTM 160 Duke RC 160 Prices Hiked By Up To Rs 15000

కేటీఎం ఇండియా.. తన 160 డ్యూక్, ఆర్‌సీ 160 ధరలను పెంచింది. ఇందులో ఆర్‌సీ 160 ధర గరిష్టంగా రూ.15,000 పెరిగింది. అయితే.. వేరియంట్‌ను బట్టి, 160 డ్యూక్ ధర రూ.12,000 నుంచి రూ.13,000 మధ్య పెరిగింది.

జీఎస్టీ రేట్లలో మార్పుల నేపథ్యంలో.. సెప్టెంబర్‌లో కేటీఎం ధరలను తగ్గించిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత, కేటీఎం తన బైకుల ధరలను పెంచింది. అయితే.. 350సీసీ వరకు ఇంజిన్ ఆప్షన్స్ కలిగిన ద్విచక్ర వాహనాలపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో, కంపెనీ చిన్న మోటార్‌సైకిళ్ల ధరలు తగ్గాయి.

కేటీఎం 160 డ్యూక్
160 డ్యూక్ స్టాండర్డ్ వెర్షన్ ధర గతంలో రూ.1.71 లక్షలు ఉండగా, ఇప్పుడు అది రూ.1.84 లక్షలకు చేరింది. దీంతో దీని ధర రూ.13,000 పెరిగింది. అధిక స్పెసిఫికేషన్లు గల TFT వేరియంట్ ధర రూ.1.79 లక్షల నుంచి రూ. 1.91 లక్షలకు పెరిగింది. అంటే దీని ధర రూ. 12,000 పెరిగిందన్నమాట.

కేటీఎం ఆర్‌సీ 160
ఆర్‌సీ 160 ధర రూ.15,000 పెరిగింది. ఈ ఏడాది జనవరిలో భారతదేశంలో రూ.1.85 లక్షలకు విడుదలైన ఈ ఫుల్లీ ఫెయిర్డ్ మోటార్‌సైకిల్ ధర ఇప్పుడు రూ. 2 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. ఈ బైక్ 164.2 సీసీ ఇంజన్‌ను కలిగి.. 18.7 bhp పవర్, 15.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement